BRS Candidates1st List: 4 ఎంపీ స్థానాలకు బీఆర్ఎస్ అభ్యర్థులు ఫిక్స్.. పేర్లు ప్రకటించిన కేసీఆర్
పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ సమీపిస్తుండటంతో తెలంగాణలోని ప్రధాన పార్టీలు అభ్యర్థుల ఎంపికపై తీవ్ర కసరత్తులు చేస్తున్నాయి. ఇప్పటికే తెలంగాణ బీజేపీ తొలి జాబితాగా తమ అభ్యర్థులను ప్రకటించగా.. తాజగా ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీ తమ నలుగురు లోక్ సభ అభ్యర్థుల పేర్లను ఖరారు చేసింది. కరీంనగర్ - బి వినోద్ కుమార్, పెద్దపల్లి - కొప్పుల ఈశ్వర్, ఖమ్మం - నామ నాగేశ్వర్ రావు, మహబూబాబాద్ - మాలోత్ కవిత బరిలో దిగనున్నారు.
పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ సమీపిస్తుండటంతో తెలంగాణలోని ప్రధాన పార్టీలు అభ్యర్థుల ఎంపికపై తీవ్ర కసరత్తులు చేస్తున్నాయి. ఇప్పటికే తెలంగాణ బీజేపీ తొలి జాబితాగా తమ అభ్యర్థులను ప్రకటించగా.. తాజగా ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీ నలుగురి లోక్ సభ అభ్యర్థుల పేర్లను ఖరారు చేసింది. కరీంనగర్ – బి వినోద్ కుమార్, పెద్దపల్లి – కొప్పుల ఈశ్వర్, ఖమ్మం – నామ నాగేశ్వర్ రావు, మహబూబాబాద్ – మాలోత్ కవిత పార్లమెంట్ బరిలో నిలుస్తున్నారు. తెలంగాణలో మొత్తం 17 లోక్ సభ నియోజకవర్గాలున్నాయి. అయితే వీటిలో బీఆర్ఎస్ పార్టీ కేవలం 4 స్థానాలకే అభ్యర్థులను ఖరారు చేసింది. ఇంకా 13 లోక్ సభ అభ్యర్థుల పేర్లను ప్రకటించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో రెండో జాబితాలో ఎవరెవరికి చోటు దక్కుతందనే అంశంపై తెలంగాణ రాజకీయవర్గాల్లో ఆసక్తి నెలకొంది.
గత రెండురోజులుగా ఆయా పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని ముఖ్యనేతలతో చర్చించి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. సెలెక్ట్ అయిన నలుగురు అభ్యర్థులను ప్రకటించారు. ఈ సందర్భంగా అభ్యర్థులకు కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. అయితే మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నేతృత్వంలోని భారత రాష్ట్ర సమితి (బిఆర్ఎస్) ఈ నెల 12న ఎస్ఆర్ఆర్ కళాశాల మైదానంలో భారీ బహిరంగ సభతో కరీంనగర్ నుండి లోక్ సభ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనుంది. చంద్రశేఖర రావు తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటానికి శ్రీకారం చుట్టిన తర్వాత తన తొలి భారీ బహిరంగ సభను ఇక్కడే నిర్వహించడంతో కరీంనగర్ కు సెంటిమెంట్ ఉంది.
కాగా ఆదివారం తెలంగాణ భవన్ లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో కరీంనగర్, పెద్దపల్లి నియోజకవర్గాల పార్టీ నేతలతో చంద్రశేఖర్ రావు తొలి వ్యూహాత్మక సమావేశం నిర్వహించారు. కొత్తగా ఎన్నికైన కాంగ్రెస్ ప్రభుత్వం నీరు, విద్యుత్ వంటి కనీస అవసరాలను తీర్చడంలో విఫలమైందని, రైతులు వీధుల్లోకి వచ్చి నిరసన తెలపాల్సి వచ్చిందని, లోక్ సభ ఎన్నికల్లో బిఆర్ఎస్ మెజారిటీ స్థానాలను గెలుచుకుంటుందని ఆయన పార్టీ క్యాడర్ కు తెలియజేసినట్లు తెలిసింది. బీఆర్ఎస్ పాలనను విమర్శించి లేఅవుట్ క్రమబద్ధీకరణ పథకాన్ని (ఎల్ఆర్ఎస్) ఉచితంగా అమలు చేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ఆ హామీని నెరవేర్చడంలో విఫలమైందని ఆయన అన్నారు.