పోకిరీల తిక్కకుదిర్చిన షీ టీమ్స్‌.. అమ్మాయిల జోలికెళ్తే తాటతీస్తామని వార్నింగ్‌

ఆడపిల్లల్ని, స్త్రీలను వేధించే ఆకతాయిల పట్ల కఠినంగా వ్యవహరిస్తామని, అటువంటి వారి మీద చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని రాచకొండ కమిషనర్ డి. ఎస్. చౌహాన్ తెలిపారు..

పోకిరీల తిక్కకుదిర్చిన షీ టీమ్స్‌.. అమ్మాయిల జోలికెళ్తే తాటతీస్తామని వార్నింగ్‌
She Teams
Follow us
Srilakshmi C

|

Updated on: Feb 09, 2023 | 4:03 PM

ఆడపిల్లల్ని, స్త్రీలను వేధించే ఆకతాయిల పట్ల కఠినంగా వ్యవహరిస్తామని, అటువంటి వారి మీద చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని రాచకొండ కమిషనర్ డి. ఎస్. చౌహాన్ తెలిపారు. షి టీమ్స్ ఆధ్వర్యంలో ఈవ్ టీజర్ల కౌన్సిలింగ్ కార్యక్రమంలో కమిషనర్ డిఎస్. చౌహాన్ గారు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం స్త్రీల సంరక్షణ కోసం అనేక చర్యలు తీసుకుంటోందని, ఆకతాయిలు, గృహహింస, పని ప్రదేశాల్లో వేధింపుల వంటి అనేక రకాల ఇబ్బందుల నుంచి రక్షించేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపడుతోందని తెలిపారు. రాచకొండ పోలిస్ కమిషనరేట్ పరిధిలో ఆడపిల్లల భద్రత కోసం పోలీసులు షి టీమ్ ల ద్వారా ఎన్నో కార్య్రమాలను నిర్వహిస్తున్నారని, ఆకతాయిలకు కౌన్సిలింగ్ ద్వారా వారి చెడు ప్రవర్తన ను మార్చుకోవడానికి, తిరిగి బాధ్యత గల పౌరులుగా మారే అవకాశం కల్పిస్తున్నారు.

ఆడవారికి ఎదురయ్యే భౌతిక పరమైన దాడులు, లైంగిక వేదింపులు, ప్రయాణ సమయాల్లో వేదింపులు వంటి ఇబ్బందుల నుంచి రక్షించేందుకు రాచకొండ పోలీసులు ఇరవై నాలుగు గంటలూ అందుబాటులో ఉంటున్నారని పేర్కొన్నారు. పురుషులు సాటి ఆడవారి పట్ల బాధ్యతగా, మర్యాదగా నడుచుకోవాలని, వారికి అండగా నిలవాలని, పలు రకాల అవసరాలతో ఇంటి నుంచి బయటకు వచ్చే స్త్రీలకు ఎలాంటి ఇబ్బందులు కలిగించకూడదన్నారు. స్త్రీలను గౌరవించడం తమ వ్యక్తిత్వంలో భాగం కావాలని, ఆడవారిని ఇబ్బందులు పెట్టే వారిని ఉపేక్షించేది లేదని, అటువంటి వారి పట్ల కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. గడిచిన రెండు నెలల్లో షి టీమ్స్ ఈవ్ టీజర్ల మీద 118 కేసులు నమోదు చేశారు. వాటిలో 33 FIR, 41 పెట్టీ కేసులు, 44 కౌన్సెలింగ్ కేసులు నమోదు చేయడం జరిగింది. మొత్తం 247 మంది ఆకతాయిలను అరెస్టు చేసినట్లు రాచకొండ కమిషనర్ డి. ఎస్. చౌహాన్ తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.