Bengaluru: “ప్రేమిస్తావా.? లేదా.?” యువతి గొంతు కోసి హత్య చేసిన దుండగుడు.. వీడియోలో షాకింగ్ నిజాలు..
యలహంకలో నడుచుకుంటూ వెళుతోన్న యువతిని వెంబడించిన దుండగుడు.. కత్తితో గొంతుకోసి హత్య చేశాడు. ఈ దారుణానికి ఒడిగట్టింది
కర్ణాటకలో మరో దారుణం వెలుగు చూసింది. బెంగుళూరు మహానగరంలో మహిళలపై అఘాయిత్యాలు హడలెత్తిస్తున్నాయి. ప్రేమను తిరస్కరించిన నేరానికి రాశి అనే విద్యార్థిని అత్యంత దారుణంగా హతమార్చాడు ఓ దుర్మార్గుడు. యలహంకలో నడుచుకుంటూ వెళుతోన్న యువతిని వెంబడించిన దుండగుడు.. కత్తితో గొంతుకోసి హత్య చేశాడు. ఈ దారుణానికి ఒడిగట్టింది మధుచంద్ర అనే టెంపో డ్రైవర్ గా పోలీసులు గుర్తించారు. యలహంక ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతోన్న రాశిని గత కొంతకాలంగా ప్రేమించాలని వేధిస్తోన్నాడు మధుచంద్ర అనే టాక్సీ డ్రైవర్. ఒంటరిగా నడుచుకుంటూ వెళుతున్న యువతినిని వెంబడించిన నిందితుడు.. “ప్రేమిస్తావా? లేదా” అంటూ రాశి గొంతుపై కత్తిపెట్టి నిలదీశాడు. రాశి ఆ యువకుడి ప్రేమను తిరస్కరించడంతో కత్తితో గొంతుకోసి అత్యంత దారుణంగా హతమార్చాడు మధుచంద్ర. తీవ్రంగా గాయపడ్డ బాధితురాలిని స్థానికులు ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. ఇటీవల రాజానుకుంటలో విద్యార్థిని దారుణ హత్య మరువక ముందే మరో ఘటన బెంగుళూరులో ఆందోళనకు గురిచేస్తోంది. కాగా, ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు..
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Kantara Movie: అరెరె.. ‛కాంతార’ చిత్రంలో ఈ లాజిక్ ఎలా మిస్సయ్యారబ్బా..? వీడియో వైరల్..
వీళ్లు మామూలు దొంగలు కాదు.. ఏకంగా సెల్ టవర్లనే..
ఆటోలో 4.5 లక్షల నగలు మర్చిపోయిన మహిళ.. చివరికి..
అనారోగ్యం పాలైన భర్త.. బైక్ మెకానిక్‌గా మారిన భార్య
రోజూ నందీశ్వరుడికి ప్రదక్షిణలు చేస్తున్న నాగుపాము
వరికోత కోస్తున్న కూలీలు..దుబ్బుల మాటున ఉన్నది చూసి హడల్
పోలీస్ స్టేషన్ సమీపంలోనే రెచ్చిపోయిన దొంగలు.. ఏం చేశారో చూడండి
మహిళా పోలీసుల అండర్ కవర్ ఆపరేషన్.. ఆరుగురు అరెస్ట్

