Telangana: సంగారెడ్డి జిల్లాలో మోడీ పర్యటన.. పలు అభివృద్ది పనులకు శంకుస్థాపన..

మార్చి 5న సంగారెడ్డి జిల్లాలో పర్యటించనున్నారు ప్రధాని మోడీ. ప్రధాని మోడీ పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లు అన్ని చక చక సాగుతున్నాయి. ఉదయం 10:30 నిమిషాలకు సంగారెడ్డి జిల్లా పటేల్ గూడకి చేరుకుంటారు ప్రధాని మోడీ. సంగారెడ్డి జిల్లా వేదికగా రూ. 9,021 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలను వర్చువల్ గా ప్రారంభిస్తారు.

Telangana: సంగారెడ్డి జిల్లాలో మోడీ పర్యటన.. పలు అభివృద్ది పనులకు శంకుస్థాపన..
Revanth Reddy - PM Modi
Follow us
P Shivteja

| Edited By: Srikar T

Updated on: Mar 04, 2024 | 9:50 PM

మార్చి 5న సంగారెడ్డి జిల్లాలో పర్యటించనున్నారు ప్రధాని మోడీ. ప్రధాని మోడీ పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లు అన్ని చక చక సాగుతున్నాయి. ఉదయం 10:30 నిమిషాలకు సంగారెడ్డి జిల్లా పటేల్ గూడకి చేరుకుంటారు ప్రధాని మోడీ. సంగారెడ్డి జిల్లా వేదికగా రూ. 9,021 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలను వర్చువల్ గా ప్రారంభిస్తారు. సంగారెడ్డి లో రూ. 1,409 కోట్లతో నిర్మించిన NH-161 నాందేడ్ అఖోలా నేషనల్ హైవేని జాతికి అంకితం చేయనున్నరు. అలాగే సంగారెడ్డి క్రాస్ రోడ్డు నుంచి మదీనగూడ వరకు రూ. 1,298 కోట్లతో NH-65ని ఆరు లేన్లుగా విస్తరించే పనులకు ప్రధాని శంకుస్థాపన చేస్తారు.

మెదక్ జిల్లాలో రూ. 399 కోట్లతో చేపడుతున్న NH 765D మెదక్- ఎల్లారెడ్డి హైవే విస్తరణ, రూ. 500 కోట్లతో ఎల్లారెడ్డి- రుద్రూర్ విస్తరణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఇవన్నీ పటేల్ గూడలోనే వర్చువల్ గా చేపడతారు. అనంతరం పటాన్ చెరు లోని పటేల్ గూడలోని SR ఇన్ఫినిటీ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొంటారు. మోడీ పర్యటన నేపథ్యంలో పోలీసులు కూడా గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా 2 వేల మందితో పోలీసులు గస్తీకాస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..