Shocking Video: రెప్పపాటులో ఊహించని యాక్సిడెంట్.. గింగిరాలు తిరిగిన ఆటో.. షాకింగ్ దృశ్యాలు వైరల్!

యాక్సిడెంట్లు..ఎప్పుడు, ఎక్కడ, ఎట్నుంచి జరుగుతాయో ఎవరూ ఊహించలేరు. కొన్ని సార్లు..మనం ఎంత జాగ్రత్తగా వెళ్తున్నప్పటికీ..అవతలి వారు చేసే..

Shocking Video: రెప్పపాటులో ఊహించని యాక్సిడెంట్.. గింగిరాలు తిరిగిన ఆటో.. షాకింగ్ దృశ్యాలు వైరల్!
Accident
Follow us
Ravi Kiran

|

Updated on: Jun 29, 2021 | 12:36 PM

యాక్సిడెంట్లు..ఎప్పుడు, ఎక్కడ, ఎట్నుంచి జరుగుతాయో ఎవరూ ఊహించలేరు. కొన్ని సార్లు..మనం ఎంత జాగ్రత్తగా వెళ్తున్నప్పటికీ..అవతలి వారు చేసే తప్పులతో ప్రమాదాలు జరుగుతుంటాయి. ర్యాష్‌ డ్రైవింగ్‌, తాగి వాహనాలు నడపడం వల్ల జరిగే ప్రమాదాలతో అనేక కుటుంబాల్లో తీరని విషాదం మిగులుతోంది. ఓవర్‌ స్పీడ్‌, సిగ్నల్ జంప్ చేయడం.. నిర్లక్ష్యంగా వాహనం నడపడం.. ఎదురుగా వచ్చే వాహనాలను చూసుకోకుండా వెళ్లిపోవడం వంటి చిన్నచిన్న తప్పులే దారుణాలకు దారితీస్తున్నాయి. అలాంటి ఓ ఘటన తాజాగా హైదరాబాద్‌లో వెలుగుచూసింది. దీనికి సంబంధించిన వీడియో సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ ట్విట్టర్‌లో షేర్ చేయగా.. అది కాస్తా వైరల్ అయింది.

నగరంలోని ఇనార్బిట్ మాల్ సమీపంలో జరిగిన ఈ ప్రమాదం షాక్‌కు గురిచేస్తోంది. రెప్పపాటులో అంతా జరిగిపోయింది. ఓవర్ స్పీడ్‌తో వస్తోన్న ఓ కారు.. ఆటోను ఢీకొట్టింది. దీనితో ఆటో గిరగిరా తిరుగుతూ డివైడర్‌ని ఢీకొట్టి బోల్తాపడింది. ఈ ఘోర ప్రమాదంలో పాసెంజర్ మృతి చెందినట్లు తెలుస్తోంది. అటు అటో డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయని సమాచారం. జూన్‌ 27వ తేదీ తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. కాగా, యాక్సిడెంట్‌ దృశ్యాలు సమీప సీసీ ఫుటేజీలో రికార్డు కావడంతో సీన్‌ వెలుగులోకి వచ్చింది.

Also Read:

ఈ ఫోటోలో మరో చిరుత దాగుంది.. కనిపెట్టగలరా! గుర్తు పట్టలేదా.? అయితే ఈ క్లూ ట్రై చేయండి..

పాపం ఈ అక్క కష్టం ఎవరికీ రావొద్దు.. వీడియోను నవ్వకుండా చూడండి మీకోసమే.!

బర్త్‌డే పార్టీకి సింహం చీఫ్ గెస్ట్.. వైరల్‌గా మారిన వీడియో.. చివర్లో అదిరిపోయే ట్విస్ట్!

తెలుగు వార్తలు లైవ్ ఇక్కడ చూడండి