- Telugu News Photo Gallery Spiritual photos Samatha Kumbh Brahmotsavam photos on 09 02 2023 in Hyderabad Telugu spiritual Photos
Samatha kumbh 2023: శ్రీరామానుజాచార్య-108 దివ్యదేశాల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఘనంగా 8వ రోజు.. ఫొటోస్.
చిన జీయర్‌స్వామి ఆధ్వర్యంలో సమతా కుంభ్-2023 బహ్మోత్సవాల్లో భాగంగా సకల లోక రక్షకుడికి, సర్వరూప ధారుడికి, సర్వనామ సంకీర్తికి, 108 రూపాలలో చారిత్రాత్మక, అపూర్వ, అద్భుతంగా జరిగిన కార్యక్రమ ఫోటోలు..
Updated on: Feb 09, 2023 | 7:01 PM

సమతాకుంభ్-2023-శ్రీరామానుజాచార్య-108 దివ్యదేశాల బ్రహ్మోత్సవాల్లో భాగంగా 8వ రోజు ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి.

ఈ రోజు ఉదయం యాగశాల ప్రాంగణంలోని ఆచార్య సన్నిధిలో ప్రధమంగా గురుపరంపర అనుసంధానం జరిగింది.

తర్వాత అంగన్యాసం, కరన్యాసం సహిత మంత్ర అనుష్ఠానం భక్తులతో చేయించారు. యాగశాలలో భగవంతుని ఆరాధన సేవా కాలం, శాంతిపాఠం, వేద విన్నపాలు, వేద పారాయణాలు చేశారు.

పూర్ణాహుతి వేద విన్నపాలు, ప్రసాద వితరణ, యాగశాలలో యజమానులకు మంగళా శాసనాలతో కార్యక్రమం సుసంపన్నమైంది. ఆ తర్వాత నిత్య పూర్ణాహుతి, బలిహరణ కార్యక్రమాలు జరిపించారు.

సమతా కుంభ్ 2023 బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు.ఆచార్య వరివస్య కార్యక్రమం సందర్భంగా 108 దివ్యదేశాల మూర్తుల నుంచి పూలమాలలు తీసుకొచ్చి రామానుజులవారికి సమర్పించారు.

మొదటగా శ్రీరంగం రంగనాథస్వామి రామానుజుల స్వామికి మర్యాదపూర్వకంగా శేషమాల సమర్పించారు. ఆఖరుగా దివ్యసాకేత క్షేత్రంలో ఉండే వైకుంఠనాథుడిల మంగళశాసనాన్ని రామానుజులవారికి సమర్పించారు.

ఇంతటి వైభవాన్ని సేవించుకునే అదృష్టం మనకు కలిగిందని శ్రీ చినజీయర్ స్వామి అన్నారు.ప్రతి రోజు పూర్ణాహుతి తర్వాత తిరుమంజనం జరిగేదని...

ఈ రోజు మాత్రం కాస్త విశ్రాంతి ఉంటుందని శ్రీ చినజీయర్ స్వామి అన్నారు. నిన్నటి సాయంకాలం అంతా నౌకావిహారోత్సవాన్ని దర్శనం చేసుకున్నామని అందులో స్వామి హంసవాహనంపై 19 రూపాల్లో దర్శనం ఇచ్చారని చిన జీయర్ స్వామి చెప్పారు.

ఆచార్యులలో రామానుజుల వారికి మంగళశాసనాలు చేస్తాం. చివరగా మన గ్రంథాలకు మంగళశాసనాలు చేసుకుంటామన్నారు.

ఒక్కో క్షేత్రానికి ఒక్కో మంగళశాసనం ఉంటుందని,అలాగే కొన్నిచోట్ల ఒక్కో పెరుమాళ్‌కు కూడా మంగళశాసనం ఉంటుందని చిన జీయర్ స్వామి తెలిపారు..

ఇప్పుడు 108 దివ్యదేశాలకు కూడా ఒక మంగళశాసనం ఉందన్నారు. ఇక్కడ ఉండే రామానుజులవారిని లోకమంతా కోరుకున్న తిరుమేని...

అంటే లోకమంతా ఉజ్జీవంపజేసే తిరుమేని అంటాం అని చిన జీయర్ స్వామి భక్తులకు ఉపదేశం చేశారు.భక్తులకు సమతామూర్తి మంగళశాసన శ్లోకాలను వినిపించారు.

ఆచార్య వరివస్య కార్యక్రమం సందర్భంగా 108 దివ్యదేశాల మూర్తుల నుంచి పూలమాలలు తీసుకొచ్చి రామానుజులవారికి సమర్పించారు. మొదటగా శ్రీరంగం రంగనాథస్వామి రామానుజుల స్వామికి మర్యాదపూర్వకంగా శేషమాల సమర్పించారు.

ఆఖరుగా దివ్యసాకేత క్షేత్రంలో ఉండే వైకుంఠనాథుడిల మంగళశాసనాన్ని రామానుజులవారికి సమర్పించారు. ఇంతటి వైభవాన్ని సేవించుకునే అదృష్టం మనకు కలిగిందని శ్రీ చినజీయర్ స్వామి అన్నారు.
