గువ్వలచెరువు ఘాట్లో రోడ్డు ప్రమాదం.. బస్సును ఢీకొన్న లారీ..

ఘాట్ రోడ్లలో ప్రయాణం అంటేనే గుండెల్లో గుబులు పుడుతుంది. ముఖ్యంగా రాత్రి ప్రయాణాలు అంతకుమించి భయాన్ని కలిగిస్తాయి. ఇదే క్రమంలో కడప జిల్లాలోని గువ్వలచెరువు ఘాట్ మొదటి మలుపు వద్ద జరిగిన ప్రమాదం తీవ్రత తక్కువైనా అందర్నీ భయభ్రాంతులకు గురిచేస్తుంది. అతివేగంగా వచ్చిన లారీ.. బస్సును ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఓ ప్రయాణికుడు మృతి చెందాడు.

గువ్వలచెరువు ఘాట్లో రోడ్డు ప్రమాదం.. బస్సును ఢీకొన్న లారీ..
Road Accident
Follow us
Sudhir Chappidi

| Edited By: Srikar T

Updated on: Mar 04, 2024 | 4:28 PM

ఘాట్ రోడ్లలో ప్రయాణం అంటేనే గుండెల్లో గుబులు పుడుతుంది. ముఖ్యంగా రాత్రి ప్రయాణాలు అంతకుమించి భయాన్ని కలిగిస్తాయి. ఇదే క్రమంలో కడప జిల్లాలోని గువ్వలచెరువు ఘాట్ మొదటి మలుపు వద్ద జరిగిన ప్రమాదం తీవ్రత తక్కువైనా అందర్నీ భయభ్రాంతులకు గురిచేస్తుంది. అతివేగంగా వచ్చిన లారీ.. బస్సును ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఓ ప్రయాణికుడు మృతి చెందాడు.

కడప జిల్లాలోని గువ్వల చెరువు ఘాట్ ప్రమాదాలకు నిలయంగా మారింది. నిత్యం అక్కడ ఏదో ఒక ప్రమాదం జరుగుతూనే ఉంది. గతంలో గువ్వలచెరువు ఘాట్లో అనేక ప్రమాదాలు జరిగాయి. భారీ యాక్సిడెంట్లు నమోదు అయ్యే ఈ ప్రాంతాల్లో చాలా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించినప్పటికీ ఘాట్ రోడ్లలో అతివేగంగా ప్రయాణించడంతోనే ఈ ప్రమాదాలు జరుగుతున్నట్లు అర్థమవుతుంది. అర్థరాత్రి జరిగిన సంఘటన కూడా ఎందుకు నిదర్శనమే. కడప నుంచి బెంగళూరుకు బయలుదేరిన ఆర్టీసీ బస్సు అలానే రాయచోటి నుంచి కడపకు బయలుదేరిన లారీ రెండు కూడా ఢీకొన్నాయి. గువ్వల చెరువు ఘాట్ మొదటి మలుపులో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఘాట్ రోడ్డు‎లో దిగుతున్న లారీ అతివేగంగా రావటం అలాగే ఘాట్ పైకి ఎక్కుతున్న బస్సు టర్నింగ్ దగ్గర స్లోగా ప్రయాణించడంతో అతివేగంగా వచ్చిన లారీ బస్సును ఢీకొంది. బస్సులో 27వ నెంబర్ సీటు వద్ద కూర్చున్న ప్రయాణికుడిని లారీ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. బస్సును ఢీ కొట్టిన తరువాత లారీ వేగం తగ్గకుండా అదే స్పీడ్‎లో వస్తుండటంతో బస్సును గువ్వలచెరువు ఘాట్లో లోయలో పడింది.

లోయ ఎత్తు తక్కువగా ఉండడంతో లారీలో ఉన్నవారికి ఎటువంటి ప్రమాదం జరగలేదు. లారీ డ్రైవర్ అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు చెబుతున్నారు. ఏదేమైనా ఘాట్లో ప్రమాదాల తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో స్పీడ్ బ్రేకర్లను ఏర్పాటు చేయటం ప్రమాదాలు జరిగే ప్రదేశంలో ప్రమాద హెచ్చరికలు జారీ చేయడం వంటివి చేయాలని స్థానికులు కోరుకుంటున్నారు. నిత్యం ఏదో ఒక ప్రమాదం జరుగుతున్న గువ్వల చెరువు ఘాట్లో పోలీస్ పీకేటింగ్ కూడా ఏర్పాటు చేయాలని స్థానికులు భావిస్తున్నారు. గువ్వల చెరువు ఘాట్ రెండు జిల్లాలకు మధ్య ఉంటుంది ఇటు కడప అటు అన్నమయ్య జిల్లాలకు బోర్డర్గా ఉన్న గువ్వల చెరువు ఘాట్లో ప్రమాదాలు జరిగినప్పుడల్లా పోలీసులకు పెద్ద సవాలుగా మారుతోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..