AP SSC Hall Tickets: ఏపీ విద్యార్థులకు అలర్ట్.. టెన్త్‌ హాల్‌ టికెట్లు వచ్చేశాయ్.. ఇక్కడ డౌన్‌లోడ్ చేసుకోండి

AP SSC Hall Tickets 2024 : ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పరీక్షల నిర్వహణకు అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే ఇంటర్ పరీక్షలు జరుగుతుండగా.. మార్చి 18 నుంచి 30వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45గంటల వరకు పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి. ఈ క్రమంలోనే ఏపీ ఎస్ఎస్‌సీ బోర్డు పరీక్షల హాల్ టికెట్లను సోమవారం ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచింది.

AP SSC Hall Tickets: ఏపీ విద్యార్థులకు అలర్ట్.. టెన్త్‌ హాల్‌ టికెట్లు వచ్చేశాయ్.. ఇక్కడ డౌన్‌లోడ్ చేసుకోండి
Ap Ssc Hall Ticket 2024
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Mar 04, 2024 | 11:44 AM

AP SSC Hall Tickets 2024 : ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పరీక్షల నిర్వహణకు అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే ఇంటర్ పరీక్షలు జరుగుతుండగా.. మార్చి 18 నుంచి 30వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45గంటల వరకు పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి. ఈ క్రమంలోనే ఏపీ ఎస్ఎస్‌సీ బోర్డు పరీక్షల హాల్ టికెట్లను సోమవారం ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచింది. మధ్యాహ్నం 12గంటల నుంచి పాఠశాలల లాగిన్‌తో పాటు విద్యార్థులే నేరుగా హాల్‌టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని అధికారులు ఆదివారం తెలిపారు.. విద్యాశాఖ అధికారులు ప్రకటించిన వివరాల ప్రకారం అధికారిక వెబ్‌సైట్‌ https://www.bse.ap.gov.in/ లో హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవచ్చు..

హాల్ టిక్కెట్లను డౌన్‌లోడ్‌ చేసుకొనేందుకు విద్యార్థి పేరు, జిల్లా పేరు, పాఠశాల పేరు, పుట్టిన తేదీ వివరాలను ఎంటర్‌ చేయాల్సి ఉంటుంది.

పదో తరగతి హాల్ టికెట్ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

2023–24 విద్యా సంవత్సరానికి గాను 6,23,092 మంది రెగ్యులర్‌ విద్యార్థులు 10వ తరగతి పరీక్షలు రాయనున్నారు. వీరిలో 3,17,939 మంది బాలురు, 3,05,153 మంది బాలికలు ఉన్నారు. గతేడాది పదో తరగతి తప్పి మళ్లీ పరీక్ష రాస్తున్నవారు 1,02,528 మంది ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఏడాది మొత్తంగా 7,25,620 మంది పరీక్షలకు హాజరుకానున్నారు. పదో తరగతి పరీక్షల కోసం రాష్ట్ర వ్యాప్తంగా 3,473 సెంటర్లను సిద్ధం చేశారు. అంతేకాకుండా 156 ఫ్లయింగ్‌ స్క్వాడ్స్, 682 సిట్టింగ్‌ స్వాడ్స్‌ను కేటాయించారు.

పదో తరగతి పరీక్షల షెడ్యూల్ ఇదే..

  • మార్చి 18వ తేదీన ఫస్ట్ లాంగ్వేజ్
  • మార్చి 19న సెకండ్ లాంగ్వేజ్
  • మార్చి 21న థర్డ్ లాంగ్వేజ్
  • మార్చి 23న మేథ్స్
  • మార్చి 26న ఫిజిక్స్
  • మార్చి 28న బయాలజీ
  • మార్చి 30న సోషల్ స్టడీస్

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

పగిలిన డిస్‌ప్లే ఉన్న స్మార్ట్‌ఫోన్‌ను వాడుతున్నారా? ప్రమాదమేనట!
పగిలిన డిస్‌ప్లే ఉన్న స్మార్ట్‌ఫోన్‌ను వాడుతున్నారా? ప్రమాదమేనట!
కుజ దృష్టితో ఆ రాశుల వారి జీవితాల్లో కొత్త మార్పులు
కుజ దృష్టితో ఆ రాశుల వారి జీవితాల్లో కొత్త మార్పులు
షారుక్ ఖాన్ మెరుపు సెంచరీ: తమిళనాడుకు అద్భుతమైన విజయం!
షారుక్ ఖాన్ మెరుపు సెంచరీ: తమిళనాడుకు అద్భుతమైన విజయం!
ఇప్పుడు గ్లామర్‏తో మెంటలెక్కిస్తోన్న వయ్యారి..
ఇప్పుడు గ్లామర్‏తో మెంటలెక్కిస్తోన్న వయ్యారి..
సంగీత ప్రపంచంలో యార్కర్ల కింగ్ మలింగ...
సంగీత ప్రపంచంలో యార్కర్ల కింగ్ మలింగ...
నువ్వు గల్లీ క్రికెట్‌ ఆడుతున్నావా? జైస్వాల్‌కు రోహిత్ వార్నింగ్
నువ్వు గల్లీ క్రికెట్‌ ఆడుతున్నావా? జైస్వాల్‌కు రోహిత్ వార్నింగ్
ఇంటి వద్దనే డైట్ చేస్తూ ఏకంగా 18 కేజీల బరువు తగ్గిన లేడీ..
ఇంటి వద్దనే డైట్ చేస్తూ ఏకంగా 18 కేజీల బరువు తగ్గిన లేడీ..
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే