AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Building Demolition: వేగంగా సాగుతోన్న డెక్కన్‌మాల్‌ కూల్చివేత పనులు.. ఎలాంటి అడ్డంకులు ఎదురుకాకపోతే..

చుట్టుపక్కల భవనాలకు ఎలాంటి నష్టం జరగకుండా కూల్చివేత పనులు చేయిస్తున్నారు అధికారులు. పోలీస్‌, ఫైర్‌ సిబ్బంది పర్యవేక్షణలో జరుగుతున్నాయి పనులు.

Building Demolition: వేగంగా సాగుతోన్న డెక్కన్‌మాల్‌ కూల్చివేత పనులు.. ఎలాంటి అడ్డంకులు ఎదురుకాకపోతే..
Deccan Mall Demolish
Sanjay Kasula
|

Updated on: Jan 27, 2023 | 8:08 AM

Share

అగ్నిప్రమాదంలో దెబ్బతిన్న డెక్కన్‌ మాల్‌ కూల్చివేత పనులు వేగంగా సాగుతున్నాయి. నిన్న రాత్రి నుంచి కూల్చివేత పనులు జరుగుతున్నాయి. చుట్టుపక్కల భవనాలకు ఎలాంటి నష్టం జరగకుండా కూల్చివేత పనులు చేయిస్తున్నారు అధికారులు. పోలీస్‌, ఫైర్‌ సిబ్బంది పర్యవేక్షణలో జరుగుతున్నాయి పనులు. భారీ క్రేన్‌ సాయంతో కూల్చివేత పనులు చేస్తోంది కాంట్రాక్ట్‌ సంస్థ. అయితే, ఇప్పటివరకు పది పన్నెండు శాతం పనులు మాత్రమే కంప్లీట్‌ చేసింది. బిల్డింగ్‌ 80శాతం డ్యామేజ్‌ కావడంతో అత్యంత జాగ్రత్తగా పనులు చేస్తోంది. బిల్డింగ్‌ పక్కకు ఒరగకుండా సెల్లార్‌లో ర్యాంప్‌ ఏర్పాటు చేశారు.

ఎలాంటి అడ్డంకులు ఎదురుకాకపోతే 5రోజుల్లో కూల్చివేత పనులు కంప్లీట్ కానున్నాయి. పక్క భవనాలకు ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితులు వస్తే మాత్రం మరింత ఆలస్యంకావడం ఖాయంగా కనిపిస్తోంది.

ఇవన్నీ పక్కనబెడితే, డెక్కన్‌ మాల్‌ దగ్గర పెను ప్రమాదం పొంచివున్నట్టే కనిపిస్తోంది. కూల్చివేత పనులు చేస్తోన్న కాంట్రాక్ట్‌ సంస్థ.. ఎలాంటి సేఫ్టీ ప్రికాషన్స్‌ తీసుకోకపోవడం ఆందోళన కలిగిస్తోంది. కూల్చివేతలు చేస్తుండగా భవన శిథిలాలు పక్క బిల్డింగ్స్‌ పడుతున్నాయి. డెక్కన్ మాల్‌ చుట్టూ ఎలాంటి పరదాలు కట్టకుండానే కూల్చివేతలు చేస్తోంది కాంట్రాక్ట్‌ సంస్థ.

క్రేన్‌కు ఆరో ఫ్లోర్‌ అందకపోవడంతో ఐదో అంతస్థు నుంచి కూల్చివేతలు చేస్తున్నారు. ఇది కూడా ఆందోళన కలిగిస్తోంది. 80శాతం దెబ్బతిన్న బిల్డింగ్‌ పూర్తి బలహీనంగా మారింది. దాంతో, ఆచితూచి కూల్చివేతలు చేస్తున్నారు వర్కర్లు. ఏమాత్రం తొందరపడినా పక్క భవనాలపై ఒరిగే ప్రమాదం కనిపిస్తోంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం