రైతులకు మొదలైన సాగునీటి కటకట.. పంట నష్టపోతున్నామన్న ఆవేదన

వేసవి కాలం మొదలు కాలేదు అన్నదాతలకు ఆపదలు మొదలయ్యాయి. వ్యవసాయానికి అవసరమయ్యే సాగు నీటికి ఇప్పటినుండే ఇబ్బందులకు గురవుతున్నారు. ఏ ప్రభుత్వాలు వచ్చినా తమను మాత్రం గుర్తించడం లేదని తమ సమస్యలను తీర్చడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో రైతు వుండడని అన్నదాత అందోళన చెందుతున్నరు.

రైతులకు మొదలైన సాగునీటి కటకట.. పంట నష్టపోతున్నామన్న ఆవేదన
Formers Suffering
Follow us
P Shivteja

| Edited By: Srikar T

Updated on: Mar 04, 2024 | 9:33 PM

వేసవి కాలం మొదలు కాలేదు అన్నదాతలకు ఆపదలు మొదలయ్యాయి. వ్యవసాయానికి అవసరమయ్యే సాగు నీటికి ఇప్పటినుండే ఇబ్బందులకు గురవుతున్నారు. ఏ ప్రభుత్వాలు వచ్చినా తమను మాత్రం గుర్తించడం లేదని తమ సమస్యలను తీర్చడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో రైతు వుండడని అన్నదాత అందోళన చెందుతున్నరు. ఉమ్మడి మెదక్ జిల్లా అంటేనే వ్యవసాయ అధారిత జిల్లా ఎక్కడ పండించే పంటలు దేశం మొత్తం ఎగుమతి చేస్తారు. దేశానికే ధాన్య బండగరంలా ఉన్న జిల్లా ప్రస్తుతం నీటి వనరులు లేక వ్యవసాయ సాగుకు అంతరాయం ఏర్పడింది. గత ప్రభుత్వం లక్ష ఎకరాలకు నీటిని అందించే ఉద్దేశ్యంతో ప్రాజెక్టు నిర్మించినా అవి చివరి దశకు చేరకపోవడంతో తిరిగి సాగు నీటిని ఆటంకం ఏర్పడే పరిస్థితి నెలకొంది.

కనీసం ఈ ప్రభుత్వం అయిన రైతును రాజును చేస్తాయో కులిని చేస్తయో వేచి చూస్తున్నారు రైతులు. ఈరోజు కూడా సిద్దిపేట జిల్లాలో సాగునీటి కోసం రైతన్నలు రోడ్డు ఎక్కారు. దుబ్బాక మండలం మల్లాయి పల్లి రైతులు పొలాల వద్ద రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. మల్లన్నసాగర్ నుండి వచ్చే కెనాల్ 50 మీటర్లు పూర్తి చేసి ఉంటే వందల ఎకరాల వరి పంట సాగు అయ్యేదని పూర్తిగా పంటలు ఎండిపోయాయని నిరసన చేస్తూన్నారు. ప్రభుత్వానికి, అధికారులకు వ్యతిరేకంగా పంట పొలాల వద్ద రైతుల ఆందోళన బాటపట్టారు. సిద్దిపేట నియోజకవర్గం చిన్నకోడూరు మండలం ఎల్లాయిపల్లి రైతులు వ్యవసాయానికి సాగునీరు ఇవ్వాలంటూ ధర్నా చేస్తున్నారు. రాజీవ్ రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..