Telangana: ఆ 5 సీట్లలో ఏదైనా ఒక్కటి ఇవ్వండి.. కాంగ్రెస్‌కు సీపీఐ రిక్వెస్ట్

ఖమ్మంలో పార్లమెంటరీ నియోజక వర్గ స్థాయి జనరల్ బాడీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు హాజరయ్యారు. తెలంగాణలో కాంగ్రెస్‌తో పొత్తులో ఉన్న సీపీఐ.. ఎంపీ సీట్‌పై ఆశలు పెట్టుకుంది. పొత్తులో భాగంగా ఒక ఎంపీ సీటు ఇవ్వాలని కాంగ్రెస్‌ని కోరుతుంది సీపీఐ.

Telangana: ఆ 5 సీట్లలో ఏదైనా ఒక్కటి ఇవ్వండి.. కాంగ్రెస్‌కు సీపీఐ రిక్వెస్ట్
Kunamneni Sambasiva Rao
Follow us
Ram Naramaneni

|

Updated on: Mar 04, 2024 | 7:29 PM

తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల వాతావరణం నెలకొంది. తెలంగాణలో కాంగ్రెస్‌తో పొత్తులో ఉన్న సీపీఐ.. ఎంపీ సీట్‌పై ఆశలు పెట్టుకుంది. పొత్తులో భాగంగా ఎంపీ సీటు ఇవ్వాలని కాంగ్రెస్‌ని కోరుతుంది సీపీఐ. ఈమేరకు తెలంగాణలో 5 ఎంపీ స్థానాలు ప్రతిపాదించింది సీపీఐ. ఖమ్మం, నల్గొండ, భువనగిరి, వరంగల్, పెద్దపల్లి ఎంపీ సీట్లలో ఏదో ఒక సీటు కేటాయించాలని కాంగ్రెస్‌కి విజ్ఞప్తి చేశారు తెలంగాణ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. ప్రతిపాధించిన 5 ఎంపీ స్థానాల్లో ఒక్కటైన ఇస్తుందని ఆశీస్తున్నట్లు చెప్పారు కూనంనేని. ఖమ్మంలో పార్లమెంటరీ నియోజక వర్గ స్థాయి జనరల్ బాడీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు హాజరయ్యారు.

రాష్ట్రంలోని మిగిలిన స్థానాలతో పోలిస్తే ఈ ఐదు ఎంపీ సీట్ల పరిధిలో బలంగా ఉన్నామని సీపీఐ చెప్తోంది. కాంగ్రెస్ సహకరించి ఒక సీటు కేటాయిస్తే.. గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తుంది సీపీఐ. అసెంబ్లీ ఎన్నికల సమయంలో పొత్తు పెట్టుకుని ఒక సీటు కేటాయించినట్టే.. ఇప్పుడు ఎంపీ ఎన్నికల్లోనూ ఒక సీటు కేటాయించాలని కోరుతోంది సీపీఐ. ఒక్క సీటైనా ఇచ్చేలా ఒప్పిస్తామని చెప్తున్నారు కూనంనేని. కమ్యూనిస్టులు ఉంటేనే ఇండియా కూటమికి స్ట్రెంత్ అని తమకు పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క ఎంపీ స్థానామైన ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ఇండియా కూటమీలో భాగంగా తమిళనాడులో సీపీఐకి డీఎంకే రెండు సీట్లు కేటాయించిందని గుర్తు చేశారు. అలాగే రాష్ట్రంలో బీఆర్ఎస్ మనుగడ రోజురోజుకి తగ్గిపోతుందని చెప్పారు. బీఆర్ఎస్ ప్లేస్‌ను బీజేపీ భర్తీ చేసేందుకు చేస్తున్న ప్లాన్స్‌ని కాంగ్రెస్ తిప్పికొట్టాలని చెప్పారు. సీపీఐ పొత్తుతో కాంగ్రెస్‌కి మరింత బలం చేకూరుతుందని కూనంనేని సాంబశివరావు చెప్పారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

గ్రామాల్లో 10,911 జేఆర్వో పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్
గ్రామాల్లో 10,911 జేఆర్వో పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్
Horoscope Today: వారికి ఆదాయ వృద్ధికి సమయం అనుకూలం..
Horoscope Today: వారికి ఆదాయ వృద్ధికి సమయం అనుకూలం..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?