‘బడేభాయ్’ ముచ్చట.. సీఎం రేవంత్ విన్నపాలకు ‘పెద్దన్న’ ప్రధాని మోదీ తధాస్తు అనేస్తారా.?
తెలంగాణ గట్టుపై బడేభాయ్ ముచ్చట హాట్ టాపిక్‌గా మారింది. అదిలాబాద్ వేదికగా సూటిగా సుతిమెత్తగా ప్రధానికి విన్నపాలు వినిపించేశారు సీఎం రేవంత్. రాష్ట్రానికి ఏం కావాలో టైమ్ చూసి మరీ అడిగేశారు. మరి మోదీ రియాక్షన్ ఏంటి?
తెలంగాణ గట్టుపై బడేభాయ్ ముచ్చట హాట్ టాపిక్‌గా మారింది. అదిలాబాద్ వేదికగా సూటిగా సుతిమెత్తగా ప్రధానికి విన్నపాలు వినిపించేశారు సీఎం రేవంత్. రాష్ట్రానికి ఏం కావాలో టైమ్ చూసి మరీ అడిగేశారు. మరి మోదీ రియాక్షన్ ఏంటి? గంటల వ్యవధిలో సంగారెడ్డిలో మరోసారి వేదిక పంచుకోబోతున్నారు. ముఖ్యమంత్రి అడిగిన వరాలకు ప్రధానమంత్రి తధాస్తు అనేస్తారా?
ప్రధాని మోదీ తమకు పెద్దన్న అంటూ సీఎం రేవంత్ చేసిన కామెంట్స్ రాజకీయంగా ఆసక్తిరేపాయి. గతంలో మోదీ రాష్ట్రానికి వచ్చినప్పుడు గత ప్రభుత్వం పట్టించుకోలేదు. ప్రస్తుత కాంగ్రెస్ సర్కార్ మాత్రం ప్రొటోకాల్ పాటిస్తోంది. ప్రధానికి ముఖ్యమంత్రి రేవంత్ సాదరంగా ఆహ్వానం పలికారు. ఇద్దరూ పక్కపక్కనే కూర్చుని మాట్లాడుకున్న సీన్ అందర్నీ ఆకట్టుకుంది. ఏం మాట్లాడుకున్నారన్నది పక్కన పెడితే.. సీఎం రేవంత్ టైమ్ చూసి విన్నపాల లిస్ట్ చదివేశారు. గుజరాత్ తరహాలో తెలంగాణ ముందుకెళ్లాలంటే మోదీ మద్దతు ఉండాలన్నారు రేవంత్. అందుకు బడేభాయ్ ఆశీర్వాదం కావాలన్నారు. మెట్రో రైల్ విస్తరణ, సెమీకండక్టర్ ఇండస్ట్రీ, మూసీ రివర్ డెవలప్‌మెంట్‌తో పాటు ఆదిలాబాద్ జిల్లాకు సాగునీటిని అందించేందుకు తుమ్మిడిహట్టి దగ్గర ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్రం సహకరించాలని కోరారు.
ప్రధానంగా ఆ.. నాలుగు విజ్ఞప్తులపై ప్రధాని రియాక్షన్ ఏంటి? వరాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తారా? వాటిని సైడ్ చేసి కొత్తగా ఏదైనా ప్రకటన చేస్తారా అన్నది ఇంట్రెస్టింగ్‌గా మారింది. గంటల వ్యవధిలోనే ప్రధాని, ముఖ్యమంత్రి సంగారెడ్డిలో మరోసారి వేదిక పంచుకోబోతున్నారు. ఈ క్రమంలో బడేభాయ్ మళ్లీ ఖుషీ కబురు చెబుతారా అన్న చర్చ జోరందుకుంది. ఒకవేళ రేవంత్ విన్నపాలకు మోదీ పచ్చజెండా ఊపితే.. రాష్ట్రానికి చేకూరే ప్రయోజనంతో పాటు బీజేపీకి కూడా ప్లస్ కానుంది. అటు కాంగ్రెస్ ప్రభుత్వానికి మైలేజ్ పెరగనుంది. మరి మోదీ మార్క్ నిర్ణయాలు ఎలా ఉంటాయో చూడాలి. సీఎం రేవంత్ రెడ్డి తీరుపై పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ప్రోటోకాల్‌ని వదిలేయకుండా.. ప్రధాని హోదాకు విలువ ఇవ్వడంపై పాజిటివ్ వైబ్స్ వస్తున్నాయి. అదే సమయంలో రాజకీయాలు పక్కన పెట్టి.. తెలంగాణకు ఏం కావాలో విజ్ఞప్తి చేయడం మంచి పరిణామం అంటున్నారు విశ్లేషకులు. ఫైనల్‌గా సంగారెడ్డి వేదికగా బడేభాయ్.. తెలంగాణకు ఇచ్చే గిఫ్ట్ ఏంటన్నది రాజకీయంగా ఆసక్తి రేపుతోంది.