AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Secunderabad: మహంకాళీ అమ్మవారిని దర్శించుకున్న ప్రధాని మోదీ.. ప్రత్యేక పూజలు..

సికింద్రాబాద్‌ మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు ప్రధాని మోదీ. అమ్మవారికి మోదీ ప్రత్యేక పూజలు చేశారు. రాజ్‌భవన్‌ నుంచి బయలుదేరి సికింద్రాబాద్‌ వెళ్లిన ప్రధాని మోదీ అక్కడ మహంకాళి అమ్మవారిని దర్శించుకోనున్నారు. ప్రధానితో పాటు ముఖ్యులకు మాత్రమే ఆలయంలోకి అనుమతించారు. ఆలయం చుట్టు పక్కల ప్రాంతాల్లో భారీ భద్రత ఏర్పాటు చేశారు పోలీసులు. ఆలయ అర్చకులు ప్రధాని మోదీకి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. దర్శనం తరువాత అమ్మవారి చిత్రపటాన్ని ఇచ్చి, వేద ఆశీర్వదం అందజేశారు.

Secunderabad: మహంకాళీ అమ్మవారిని దర్శించుకున్న ప్రధాని మోదీ.. ప్రత్యేక పూజలు..
Pm Modi
Srikar T
|

Updated on: Mar 05, 2024 | 10:50 AM

Share

సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు ప్రధాని మోదీ. అమ్మవారికి మోదీ ప్రత్యేక పూజలు చేశారు. రాజ్‌భవన్‌ నుంచి బయలుదేరి సికింద్రాబాద్‌ వెళ్లిన ప్రధాని మోదీ అక్కడ మహంకాళి అమ్మవారిని దర్శించుకోనున్నారు. ప్రధానితో పాటు ముఖ్యులకు మాత్రమే ఆలయంలోకి అనుమతించారు. ఆలయం చుట్టు పక్కల ప్రాంతాల్లో భారీ భద్రత ఏర్పాటు చేశారు పోలీసులు. ఆలయ అర్చకులు ప్రధాని మోదీకి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. దర్శనం తరువాత హారతి అందజేశారు. శాలువాతో ప్రధానిని సత్కరించి అమ్మవారి చిత్రపటాన్ని ఇచ్చి, వేద ఆశీర్వదం అందజేశారు. సికింద్రాబాద్‌ మహంకాళి ఆలయంలో అమ్మవారిని దర్శించుకున్న తర్వాత ప్రధాని మోదీ.. సంగారెడ్డి జిల్లాకు వెళ్లనున్నారు.

ముందుగా బేగంపేట విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి ప్రత్యేక హెలికాఫ్టర్‎లో సంగారెడ్డి చేరుకోనున్నారు. అక్కడ రూ.9 వేల 21 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు వర్చువల్‌గా చేయబోతున్నారు. రూ.1409 కోట్ల రూపాయలతో నిర్మించిన NH-161 నాందేడ్ అఖోలా నేషనల్ హైవేని జాతికి అంకితం చేయనున్నారు ప్రధాని మోదీ. సంగారెడ్డి X రోడ్డు నుంచి మదీనగూడ వరకు రూ.1298 కోట్ల రూపాయలతో NH-65ని ఆరు లేన్లుగా విస్తరించే పనులకు ప్రధాని శంకుస్థాపన చేయబోతున్నారు. ఈ పర్యటన కోసం నిన్న ప్రధాని రాజ్ భవన్ లోనే బస చేశారు. ఆయన కోసం రాజ్ భవన్ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పటిష్టమైన భద్రత ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు పోలీసు ఉన్నతాధికారులు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

Follow Us
ఆ గడ్డి జ్యూస్ మోజులో పడిన ప్రజలు.. ఒక్కసారి తాగితే ఆగట్లేదుగా
ఆ గడ్డి జ్యూస్ మోజులో పడిన ప్రజలు.. ఒక్కసారి తాగితే ఆగట్లేదుగా
ఆ కవలల పెళ్లి చూసి అంతా మురిసిపోయారు.. కానీ 30 రోజుల్లోనే..
ఆ కవలల పెళ్లి చూసి అంతా మురిసిపోయారు.. కానీ 30 రోజుల్లోనే..
గుడ్ న్యూస్.. ధురంధర్ 2 ఇకపై తెలుగులోనూ చూడొచ్చు..
గుడ్ న్యూస్.. ధురంధర్ 2 ఇకపై తెలుగులోనూ చూడొచ్చు..
టీ20లో ఒక్కడే 14 సిక్సర్లు, 21 ఫోర్లతో ఏకంగా 193 పరుగులు
టీ20లో ఒక్కడే 14 సిక్సర్లు, 21 ఫోర్లతో ఏకంగా 193 పరుగులు
రంజాన్ వేళ భారీగా పెరిగిన చికెన్ ధరలు.. ఎంతంటే..?
రంజాన్ వేళ భారీగా పెరిగిన చికెన్ ధరలు.. ఎంతంటే..?
తిరుమల క్యూ లైన్లలో పాముల హల్చల్.. భయం గుప్పిట్లో భక్తులు!
తిరుమల క్యూ లైన్లలో పాముల హల్చల్.. భయం గుప్పిట్లో భక్తులు!
శ్రీవారి ప్రసాదాల కల్తీకి చెక్.. తిరుమలలో అత్యాధునిక ల్యాబ్
శ్రీవారి ప్రసాదాల కల్తీకి చెక్.. తిరుమలలో అత్యాధునిక ల్యాబ్
హైదరాబాద్‌లో ఉంటున్న ఉద్యోగులకు కేంద్రం శుభవార్త
హైదరాబాద్‌లో ఉంటున్న ఉద్యోగులకు కేంద్రం శుభవార్త
మీ వాష్ బేసిన్ పసుపు రంగులోకి మారిందా? డోంట్ వర్రీ.. ఇలా చేయండి!
మీ వాష్ బేసిన్ పసుపు రంగులోకి మారిందా? డోంట్ వర్రీ.. ఇలా చేయండి!
ఈ ఐపీఎల్ సీజన్లో ముంబై ఇండియన్స్ రికార్డు ఎవరైనా బద్దలు కొడతారా?
ఈ ఐపీఎల్ సీజన్లో ముంబై ఇండియన్స్ రికార్డు ఎవరైనా బద్దలు కొడతారా?