Hyderabad: నగరవాసులకు ముఖ్య గమనిక.. శనివారం ఈ ప్రాంతాల్లో మంచి నీటి సరఫరాలో అంతరాయం

నగరంలో పలుచోట్ల మంచినీటి సరఫరాకు అంతరాయం ఏర్పడనున్నట్లు అధికారులు తెలిపారు. మైలార్ దేవ్ పల్లిలో 1200 ఎంఎం డయా స్లూయిజ్‌కు మరమ్మతు పనులు చేపడుతున్న నేపథ్యంలో పలు ప్రాంతాల్లో ఒక రోజు నీటి సరఫరా ఆగిపోతుందని తెలిపారు.

Hyderabad: నగరవాసులకు ముఖ్య గమనిక.. శనివారం ఈ ప్రాంతాల్లో మంచి నీటి సరఫరాలో అంతరాయం
Water Supply In Hyderabad
Follow us
Ram Naramaneni

|

Updated on: Jan 26, 2023 | 10:18 AM

హైదరాబాద్ వాసులకు జల మండలి అధికారులు కీలక సూచన చేశారు. సిటీలో వచ్చే శనివారం పలుచోట్ల మంచినీటి సరఫరాకు అంతరాయం కలగనున్నట్లు తెలిపారు.  జలమండలి సరఫరా చేస్తున్న మంచి నీటి సరఫరా పైపులైన్ మైలార్ దేవ్ పల్లి ఫేజ్-2 లోని 5 ఎంఎల్ రిజర్వాయర్ 1200 ఎంఎం డయా స్లూయిజ్ కు మరమ్మతు పనులు చేపడుతున్నారు. 28వ తేదీ శనివారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ పనులు జరుగుతాయి. కావున ఈ 8 గంటలు కింద పేర్కొన్న ప్రాంతాల్లో మంచి నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడుతుంది.

అంతరాయం కలిగే ప్రాంతాలు..

ఓ అండ్ ఎం డివిజన్ నం.1 : శాస్త్రిపురం

ఓ అండ్ ఎం డివిజన్ నం.2 : బండ్లగూడ

ఓ అండ్ ఎం డివిజన్ నం.3 : భోజగుట్ట

ఓ అండ్ ఎం డివిజన్ నం.4 : ఆళ్లబండ

ఓ అండ్ ఎం డివిజన్ నం.16 : మధుబన్, దుర్గా నగర్, బుద్వేల్, సులేమాన్ నగర్, గోల్డెన్ హైట్స్, 9 నంబర్

ఓ అండ్ ఎం డివిజన్ నం.18 : కిస్మత్పూర్, గంధం గూడ

ఓ అండ్ ఎం డివిజన్ నం.20 : ధర్మసాయి

కాబట్టి ఈ సమయంలో ఆయా ప్రాంతాలకు నీటి సరఫరా ఆగిపోనుందని.. ప్రజలు నీటిని పొదుపుగా వినియోగించుకోవాలని అధికారులు కోరారు. ముందుగా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..