విద్యార్థిని పట్ల ఉపాధ్యాయుల అసభ్య ప్రవర్తన.. వెలుగులోకి కీచక పర్వం..

విద్యార్థినిలను కన్న బిడ్డల వలే చూసుకుంటూ వారికి దిశానిర్ధేశం చేయాల్సిన ఉపాధ్యాయులు ఆ వృత్తికే మాయని మచ్చలా ప్రవర్తిస్తున్నారు. విద్యా బుద్ధులు నేర్పించి, సమాజంలో ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాల్సిన టీచర్లు.. కీచకులుగా వ్యవహరిస్తున్నారు. నల్లగొండ జిల్లా కేంద్రంలోని డైట్ కాలేజీలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఉంది.

విద్యార్థిని పట్ల ఉపాధ్యాయుల అసభ్య ప్రవర్తన.. వెలుగులోకి కీచక పర్వం..
School Teacher
Follow us
M Revan Reddy

| Edited By: Srikar T

Updated on: Mar 04, 2024 | 6:53 PM

విద్యార్థినిలను కన్న బిడ్డల వలే చూసుకుంటూ వారికి దిశానిర్ధేశం చేయాల్సిన ఉపాధ్యాయులు ఆ వృత్తికే మాయని మచ్చలా ప్రవర్తిస్తున్నారు. విద్యా బుద్ధులు నేర్పించి, సమాజంలో ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాల్సిన టీచర్లు.. కీచకులుగా వ్యవహరిస్తున్నారు. నల్లగొండ జిల్లా కేంద్రంలోని డైట్ కాలేజీలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఉంది. పాఠశాల హెడ్మాస్టర్‎గా వెంకటయ్య, టీచర్‎గా శ్యాంసుందర్ విధులు నిర్వర్తిస్తున్నారు. అదే స్కూల్‎లో చదువుతున్న విద్యార్థినిల పట్ల ఈ టీచర్లు అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారు. వెకిలి చేష్టలతో విద్యార్థినిల శరీర భాగాలను టచ్ చేస్తున్నారు.

టీచర్ల వేధింపులు భరించలేక విద్యార్థినిలు తమ తల్లిదండ్రులకు విషయం చెప్పారు. దీంతో బాధిత విద్యార్థిని తల్లిదండ్రులు, బంధువులు పాఠశాలకు వచ్చి టీచర్లకు దేహాశుద్ధి చేసి జిల్లా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. విద్యార్థునిల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన టీచర్లను కఠినంగా శిక్షించాలని బాధిత తల్లిదండ్రులు, బంధువులు డిమాండ్ చేస్తున్నారు. ఫిర్యాదులు అందటంతో ఉన్నతాధికారులు రంగంలోకి దిగి విచారణ జరిపారు. పాఠశాలలో జరిగిన ఘటనపై విచారణ జరుపుతున్నామని, విద్యార్థినులను కూడా విచారించామని ఉన్నతాధికారులు చెబుతున్నారు. విచారణ నివేదికను విద్యాశాఖ ఉన్నతాధికాలకు నివేదిస్తామని వారు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..