Hyderabad: పేద, మధ్య తరగతి వాళ్లే టార్గెట్.. ఫ్రీలాంచ్ ఆఫర్ పేరుతో హైదరాబాద్‌లో రూ.కోట్లలో మోసం..
పేద, మధ్య తరగతి వారే టార్గెట్.. తక్కువ ధరకే ఇళ్లు కట్టిస్తామంటూ ఆశ చూపిస్తారు. ఆ తర్వాత నిలువునా ముంచేస్తారు. హైదరాబాద్ అడ్డాగా జరిగిన..
పేద, మధ్య తరగతి వారే టార్గెట్.. తక్కువ ధరకే ఇళ్లు కట్టిస్తామంటూ ఆశ చూపిస్తారు. ఆ తర్వాత నిలువునా ముంచేస్తారు. హైదరాబాద్ అడ్డాగా జరిగిన రియల్ దందా కలకలం రేపింది. ప్రీలాంఛ్ పేరుతో అమాయకులను మోసం చేసిన ఘటన కూకట్‌పల్లిలో వెలుగులోకి వచ్చింది.
కేపీహెచ్‌బికి చెందిన జయత్రి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఎండీ కాకర్ల శ్రీనివాస్.. హైదరాబాద్, సైబరాబాద్ పరిసరాల్లోని కొంతమంది భూమి యజమానులతో ఒప్పందాలు చేసుకున్నారు. వాటిని అమాయకులకు చూపించి ఇక్కడ భారీ అపార్ట్‌మెంట్, షాపింగ్ కాంప్లెక్స్ నిర్మిస్తున్నామంటూ నమ్మబలికారు.
ఈ మాటలు నమ్మి చాలా మంది డబ్బులిచ్చారు. ఒక్కొక్కరూ 10 లక్షల రూపాయల మేర ముట్టజెప్పారు. నెలలు జరుగుతున్నా ఆ స్థలంలో ఎలాంటి నిర్మాణాలు జరగకపోవడంతో.. బాధితులు నిలదీశారు. ఇంకేముంది రాత్రికి రాత్రే బోర్డ్ తిప్పేసిందా రియల్ ఎస్టేట్ కంపెనీ.
సుమారు 20 కోట్లకు పైగా మోసానికి పాల్పడిట్టు పోలీసులు గుర్తించారు. నిందితుల కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. ఈ ఘటనతో బాధితులు లబోదిబోమంటున్నారు. నిందితులను పట్టుకుని తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం..