AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Deccan Demolition: భారీ క్రేన్, ప్రొక్లైనర్లతో మొదలైన డెక్కన్ మాల్‌ కూల్చివేత.. చాలా జాగ్రత్తగా..

హైదరాబాద్‌ డెక్కన్ మాల్‌ కూల్చివేతకు రంగం సిద్ధమయ్యింది. క్రేన్ సాయంతో ప్రొక్లైనర్‌ను భవనం పైకి తీసుకెళ్లి అక్కడ నుంచి డ్రిల్లింగ్ మొదలు పెడతారు. పక్కన ఉన్న భవనాలకు ఎలాంటి ప్రమాదం జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు.

Deccan Demolition: భారీ క్రేన్, ప్రొక్లైనర్లతో మొదలైన డెక్కన్ మాల్‌ కూల్చివేత.. చాలా జాగ్రత్తగా..
Deccan Mall
Sanjay Kasula
|

Updated on: Jan 26, 2023 | 10:13 AM

Share

అగ్ని ప్రమాదానికి గురైన రాంగోపాల్‌ పేట డెక్కన్‌ మాల్‌ కూల్చివేత పనులకు జీహెచ్‌ఎంసీ రంగం సిద్ధం చేసింది. డెక్కన్‌మాల్‌కు భారీ క్రేన్, ప్రొక్లైనర్ చేరుకున్నాయి. కూల్చివేత టెండర్ దక్కించుకున్న ఎస్కే మల్లు ఏజెన్సీ సిబ్బంది. రూ.25 లక్షలకు పని చేసేందుకు ముందుకు వచ్చిన కాంట్రాక్టర్. పోలీస్, రెవెన్యూ అధికారుల క్లియరెన్స్ రాగానే కూల్చివేతను మొదలు పెట్టనున్నారు. పక్కన ఉన్న భవనాలపై ఎలాంటి ప్రభావం పడకుండా తార్పలిన్‌లు ఏర్పాటు చేస్తున్నారు. భారీ మెషీన్లు తీసుకొచ్చి డెబ్రిస్ తొలగింపు చేయనున్నారు. పక్క బిల్డింగ్‌లకు ఎలాంటి ఇబ్బంది జరగకుండా డెక్కన్‌మాల్ కూల్చనున్న ఏజెన్సీ సిబ్బంది. మొత్తం మాల్ కూల్చివేతకు 15 రోజులు పట్టే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

జీహెచ్‌ఎంసీ ఒక రోజు గడువుతో సంబంధిత కాంట్రాక్ట్‌ ఏజెన్సీలను ఆహ్వానించి 33.86 లక్షల అంచనాలతో టెండర్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ టెండర్‌ను హైదరాబాద్‌కు చెందిన కంపెనీ 22 లక్షలకు దక్కించుకుంది. అధునాతన టెక్నాలజీతో పాటు చుట్టుపక్కల ఇళ్లకు ప్రమాదం వాటిల్లకుండా బిల్డింగ్‌ను కూల్చివేయాలని జీహెచ్‌ఎంసీ కండీషన్ విధించింది.

ప్రమాద ఘటనలో మృతి చెందిన ఇద్దరి ఆచూకీ తెలియరాలేదు. వాళ్ల గురించి స్పష్టత వచ్చాకే కూల్చాలని భావించినా.. ఈ లోపే కూలిపోతే నష్టం వాటిల్లుతుందన్న నిపుణుల హెచ్చరికలతో జీహెచ్‌ఎంసీ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో బాధిత కుటుంబీకులను ఒప్పించి రేపు కూల్చివేసేందుకు జీహెచ్‌ఎంసీ రెడీ అయ్యింది.

అంతకుముందు.. బీఆర్కే భవన్‌లో ఉన్నతాధికారులతో మంత్రులు కేటీఆర్‌, మహమూద్‌ అలీ, తలసాని సమావేశమయ్యారు. పురాతన భవనాలు, అక్రమ నిర్మాణాలు, ఫైర్ సేఫ్టీ నిబంధనలు, అగ్ని ప్రమాదాలకు కారణాలపై ప్రధానంగా చర్చించారు. ఫైర్ సేప్టీ కోసం మంత్రులు కీలక ప్రతిపాదనలు చేశారు. డ్రోన్లు, రోబోటిక్ టెక్నాలజీ వినియోగించాలన్నారు. అధునిక యంత్రాలతో ఫైర్‌ సిబ్బందికి ట్రైనింగ్ ఇవ్వాలని సూచించారు. లేటెస్ట్ టెక్నాలజీ కొనుగోలుకు ప్రతిపాదనలు చేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం