AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: బర్త్‌డే పార్టీకి సింహం చీఫ్ గెస్ట్.. వైరల్‌గా మారిన వీడియో.. చివర్లో అదిరిపోయే ట్విస్ట్!

సాధారణంగా మనం జరుపుకునే బర్త్‌డే పార్టీలకు ఫ్రెండ్స్‌, బంధువులు, కుటుంబసభ్యులను పిలుస్తుంటాం. అయితే ఇక్కడ ఓ మహిళ బర్త్ డే పార్టీకి..

Viral Video: బర్త్‌డే పార్టీకి సింహం చీఫ్ గెస్ట్.. వైరల్‌గా మారిన వీడియో.. చివర్లో అదిరిపోయే ట్విస్ట్!
Lion Viral Video
Ravi Kiran
|

Updated on: Jun 29, 2021 | 12:32 PM

Share

సాధారణంగా మనం జరుపుకునే బర్త్‌డే పార్టీలకు ఫ్రెండ్స్‌, బంధువులు, కుటుంబసభ్యులను పిలుస్తుంటాం. అయితే ఇక్కడ ఓ మహిళ బర్త్ డే పార్టీకి ఏకంగా మృగరాజు ముఖ్య అతిధిగా విచ్చేసింది. సదరు మహిళ ఆ సింహాన్ని గొలుసలతో కట్టేసి కూర్చోబెట్టింది. ఈ ఘటన పాకిస్తాన్‌లో చోటు చేసుకుంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

పాకిస్తాన్‌కు చెందిన సుసాన్ ఖాన్ అనే మహిళ లాహోర్‌లోని ఓ ఫైవ్ స్టార్ హోటల్‌లో జన్మదిన వేడుకలను జరుపుకుంది. ఆ బర్త్‌డే పార్టీకి సింహాన్ని ముఖ్య అతిధిగా తీసుకొచ్చింది. దానిని కూర్చోబెట్టి కట్టేసింది. కొందరు ఆ మృగరాజుతో ఆటలు కూడా ఆడుకున్నారు. ఇక ఆ వీడియోను సుసాన్.. తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయగా.. అది కాస్తా వైరల్‌గా మారింది. దానితో ఆమె చిక్కుల్లో పడింది.

ప్రొటెక్ట్ యానిమల్స్ అనే సంస్థకు చెందిన ప్రతినిధులు ఆ వీడియోను తమ ఇన్‌స్టాలో పోస్ట్ చేసి సుసాన్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ”మేము పుట్టినరోజు పార్టీలకు వ్యతిరేకం కాదు. కానీ మూగజీవాలను ఓ వస్తువులా పార్టీలకు తీసుకొచ్చి వాటితో ఆనందం పొందటం తప్పు. దానిని మేము వ్యతిరేకిస్తాం” అని పేర్కొన్నారు. కాగా, ఈ వీడియోను చూసిన నెటిజన్లు.. మూగజీవాలను హింసిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. వరుసపెట్టి కామెంట్స్, రీ-ట్వీట్స్‌తో హోరెత్తిస్తున్నారు.

Also Read:

 ఈ ఫోటోలో మరో చిరుత దాగుంది.. కనిపెట్టగలరా! గుర్తు పట్టలేదా.? అయితే ఈ క్లూ ట్రై చేయండి..

పాపం ఈ అక్క కష్టం ఎవరికీ రావొద్దు.. వీడియోను నవ్వకుండా చూడండి మీకోసమే.!

తెలుగు వార్తలు లైవ్ ఇక్కడ చూడండి 

Follow Us
స్టార్ హీరోతో సినిమా.. కానీ తప్పుకోవాలనిపించింది..
స్టార్ హీరోతో సినిమా.. కానీ తప్పుకోవాలనిపించింది..
హైదరాబాద్-ముంబై బుల్లెట్ ట్రైన్‌పై మరో అప్డేట్
హైదరాబాద్-ముంబై బుల్లెట్ ట్రైన్‌పై మరో అప్డేట్
మూసివేత అంచున ఉన్న బడికి ఊపిరి పోసిన డప్పు దరువు!
మూసివేత అంచున ఉన్న బడికి ఊపిరి పోసిన డప్పు దరువు!
గోల్డ్‌ చైన్‌లను పసుపు నీటిలో వేసి వెళ్లిపోయాడు.. తర్వాత చూస్తే!
గోల్డ్‌ చైన్‌లను పసుపు నీటిలో వేసి వెళ్లిపోయాడు.. తర్వాత చూస్తే!
2027లో కప్ కొట్టాలంటే 5వ స్థానంలో ఆ పులిని దింపాల్సిందే గంభీర్
2027లో కప్ కొట్టాలంటే 5వ స్థానంలో ఆ పులిని దింపాల్సిందే గంభీర్
పక్కా కొలతల్లో నెల రోజులైనా చెడిపోని సుతిమెత్తని రవ్వ లడ్డు..
పక్కా కొలతల్లో నెల రోజులైనా చెడిపోని సుతిమెత్తని రవ్వ లడ్డు..
ఏపీలో మరో కొత్త పథకం.. త్వరలోనే అమలు.. వీరందరికీ లబ్ది
ఏపీలో మరో కొత్త పథకం.. త్వరలోనే అమలు.. వీరందరికీ లబ్ది
వణికించిన ప్రమాదం.. లిఫ్ట్ జారి పడటంతో మహిళ దుర్మరణం! ఎక్కడంటే..
వణికించిన ప్రమాదం.. లిఫ్ట్ జారి పడటంతో మహిళ దుర్మరణం! ఎక్కడంటే..
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంపై NHRC సీరియస్
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంపై NHRC సీరియస్
చదువు మధ్యలో మానేస్తే స్కాలర్‌షిప్ మొత్తం తిరిగి చెల్లించాల్సిందే
చదువు మధ్యలో మానేస్తే స్కాలర్‌షిప్ మొత్తం తిరిగి చెల్లించాల్సిందే