CM Revanth Reddy: టీనేజర్‌కు అరుదైన క్యాన్సర్.. ‘అన్నా సాయం’ అనగానే స్పందించిన సీఎం రేవంత్

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి మానవత్వం చాటుకున్నారు. పిన్న వయసులోనే అరుదైన క్యాన్సర్‌‌తో పోరాడుతున్న నవీన్ సమస్య తన దృష్టికి వచ్చిన వెంటనే స్పందించారు. ప్రభుత్వమే అన్ని ఖర్చులు భరించి, అతని చికిత్సకు కావాల్సిన అన్ని ఏర్పాట్లను చేస్తుందని స్పష్టం చేశారు. నవీన్‌కు పూర్తిగా నయమయ్యేంత వరకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిందిగా నిమ్స్ వైద్యుల్ని సీఎం కోరారు.

CM Revanth Reddy: టీనేజర్‌కు అరుదైన క్యాన్సర్.. 'అన్నా సాయం' అనగానే స్పందించిన సీఎం రేవంత్
Telangana CM Revanth Reddy
Follow us
Ram Naramaneni

|

Updated on: Mar 04, 2024 | 5:46 PM

బ్లడ్ క్యాన్సర్‌తో బాధపడుతున్న.. నవీన్ అనే టీనేజర్ పరిస్థితి గురించి సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వెంటనే స్పందించారు. త్వరితగతిన బాధితుడి కుటుంబ సభ్యుల్ని సంప్రదించి.. అవసరమైన వైద్య సాయం చేయాల్సిందిగా సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రభుత్వమే సదరు టీనేజర్ చికిత్సకు అన్ని ఖర్చులు భరిస్తుందని స్పష్టం చేశారు. నవీన్‌కు పూర్తిగా నయమయ్యేంత వరకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిందిగా నిమ్స్ డాక్టర్లను సీఎం రేవంత్ కోరారు. నవీన్‌ ఈ అరుదైన క్యాన్సర్‌ మహమ్మారిని జయించి, పూర్తి ఆరోగ్యవంతుడై మన మధ్యకు రావాలని సీఎం ఆకాక్షించారు.

సాయం చేయాలని సోషల్ మీడియాలో రిక్వెస్ట్.. 

‘ 18 ఏళ్ల పిన్న వయస్సులోనే నవీన్ బ్లడ్ క్యాన్సర్ సమస్యతో బాధపడుతున్నాడు. అతన్ని హైదరాబాద్లోని బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రిలో అడ్మిట్ చేశారు. టెస్టులు చేసిన డాక్టర్లు.. చేయాల్సిన సర్జరీ ఆరోగ్య శ్రీ పరిధిలోకి రాదని.. నవీన్‌ను డిశ్ఛార్జ్ చేస్తామని అతడి పేరెంట్స్ చెప్పారు. బాధిత టీనేజర్ చాలా పేద కుటుంబానికి చెందినవాడు. ఈ క్యాన్సర్ ట్రీట్మెంట్‌కు ఖర్చు చేసే స్థోమత వారికి లేదు. ఆ కుటుంబం అంతా ఇప్పుడు నైరాశ్యంలో ఉంది. దాంతో రాష్ట్ర ప్రభుత్వం నవీన్‌కు ఆలస్యం లేకుండా చికిత్స అందించాలని వేడుకుంటున్నాం’ అని సోషల్ మీడియాలో ఓ వ్యక్తి కోరారు. ఆస్పత్రిలో నవీన్ ఉన్న ఫోటోలను, కేసు ఫైళ్లను కూడా  ఆ పోస్టుకు జత చేసి.. సీఎం రేవంత్ రెడ్డి, సీఎంవోను ట్యాగ్ చేశారు.

కొద్ది గంటల్లోనే ఈ పోస్ట్ సీఎం రేవంత్ రెడ్డికి రీచ్ అయింది. వెంటనే కదిలిపోయిన సీఎం.. నవీన్‌కు ఎలాంటి ఆలస్యం లేకుండా చికిత్స అందేలా చూడాలిని అధికారులను ఆదేశించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…