Liqour Policy Scam: మరోసారి ఈడీ విచారణకు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ డుమ్మా.. కారణం ఏంటో తెలుసా?
లిక్కర్ స్కామ్‌లో కేజ్రీవాల్‌ను ఈడీ వదిలేలా లేదు. ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ముందు హాజరు కావల్సి ఉంది. ప్రత్యక్షంగా ఈడీ విచారణకు హాజరవడం లేదని కేజ్రీవాల్ తెలిపారు. అయితే, ED ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి తాను సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. ఆన్‌లైన్ మోడ్‌లో దర్యాప్తు ఏజెన్సీ ముందు హాజరవుతానని చెప్పారు.
లిక్కర్ స్కామ్‌లో కేజ్రీవాల్‌ను ఈడీ వదిలేలా లేదు. ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ముందు హాజరు కావల్సి ఉంది. ప్రత్యక్షంగా ఈడీ విచారణకు హాజరవడం లేదని కేజ్రీవాల్ తెలిపారు. అయితే, ED ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి తాను సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. ఆన్‌లైన్ మోడ్‌లో దర్యాప్తు ఏజెన్సీ ముందు హాజరవుతానని చెప్పారు. ఇందుకు సంబంధించి ED నుండి తేదీని కోరారు.
మరోవైపు అరవింద్ కేజ్రీవాల్‌ను వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా విచారించడానికి ED సిద్ధంగా లేదు. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరవింద్ కేజ్రీవాల్‌ను ముఖాముఖి విచారించాలని ఈడీ అధికారులు కోరుతున్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించే అవకాశం లేదని పేర్కొన్నారు. కాగా, ఢిల్లీ సీఎం ఈడీకి వెళ్లరని ఆప్ వర్గాలు తెలిపాయి. ఈ వ్యవహారం ప్రస్తుతం కోర్టులో ఉంది. కోర్టులో తదుపరి విచారణ మార్చి 16న చేపట్టనున్నారు.
లిక్కర్ పాలసీ స్కామ్ కేసులో విచారణకు హాజరయ్యే విషయంలో ఈడీకి వరుసగా ఎనిమిదోసారి హ్యాండిచ్చారు కేజ్రీవాల్. తాను ఢిల్లీ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టాల్సి ఉన్నందునే విచారణకు హాజరవడం లేదని కేజ్రీవాల్ తెలిపారు. ఈడీకి సమాధానం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించిన కేజ్రీవాల్ ఈనెల 12 తర్వాత విచారణ తేదీని నిర్ణయించాలని చెప్పారు..అయితే ఈలోగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు హాజరవుతానని సమాచారమిచ్చారు.
లిక్కర్ స్కామ్‌లో గత ఏడాది నవంబర్ 2, డిసెంబర్ 22, జనవరి 3, 2024, జనవరి 18, ఫిబ్రవరి 2, ఫిబ్రవరి 14, ఫిబ్రవరి 26, మార్చ్ 4వ తేదీల్లో ఇప్పటికి ఎనిమిదిసార్లు ఈడీ విచారణకు కేజ్రీవాల్ గైర్హాజరయ్యారు. ఢిల్లీ సీఎం ఏడవ సమన్లకు హాజరుకాని ఒక రోజు తర్వాత ED నుండి 8వ సమన్లు అందుకున్నారు. అయితే దీనికి ముందు ఫిబ్రవరి 19 న, సిఎం కేజ్రీవాల్ ED ఆరవ సమన్లకు కూడా హాజరు కాలేదు. జనవరి 31న కేజ్రీవాల్‌కు సమన్లు జారీ చేసిన ఈడీ, ఫిబ్రవరి 2న తన ఎదుట హాజరు కావాలని ఆదేశించింది. ఆప్ కన్వీనర్‌కు ఇది 5వ సమన్లు. అయితే సీఎం కేజ్రీవాల్ ఉద్దేశపూర్వకంగా సమన్లను పాటించడం లేదని, కుంటిసాకులు చెబుతూనే ఉన్నారని ఈడి ఫిర్యాదులో తెలిపింది. ఉన్నత పదవిలో ఉన్న ప్రభుత్వ అధికారి చట్టాన్ని ఉల్లంఘిస్తే, సామాన్యులకు తప్పుడు సంకేతాలు వెళ్తాయని ఈడీ పేర్కొంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..