Viral Video: బిజీ రోడ్డుపైకి బుజ్జి కుక్కలు.. దారి తప్పిన వాటిని ఓ దరి చేర్చిన మహిళంటూ నెటిజన్ల భావోద్వేగం! వైరలవుతోన్న వీడియో

ఆ రోడ్డు చాలా బిజీగా ఉంది. వేలాది కార్లతో రద్దీగా మారిన ఆ రోడ్డుపైకి మూడు బుజ్జి కుక్కలు వచ్చాయి. కార్ల శబ్దంతోపాటు రోడ్డు అవతలకు వెళ్లే దారి తెలియక అరుస్తున్నాయి.

Viral Video: బిజీ రోడ్డుపైకి బుజ్జి కుక్కలు.. దారి తప్పిన వాటిని ఓ దరి చేర్చిన మహిళంటూ నెటిజన్ల భావోద్వేగం! వైరలవుతోన్న వీడియో
Dog Viral Videos
Follow us
Venkata Chari

|

Updated on: Jun 29, 2021 | 12:47 PM

Viral Video: ఆ రోడ్డు చాలా బిజీగా ఉంది. వేలాది కార్లతో రద్దీగా మారిన ఆ రోడ్డుపైకి మూడు బుజ్జి కుక్కలు వచ్చాయి. కార్ల శబ్దంతోపాటు రోడ్డు అవతలకు వెళ్లే దారి తెలియక అరుస్తున్నాయి. ఇంతలో ఓ జంతు ప్రేమికురాలు వాటి బాధను చూసింది. ఎలాగైన వాటిని కాపాడాలనుకుంది. రోడ్డు పక్కకు కారును ఆపింది. తన కార్ డోర్‌లు ఓపెన్ చేసి వాటిని కారులోపలికి ఎక్కించే ప్రయత్నం చేస్తోంది. అవి అటూ ఇటూ చూస్తూ ఉన్నాయే తప్ప ఎంతకీ కారులోకి ఎక్కడం లేదు. ఇంతలో ఒ కుక్క ఎలాగో కారులో దూకింది. మరో పక్క నుంచి ఓ మహిళ వచ్చి కుక్కలను కారులో ఎక్కించేందుకు ఆమెకు సహాయం చేసింది. దీన్ని వెనకాల కారులో ఉన్నవారు రికార్డు చేశారు. బ్రియాన్ మోగ్‌కు అనే యూజర్ నెక్స్ట్‌డోర్ అనే ఖాతాతో ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. ఈ వీడియో ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌ గా మారింది. కొంతమంది చాలామంచి పనిచేశావంటూ మెచ్చుకోగా, నీకు సహాయం చేసిన వారికి కూడా ధన్యవాదాలు అంటూ కామెంట్లు రాసుకొచ్చారు.

“ఎత్తైన హీల్స్‌తోనూ ఆమె సాధించింది” ఒక యూజర్ అంటే, “ఇది నన్ను ఏడిపించింది. కొంతమందైనా ఇలాంటి అద్భుతమైన హృదయాలు ఉన్నాయి” అంటూ మరో యూజర్ భావోద్వేగంతో కామెంట్ చేశారు. “జంతువులను కాపాడేవారిని దేవుడు ఆశీర్వదిస్తాడని” మరొక యూజర్ కామెంట్ చేశాడు. “నాకు చాలా నచ్చిందని” ఒకరు అనగా, ” నాకు నిజంగా ఏడుపొచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో నా బేబీ ని ఊహించుకోలేను. కాపాడినవారికి చాలా ధన్యవాదాలు” అంటూ మరో యూజర్ కామెంట్ చేశారు.

View this post on Instagram

A post shared by Nextdoor (@nextdoor)

Also Read:

Viral Video: బర్త్‌డే పార్టీకి సింహం చీఫ్ గెస్ట్.. వైరల్‌గా మారిన వీడియో.. చివర్లో అదిరిపోయే ట్విస్ట్!

Viral Video: పాపం ఈ అక్క కష్టం ఎవరికీ రావొద్దు.. వీడియోను నవ్వకుండా చూడండి మీకోసమే.!

Sreekutty: ‘శ్రీకుట్టి’ ఇక లేదు; పాపం ఈ ఏనుగు పిల్లకు అన్నీ కష్టాలే అంటూ నెటిజన్ల నివాళులు!

ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?