Telangana: భారీ భవనాలకు ఫైర్ సేఫ్టి ఆడిట్ తప్పనిసరి.. ఆ పద్ధతులపై అధ్యయనం చేయాలి: మంత్రి కేటీఆర్
సికింద్రాబాద్ డెక్కన్ మాల్ ప్రమాదం నేపథ్యంలో GHMC పరిధిలో అగ్ని ప్రమాద నివారణ, అనుమతులు లేని భారీ భవనాలపై చేపట్టాల్సిన చర్యలపై మంత్రి కేటీఆర్ బుధవారం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.
సికింద్రాబాద్ డెక్కన్ మాల్ ప్రమాదం నేపథ్యంలో GHMC పరిధిలో అగ్ని ప్రమాద నివారణ, అనుమతులు లేని భారీ భవనాలపై చేపట్టాల్సిన చర్యలపై మంత్రి కేటీఆర్ బుధవారం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్ బిఆర్‌కె భవన్ సీఎస్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశానికి మంత్రులు, నగర మేయర్, సి.ఎస్ శాంతి కుమారి, డీజీపీ అంజనీ కుమార్ సహా సంబంధిత శాఖ అధికారులు హాజరయ్యారు. హైదరాబాద్ సహా ఇతర ప్రధాన నగరాల్లో భారీ ఎత్తైన భవనాలకు ఫైర్ సేఫ్టీ ఆడిట్ నిర్వహించాలని నిర్ణయించారు. వాణిజ్య భవనాలు, ఆసుపత్రులు, పాఠశాలలు, ఎత్తైన అపార్ట్‌మెంట్లలో తనిఖీలు చేపట్టబోతున్నారు.
ఈ క్రమంలో ప్రజలకు ఇబ్బందులు కల్గించవద్దని మంత్రి కేటీఆర్ అధికారులకు వివరించారు. అవసరమైతే ప్రస్తుతం ఉన్న ఫైర్ సేఫ్టీ చట్టాలను సైతం మార్చాలన్నారు. ఫైర్ సేఫ్టీ విషయంలో డ్రోన్లు, రోబోటిక్ సాంకేతికతను వినియోగించుకునే అంశాలను పరిశీలించాలి. పాశ్చాత్య దేశాలతో పాటు దేశంలోని ఇతర నగరాల్లో ఉన్న పద్ధతులపై అధ్యయనం చేయాలని అధికారులకు మంత్రులు సూచించారు. ప్రస్తుతం ఉన్న ఫైర్ సేఫ్టీ సిబ్బందికి మరిన్ని శిక్షణా కార్యక్రమాలు చేపట్టాలి, ఫైర్ సేఫ్టీ శాఖకు అవసరమైన ఆధునిక సామాగ్రిని అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు మంత్రులు.
అగ్ని ప్రమాద నివారణలో ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాల్లో భవన యజమానులను కూడా భాగస్వాములను చేసే అంశాన్ని పరిశీలించాలి. సికింద్రాబాద్ అగ్ని ప్రమాదంలో మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయల చొప్పున ఎక్స్‌గ్రేషియా అందించాలని సమీక్షా సమావేశంలో నిర్ణయించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం..