Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

NIA: తెలుగు రాష్ట్రాల్లో ఎన్‌ఐఏ అధికారుల సోదాలు.. మావోయిస్ట్‌ సానుభూతిపరులే టార్గెట్‌

తెలుగు రాష్ట్రాల్లో ఎన్‌ఐఏ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. మావోయిస్ట్‌ సానుభూతిపరులే టార్గెట్‌గా తనిఖీలు చేస్తున్నారు.

NIA: తెలుగు రాష్ట్రాల్లో ఎన్‌ఐఏ అధికారుల సోదాలు.. మావోయిస్ట్‌ సానుభూతిపరులే టార్గెట్‌
Nia
Follow us
Ram Naramaneni

|

Updated on: Nov 18, 2021 | 10:51 AM

తెలుగు రాష్ట్రాల్లో ఎన్‌ఐఏ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. మావోయిస్ట్‌ సానుభూతిపరులే టార్గెట్‌గా తనిఖీలు చేస్తున్నారు. మావోయిస్ట్‌ అగ్రనేత ఆర్కే మృతి, గడ్చిరోలి ఎన్‌కౌంటర్‌ నేపథ్యంలో మావోయిస్టులతో లింకులపై ఆరా తీస్తున్నారు. ప్రకాశం జిల్లా అలకూరపాడులో విరసం నేత కల్యాణ్‌రావు ఇంట్లో తనిఖీలు చేపట్టారు NIA అధికారులు. మావోయిస్టులతో సంబంధాలపై కల్యాణ్‌రావును ప్రశ్నిస్తున్నారు. మావోయిస్టు నేత ఆర్కేకు కల్యాణ్‌రావు బంధువు. ఆర్కే జీవిత చరిత్ర పుస్తకం ప్రచురణపై కూడా ఆరా తీస్తున్నట్టుగా సమాచారం. ఎన్‌ఐఏ పేరుతో ఉన్న జాకెట్లను ధరించి వచ్చారు అధికారులు. కల్యాణ్‌రావు డాబా పైభాగాన్ని కూడా పరిశీలించారు ఎన్‌ఐఏ ప్రత్యేక అధికారి. ఇక అటు విశాఖలోని అన్నపూర్ణ నివాసంలోనూ తనిఖీలు చేపట్టారు ఎన్‌ఐఏ అధికారులు. మావోయిస్టులతో సంబంధాలపై ప్రశ్నిస్తున్నారు.

ఇక ఇటు తెలంగాణలోనూ NIA అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. నాగోల్‌లోని మాజీ మావోయిస్టుల ఇళ్లలోనూ సోదాలు నిర్వహిస్తున్నారు అధికారులు. హైదరాబాద్‌ మాజీ మావోయిస్ట్‌ రవితో పాటు అనురాధ ఇళ్లలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. కేంద్ర కమిటీ సభ్యుడిగా పనిచేసి లొంగిపోయాడు రవిశర్మ. ఇక అల్వాల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని సుభాష్‌ నగర్‌లో అమరవీరుల బంధుమిత్రుల సంఘం నాయకురాలు భవానీ ఇంట్లోనూ తనిఖీలు చేస్తున్నారు ఎన్‌ఐఏ అధికారులు. ఈ సోదాల్లో పలు కీలక డాక్యుమెంట్లతో పాటు పుస్తకాలను కూడా ఎన్‌ఐఏ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా విరసం నేతల కల్యాణ్‌రావు ఇంట్లో సోదాలు చేయడం, ఆయన్ను ప్రశ్నించడం ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది.

Also Read: Viral Photo: 3 నల్ల త్రాచులు ఒకేసారి ఒకేచోట పడగలు విప్పితే ఎట్టా ఉంటుందో తెలుసా..?

Viral Video: సమయానికి దేవుడిలా వచ్చాడు.. కాపాడాడు.. లేదంటే నిండు ప్రాణాలు…

ట్రైన్ టికెట్ కాన్సిల్ చేస్తే.. డబ్బులు రిఫండ్‌ పొందటం ఎలా?
ట్రైన్ టికెట్ కాన్సిల్ చేస్తే.. డబ్బులు రిఫండ్‌ పొందటం ఎలా?
హైదరాబాద్​లో యాపిల్ పాడ్స్ తయారీ !! కానీ మన కోసం కాదు
హైదరాబాద్​లో యాపిల్ పాడ్స్ తయారీ !! కానీ మన కోసం కాదు
ఓటు కార్డు-ఆధార్‌ లింకుతో దేశంలో విప్లవాత్మక మార్పు రాబోతోందా ??
ఓటు కార్డు-ఆధార్‌ లింకుతో దేశంలో విప్లవాత్మక మార్పు రాబోతోందా ??
లోహపు గుండెతో 105 రోజులు.. వైద్య చరిత్రలోనే సంచలనం
లోహపు గుండెతో 105 రోజులు.. వైద్య చరిత్రలోనే సంచలనం
పాముతో పసిపిల్లవాడు ఆటలా ?? ఏమైనా జరిగితే.. నెటిజన్స్‌ మండిపాటు
పాముతో పసిపిల్లవాడు ఆటలా ?? ఏమైనా జరిగితే.. నెటిజన్స్‌ మండిపాటు
ప్రేమించి పెళ్ళాడిన భర్తను ముక్కలుగా నరికేసిన భార్య
ప్రేమించి పెళ్ళాడిన భర్తను ముక్కలుగా నరికేసిన భార్య
ఈ వ్యాధి ఉన్నవారు బెల్లం తింటే కిడ్నీలు పాడవుతాయా..?
ఈ వ్యాధి ఉన్నవారు బెల్లం తింటే కిడ్నీలు పాడవుతాయా..?
నన్ను కూడా లైంగికంగా వేధించారు అంటూ.. షోలోనే ఏడ్చిన హీరోయిన్
నన్ను కూడా లైంగికంగా వేధించారు అంటూ.. షోలోనే ఏడ్చిన హీరోయిన్
ఫ్లోలో SSMB29 గురించి చెప్పి.. అందరికీ షాకిచ్చిన పృథ్వీరాజ్‌
ఫ్లోలో SSMB29 గురించి చెప్పి.. అందరికీ షాకిచ్చిన పృథ్వీరాజ్‌
దేవరను పూజిస్తున్న జపాన్ అమ్మాయిలు.. అది తారక్‌ క్రేజ్ అంటే!
దేవరను పూజిస్తున్న జపాన్ అమ్మాయిలు.. అది తారక్‌ క్రేజ్ అంటే!