AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పరీక్ష లేకుండానే నేవీలో ఉద్యోగాలు.. నెలకు రూ. లక్షకుపైగా జీతం.! అప్లై చేసుకోండిలా..

నేవీలో ఉద్యోగమే మీ లక్ష్యమా? ఈ సువర్ణావకాశం మీకోసమే. అవును ఎలాంటి పరీక్ష లేకుండానే నేవీలో అధికారిగా జాబ్‌ కొట్టే అవకాశం వచ్చింది. షార్ట్‌ సర్వీస్‌ కమిషన్‌ విధానంలో భారతీయ నౌకాదళం 254 పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది.

పరీక్ష లేకుండానే నేవీలో ఉద్యోగాలు..  నెలకు రూ. లక్షకుపైగా జీతం.! అప్లై చేసుకోండిలా..
Indian Navy Jobs
Ravi Kiran
|

Updated on: Mar 04, 2024 | 1:45 PM

Share

నేవీలో ఉద్యోగమే మీ లక్ష్యమా? ఈ సువర్ణావకాశం మీకోసమే. అవును ఎలాంటి పరీక్ష లేకుండానే నేవీలో అధికారిగా జాబ్‌ కొట్టే అవకాశం వచ్చింది. షార్ట్‌ సర్వీస్‌ కమిషన్‌ విధానంలో భారతీయ నౌకాదళం 254 పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. వీటికి అవివాహిత మహిళలు, పురుషులు దరఖాస్తు చేసుకోవచ్చు. బీటెక్‌, ఎంఏ, ఎమ్మెస్సీ, ఎంబీఏ విద్యార్హతలు ఉన్నవారు అర్హులు.

అకడమిక్‌ మార్కుల మెరిట్‌ ప్రకారం అభ్యర్థులను సెలక్ట్‌ చేసి ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. ఇందులో ప్రతిభకనబరిచిన వారిని ట్రైనింగ్‌కు తీసుకుంటారు. అనంతరం సబ్‌ లెఫ్టినెంట్‌ హోదాతో విధుల్లోకి తీసుకుంటారు. ఎంపికైన అభ్యర్ధులకు మంచి వేతనంతోపాటు ప్రోత్సాహకాలు లభిస్తాయి. ఈ పోస్టులన్నీ ఎగ్జిక్యూటివ్‌, ఎడ్యుకేషన్‌, టెక్నికల్‌ బ్రాంచీల్లో ఉన్నాయి. ఇవన్నీ లెవెల్‌-10 హోదా ఉద్యోగాలే. ఈ పోస్టులకు రాత పరీక్షలు లేకపోవడం అభ్యర్థులకు ప్లస్‌ పాయింట్‌. దరఖాస్తు చేసుకున్నవారిని అకడమిక్‌ ప్రతిభతో సెలెక్ట్‌ చేస్తారు. అందువల్ల UG/PGలో ఎక్కువ మార్కులు పొందినవారు సెలెక్ట్‌ అయ్యే ఛాన్సెస్‌ ఎక్కువ. ఒక్కో పోస్టుకు నిర్ణీత సంఖ్యలో అభ్యర్థులను ఇంటర్వ్యూకు ఆహ్వానిస్తారు. ఇవి సర్వీస్‌ సెలక్షన్‌ బోర్డు SSB ఆధ్వర్యంలో జరుగుతాయి. ఇందులో విజయవంతులైనవారికి వైద్య పరీక్షలు నిర్వహించి, తుది నియామకానికి ఖరారు చేస్తారు.

వీరికి నేవల్‌ అకాడెమీ, ఎజిమాళలో జనవరి, 2025 నుంచి 22 వారాలపాటు సంబంధిత విభాగాల్లో తర్ఫీదునిస్తారు. ఆ తర్వాత మరో 22 వారాలు సంబంధిత విభాగానికి చెందిన కేంద్రంలో తదుపరి శిక్షణ ఉంటుంది. అనంతరం సబ్‌ లెఫ్టినెంట్‌ హోదాతో విధుల్లోకి తీసుకుంటారు. ఉద్యోగంలో మూల వేతనం రూ.56,100 అందుతుంది. దీనికి డీఏ, హెచ్‌ఆర్‌ఏ, ఇతర ప్రోత్సాహకాలు అదనం. మొదటి నెల నుంచే రూ.లక్షకు పైగా జీతం అందుకోవచ్చు. ప్రొబేషన్‌ వ్యవధి పోస్టును బట్టి రెండు లేదా మూడేళ్లు ఉంటుంది. ఈ పోస్టులు షార్ట్‌ సర్వీస్‌ కమిషన్‌ పద్ధతిలో ఉంటాయి. ఎంపికైనవారు పదేళ్లపాటు విధుల్లో కొనసాగుతారు. అనంతరం రెండేళ్లు చొప్పున రెండు సార్లు సర్వీసు పొడిగిస్తారు. అందువల్ల గరిష్ఠంగా 14 ఏళ్లపాటు ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించవచ్చు. ఆ తర్వాత విధుల నుంచి వైదొలగాలి. నేవీలో పని అనుభవంతో వీరు సులువుగానే ఇతర ఉద్యోగాలు పొందగలరు. పోస్టు ప్రకారం మారుతుంది. ఎక్కువ ఖాళీలకు జనవరి 2, 2000 – జనవరి 1, 2004/2005/2006 మధ్య జన్మించినవారు దరఖాస్తు చేసుకోవచ్చు. పై అన్ని పోస్టులకూ ప్రస్తుతం చివరి ఏడాది కోర్సులు చదువుతున్నవారూ అర్హులే. ఎన్‌సీసీ సి సర్టిఫికెట్‌ ఉన్నవారికి అకడమిక్‌ మార్కుల్లో 5 శాతం సడలింపు వర్తిస్తుంది. అభ్యర్థులు దరఖాస్తులో పోస్టులవారీ ప్రాధాన్యం తప్పకుండా తెలపాలి. ఇక ఈ పోస్టులకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోడానికి మార్చి 10 చివరి తేదీ. SSB ఇంటర్వ్యూ కేంద్రాలు బెంగళూరు, భోపాల్‌, విశాఖపట్నం, కోల్‌కతాలో ఉంటాయి. పైలట్‌, అబ్జర్వర్‌ పోస్టులకు మాత్రం బెంగళూరులోనే నిర్వహిస్తారు. వివరాలకు www.joinindiannavy.gov.in వెబ్‌సైట్‌ను సంప్రదించండి.