ఈ బూరెబుగ్గల బుజ్జాయి.. ఇప్పుడు సౌత్‌లో క్రేజీ హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టారా..?
పై ఫొటోలో కనిపిస్తున్న బూరెబుగ్గల పాపాయి.. ఇప్పుడు సౌత్ లో క్రేజీ హీరోయిన్.. తమిళ్, మలయాళ సినిమాల్లో మెరిసిన ఈ ముద్దుగుమ్మ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితురాలే..
పై ఫొటోలో కనిపిస్తున్న బూరెబుగ్గల పాపాయి.. ఇప్పుడు సౌత్ లో క్రేజీ హీరోయిన్.. తమిళ్, మలయాళ సినిమాల్లో మెరిసిన ఈ ముద్దుగుమ్మ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితురాలే.. ఓ డబ్బింగ్ సినిమాతో తెలుగులో మంచి ఫాలోయింగ్ తెచ్చుకుంది. ఇప్పుడు ఆ క్రేజ్ తోనే డైరెక్ట్ తెలుగు సినిమా చేయబోతుంది ఈ చిన్నది. అదికూడా ఓ స్టార్ హీరో సినిమాలో.. ఇంతకు ఈ ముద్దులొలికే పాపాయి ఎవరో గుర్తుపట్టారా.. ఈ అమ్మడు ఎవరో కాదు రాజా రాణి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం ఆయిన నజ్రియా నజీమ్. మలయాళం లో స్టార్ హీరోయిన్ గా పేరుతెచ్చుకున్న ఈ బ్యూటీ పలు తమిళ్ సినిమాల్లోనూ నటించింది.
నజ్రియా నజీమ్ ఇప్పుడు తెలుగులో సినిమాలు చేయడానికి రెడీ అవుతుంది. నేచురల్ స్టార్ నాని నటిస్తున్న అంటే సుందరానికి అనే సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది ఈ బ్యూటీ. తెలుగులో డబ్ అయిన రాజా రాణి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయింది నజ్రియా నజీమ్. ఒక్క సినిమాతోనే ఈ అమ్మడు టాలీవుడ్ లో మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. నజ్రియా నజీమ్ భర్త ఫహద్ ఫాజిల్ కూడా ఇప్పుడు తెలుగులో నటిస్తున్నారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప సినిమాలో విలన్ గా నటిస్తున్నారు ఫహద్. ఇలా భార్య భర్తలు ఇద్దరు ఒకేసారి తెలుగులోకి అడుగు పెడుతున్నారు. ఇక ఈ అమ్మడికి తెలుగులో ఆఫర్లు క్యూ కట్టే అవకాశం ఉంది. చూడాలి మరి ఏం జరుగుతుందో..