AP Assembly: ఏపీ అసెంబ్లీ ప్రారంభం.. ఒక్కరోజే సమావేశాలు నిర్వహించే యోచనలో జగన్ సర్కార్!
AP Assembly 2021: ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేవాలు ఇవాళ ఉదయం మొదలయ్యాయి. ఎమ్మెల్యే సుధా ప్రమాణస్వీకారంతో అసెంబ్లీ సమావేశాలను స్పీకర్ తమ్మినేని సీతారం ప్రారంభించారు.
AP Assembly session 2021: ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేవాలు ఇవాళ ఉదయం మొదలయ్యాయి. ఎమ్మెల్యే సుధా ప్రమాణస్వీకారంతో అసెంబ్లీ సమావేశాలను స్పీకర్ తమ్మినేని సీతారం ప్రారంభించారు. ఈ సమావేశాల్లో 14 ఆర్డినెన్స్‌లను ప్రభుత్వం సభ ముందు ఉంచనుంది. మహిళా సాధికారతపై అసెంబ్లీ, మండలిలో చర్చ జరుగనుంది. ఒక్కరోజే సమావేశాలు నిర్వహించే యోచనలో సర్కార్ ఉన్నట్లు తెలుస్తోంది. స్పీకర్ అధ్యక్షతన జరిగే బీఏసీలో అసెంబ్లీ సమావేశాల అజెండా, పనిదినాలపై చర్చించనున్నారు. కాగా, అసెంబ్లీ సమావేశాలను 15 రోజుల పాటు నిర్వహించాలని టీడీపీ డిమాండ్ చేస్తోంది. ఒక్కరోజే సమావేశం జరిపితే సభను టీడీపీ బహిష్కరించాలని నిర్ణయించినట్లు సమాచారం.
ఇటీవల మరణించిన ఎంఎ అజీజ్, మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి, ముమ్మిడివరం మాజీ ఎమ్మెల్యే కృష్ణమూర్తి మృతి, మాజీ ఎమ్మెల్యే రంగనాయకులు, మాజీ ఎమ్మెల్యే టీ.వెంకయ్య మృతికి ఏపీ అసెంబ్లీ సంతాపం ప్రకటించింది.
మరోవైపు, మొదటి రోజు ప్రతిపక్ష తెలుగు దేశం పార్టీ నిరసనతో షురూ చేసింది. ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు వీడాలంటూ టీడీపీ శాసన సభ్యులు నినాదాలు చేపట్టారు. నిరసన ప్రదర్శనలో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, శాసనసభ్యులు బ్యానర్ పట్టుకుని అసెంబ్లీ వరకు వచ్చారు. త్తపై పన్ను వంటి నిర్ణయాలు వెనక్కి తీసుకోవాలని, భారంగా మారిన పెట్రో ధరలు తగ్గించాలని ఈ సందర్భంగా టీడీపీ అధినేత డిమాండ్ చేశారు. సామాన్యులు ఈ పాలనలో చితికి పోతున్నారని చంద్రబాబు మండిపడ్డారు. విద్యుత్ చార్జీలు కూడా ఏపీలో ఎక్కవే అని చంద్రబాబు అన్నారు. కాగా, పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలపై అత్యవసరంగా చర్చించాలంటూ టీడీపీ వాయిదా తీర్మానాన్ని స్పీకర్ తమ్మినేని సీతారాం తిరస్కరించారు.