Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nayantara Birthday: ప్రియురాలి పుట్టిన రోజు కోసం విఘ్నేష్‌ గ్రాండ్‌ పార్టీ .. హాజరైన సామ్‌.. నెట్టింట్లో ఫొటోలు వైరల్‌..

దక్షిణాది సినీ పరిశ్రమలో లేడీ సూపర్‌స్టార్‌గా గుర్తింపు పొందిన నయనతార నేడు (నవంబర్‌18న) 37వ వసంతంలోకి అడుగుపెట్టనుంది

Nayantara Birthday: ప్రియురాలి పుట్టిన రోజు కోసం విఘ్నేష్‌ గ్రాండ్‌ పార్టీ .. హాజరైన సామ్‌.. నెట్టింట్లో ఫొటోలు వైరల్‌..
Follow us
Basha Shek

|

Updated on: Nov 18, 2021 | 10:05 AM

దక్షిణాది సినీ పరిశ్రమలో లేడీ సూపర్‌స్టార్‌గా గుర్తింపు పొందిన నయనతార నేడు (నవంబర్‌18న) 37వ వసంతంలోకి అడుగుపెట్టనుంది. ఈ నేపథ్యంలో ఆమె ప్రియుడు, దర్శకుడు విఘ్నేష్‌ శివన్‌ నయన్‌ పుట్టిన రోజు వేడుకలను గ్రాండ్‌గా ప్లాన్‌ చేశాడు. ఇందులో భాగంగా బుధవారం అర్ధరాత్రే కేక్‌ కటింగ్‌ కార్యక్రమాన్ని ఏర్పాటుచేశాడు. ఈ వేడుకకు సమంత కూడా హాజరైంది. కాగా నయన్‌ పుట్టిన రోజు వేడుకలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. పలవురు ప్రముఖులు, సినీ అభిమానులు, నెటిజన్లు ఆమెకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

విఘ్నేష్‌ దర్శకత్వంలో నయనతార, సమంత, విజయ్‌సేతుపతి ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న చిత్రం ‘కాత్తు వాక్కుల రెండు కాదల్‌’. కాగా నయన్‌ పుట్టిన రోజును పురస్కరించుకుని చిత్ర బృందం సినిమాలో ఆమె పోషించిన ‘కణ్మణి’ పాత్ర పోస్టర్‌ను విడుదల చేశారు. దీనిని ఇన్‌స్టాలో పంచుకుని తన ప్రియురాలికి బర్త్‌డే విషెస్ చెప్పుకొచ్చాడు విఘ్నేష్‌. ‘ కణ్మణి, తంగమేయి నా ఎల్లమ్మాయికి పుట్టిన రోజు శుభాకాంక్షలు. నీ ప్రేమ, ఆప్యాయతలతో నా జీవితం పరిపూర్ణమైంది. నువ్వు ఎప్పుడూ ఇలాగే అందంగా, ఆనందంగా ఉండేలా ఆ భగవంతుడు నిన్ను ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను’ అని ప్రియురాలిపై ప్రేమను కురిపించాడు విఘ్నేష్‌. ఇక నయన్‌ బర్త్‌ డే వేడుకలు కూడా గ్రాండ్‌గా జరిగాయి. ఈ సందర్భంగా కేక్‌ కట్‌ చేసేముందు తన ప్రియుడిని ఆప్యాయంగా హత్తుకుందీ ముద్దుగుమ్మ.

Also Read:

Bimbisara: డిసెంబర్ లోనే బరిలోకి దిగుతనంటున్న నందమూరి హీరో.. కళ్యాణ్ రామ్ “బింబిసారా” మూవీ వచ్చేది అప్పడే..

Kangana Ranaut: బాలీవుడ్ నటి వ్యాఖ్యలపై సర్వత్రా నిరసన.. జార్ఖండ్‌, బిహార్‌లలో దేశద్రోహం కేసులు నమోదు..

Mike Tyson: బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్‌కు భారతీయ వంటకాలు రుచి చూపించిన లైగర్ టీమ్..