SC Railway: రైల్వే ప్రయాణీకులకు అలెర్ట్.. ఆ ఎక్స్‌ప్రెస్ రైళ్ల రాకపోకల సమయాల్లో మార్పులు
Railway News: దక్షిణ మధ్య రైల్వే పరిధిలో నడిచే కొన్ని రైళ్ల రాకపోకల సమయాల్లో మార్పులు చేశారు. ఈ వివరాలను ద.మ.రైల్వే తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించింది.
Railway News: దక్షిణ మధ్య రైల్వే(South Central Railway) పరిధిలో నడిచే కొన్ని రైళ్ల రాకపోకల సమయాల్లో మార్పులు చేశారు. ఈ వివరాలను ద.మ.రైల్వే తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించింది. చెన్నై డివిజన్‌లోని తిరుపత్తూర్, జోలార్‌పేటై సెక్షన్‌లో ట్రాక్ పునరుద్ధరణ పనులు చేపట్టనున్నారు. ఈ నెల 20, 24, 27, డిసెంబరు 1 తేదీల్లో (4 రోజులు) రాత్రి 8 గం.ల నుంచి 11.45 గం.ల వరకు ఈ పునరుద్ధరణ పనులు చేపడుతారు. ఈ పనుల కారణంగా కొన్ని రైలు సర్వీసుల రాకపోకల సమయాల్లో ఆ నాలుగు రోజుల్లో మార్పులు చేశారు.
రైలు నెం.17229 తిరువనంతపురం సెంట్రల్ నుంచి సికింద్రాబాద్ జంక్షన్‌కు నడిచే సబరి ఎక్స్‌ప్రెస్ ఈ నెల 20, 24, 27, డిసెంబర్ 1 తేదీల్లో తిరువనంతపురం సెంట్రల్ నుంచి ఉదయం 7 గం.లకు బదులు.. 3 గం.లు ఆలస్యంగా ఉదయం 10 గం.లకు బయలుదేరుతుంది. ఆ మేరకు సబరి ఎక్స్‌ప్రెస్ రైలు మూడు గంటలు ఆలస్యంగా ఆయా రైల్వే స్టేషన్లకు చేరుకుని.. బయలుదేరుతుంది.
అలాగే రైలు నెం.16526 కేఎస్ఆర్ బెంగళూరు నుండి కన్యాకుమారికి నడిచే ఐలాండ్ ఎక్స్‌ప్రెస్ ఈ నెల 20, 24, 27, డిసెంబరు 01 తేదీల్లో రాత్రి 08.10 గం.లకు బదులు గంట ఆలస్యంగా 09.10 గం.లకు బయలుదేరుతుంది.
Rescheduling of Train services #SRupdates pic.twitter.com/v0DIzDJYio
— Southern Railway (@GMSRailway) November 17, 2021
మారిన రైళ్ల రాకపోకలకు అనుగుణంగా ప్రయాణీకులు తమ ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవాలని రైల్వే అధికారులు సూచించారు.
Also Read..
NIA: తెలుగు రాష్ట్రాల్లో ఎన్‌ఐఏ అధికారుల సోదాలు.. మావోయిస్ట్ సానుభూతిపరులే టార్గెట్