- Telugu News Photo Gallery Political photos Tpcc chief rewanth reddy attended the swearing in of dharpalli rajesekhar reddy as corporator at ghmc office
జీహెచ్ఎంసీ కార్యాలయానికి పీసీసీ చీఫ్.. శుభాకాంక్షలు తెలిపిన మేయర్ గద్వాల విజయలక్ష్మి
పీసీసీ కొత్త అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి ఎన్నిక అయిన విషయం తెలిసిందే. అయితే ఈ క్రమంలో ఆయనకు పలువురు నేతలు శుభాకాంక్షలు తెలిపారు. ఈ క్రమంలో జీహెచ్‌ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి శుభాకాంక్షలు తెలిపారు.
Updated on: Jun 29, 2021 | 2:41 PM

పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి జీహెచ్ఎంసీ కౌన్సిల్ హాల్‌కు వెళ్లారు. లింగోజిగూడా కార్పోరేటర్ ధర్పల్లి రాజశేఖర్ రెడ్డి ప్రమాణ స్వీకారం ఉండటంతో మేయర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు.

పీసీసీ చీఫ్‌గా ఎంపికైనా రేవంత్ రెడ్డిని మేయర్ మేయర్ గద్వాల విజయలక్ష్మి శుభాకాంక్షలు తెలిపారు. పుష్పగుచ్చం ఇచ్చి స్వాగతం పలికారు.

జీహెచ్ఎంసీ వర్చువల్ మీటింగ్ జరుగుతున్న సమయంలో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, కార్పొరేటర్ శేఖర్ రెడ్డితో నేరుగా మీటింగ్ హాల్‌కు వచ్చారు.

ఇటీవల జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో లింగోజిగూడ డివిజన్ నుంచి కాంగ్రెస్ కార్పొరేటర్‌గా ధర్పల్లి రాజశేఖర్ రెడ్డి గెలుపొందారు. ఈ సంర్భంగా ఆయనతో మేయర్ విజయ లక్ష్మి కౌన్సిలర్‌గా ప్రమాణ స్వీకారం చేయించారు.

అనంతరం కౌన్సిల్ వర్చువల్ మీటింగ్‌ను మేయర్ విజయ లక్ష్మి కొనసాగించారు.

జీహెచ్ఎంసీ వర్చువల్ మీటింగ్‌లో బల్దియా మేయర్లు హాజరయ్యారు. పలు అంశాలపై చర్చించారు.
