Jharkhand: శ్మశానంలో దొంగలు పడ్డారు.. సమాధుల్లో మృతదేహాలు మాయం.. గ్రామస్తుల్లో భయం భయం..

సిజువా గ్రామంలో ఇటీవల ఓ వ్యక్తి మృతి చెందడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. అంత్యక్రియల కోసం గ్రామస్తులు అతని మృతదేహాన్ని జమునియా నది ఒడ్డున ఉన్న శ్మశానవాటికకు తీసుకెళ్లారు. శ్మశానవాటికకు చేరుకోగానే అక్కడి దృశ్యం చూసి షాక్ తిన్నారు. శ్మశాన వాటికలోని సమాధుల మట్టిని తొలగించినట్లు గుర్తించారు. ఈ ఘటన వెలుగులోకి రావడంతో శ్మశాన వాటిక వద్దకు సిజువా పంచాయతీ అధినేత్రి భర్త రాజేష్ రామ్ , ఇతర గ్రామస్తులు చేరుకున్నారు.

Jharkhand: శ్మశానంలో దొంగలు పడ్డారు.. సమాధుల్లో మృతదేహాలు మాయం.. గ్రామస్తుల్లో భయం భయం..
Dead Bodies Missing
Follow us
Surya Kala

|

Updated on: Mar 05, 2024 | 9:11 AM

జార్ఖండ్‌లో సమాధుల నుండి మృతదేహాలను చోరీ చేసిన ఆశ్చర్యకరమైన ఉదంతం వెలుగులోకి వచ్చింది. బొకారో జిల్లాలోని సిజువా గ్రామం శ్మశాన వాటికలో ఖననం చేయబడిన ఆరు మృతదేహాలు అదృశ్యమయ్యాయి. మృతదేహాలు అదృశ్యం కావడంతో గ్రామంలో కలకలం రేగింది. పోలీసులకు సమాచారం అందించారు. ఆ సంఘటన చూసి పోలీసులు కూడా ఆశ్చర్యపోయారు. మృతదేహాలు గల్లంతైన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మృత దేహాలను దొంగలించి మానవ అవయవాలను స్మగ్లింగ్ చేస్తున్నారమే అని గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో సమాధులు చోరీకి గురైన మృతదేహాల కుటుంబాల్లో ఆందోళన వ్యక్తం అవుతుంది. ఈ ఘటనతో సిజువా గ్రామంతో పాటు చుట్టుపక్కల గ్రామాల్లోనూ కలకలం రేపింది. ఈ ప్రాంతంలో మానవ అవయవాలను అక్రమంగా తరలించే ముఠా ఉందని గ్రామస్తులు చెబుతున్నారు.

సమాధుల్లోని మృతదేహాలు మాయం

సిజువా గ్రామంలో ఇటీవల ఓ వ్యక్తి మృతి చెందడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. అంత్యక్రియల కోసం గ్రామస్తులు అతని మృతదేహాన్ని జమునియా నది ఒడ్డున ఉన్న శ్మశానవాటికకు తీసుకెళ్లారు. శ్మశానవాటికకు చేరుకోగానే అక్కడి దృశ్యం చూసి షాక్ తిన్నారు. శ్మశాన వాటికలోని సమాధుల మట్టిని తొలగించినట్లు గుర్తించారు. శ్మశాన వాటిక వద్దకు సిజువా పంచాయతీ అధినేత్రి భర్త రాజేష్ రామ్ , ఇతర గ్రామస్తులు చేరుకున్నారు. శ్మశాన వాటికలో ఇటీవల మరణించిన వ్యక్తుల సమాధి నుంచి మట్టిని తొలగించినట్లు.. పూడ్చిపెట్టిన మృతదేహాలు సమాధుల్లో లేవని గుర్తించినట్లు చెప్పారు. మొత్తం ఇటీవల మరణించిన ఆరుగురు వ్యక్తుల సమాధులుగా గ్రామస్తులు చెబుతున్నారు. ఇలా శ్మశాన వాటికలో పాతిపెట్టిన మృతదేహం చోరీకి గురికావడం సంచలనం రేపింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..