దేశంలోనే రిచెస్ట్‌ పార్టీ..! అనంత్ అంబానీ-రాధిక మార్చంట్ ఫ్రీ వెడ్డింగ్ వేడుక.. నీతా అంబానీ కట్టిన చీర స్పెషల్‌ ఏంటో తెలుసా..?

అంబే మాత స్తుతి అయిన విశ్వంభర స్తుతి కార్యక్రమంలో నీతా అంబానీ నాట్యం చేశారు.. ఆమె ఈ కాంచీపూరం చీరలో ఎంతో భక్తిశ్రద్ధలతో ఈ శ్లోకాన్ని ప్రదర్శించి అందరి దృష్టిని ఆకర్షించారు. అనంత్, రాధికల వివాహానికి ముందుగా వారు తమ ఇష్టదైవానికి పూజలు చేశారు. ఆమెతో పాటు పలువురు డ్యాన్సర్లు కూడా నాట్యాన్ని ప్రదర్శించారు. నీతా అంబానీ తన మనవరాలు ఆదియ శక్తి, వేద, అమ్మాయిలందరికీ ఈ ప్రదర్శనను అంకితం చేశారు.

దేశంలోనే రిచెస్ట్‌ పార్టీ..! అనంత్ అంబానీ-రాధిక మార్చంట్ ఫ్రీ వెడ్డింగ్ వేడుక.. నీతా అంబానీ కట్టిన చీర స్పెషల్‌ ఏంటో తెలుసా..?
Nita Ambani
Follow us
Jyothi Gadda

|

Updated on: Mar 05, 2024 | 9:41 AM

Anant Ambani pre-wedding: ప్రస్తుతం దేశవ్యాప్తంగా అనంత్ అంబానీ-రాధిక మార్చంట్ ఫ్రీ వెడ్డింగ్ కార్యక్రమాలకు హాట్ టాపిక్ గా మారాయి. దేశంలోనే అత్యంత సంపన్న వివాహంగా భావించే ముకేశ్ అంబానీ, నీతా అంబానీల చిన్న కుమారుడు అనంత్ అంబానీ వివాహం రాధికా మర్చంట్‌తో జరగనుంది. ఇప్పటికే ప్రీ వెడ్డింగ్ కార్యక్రమాలు గుజరాత్‌లోని జామ్ నగర్‌లో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి.. మూడో రోజు ఇక్కడ జరిగిన కార్యక్రమంలో నీతా అంబానీ సంప్రదాయ కాంచీపురం చీరను ధరించారు. రిలయన్స్ ఫౌండేషన్ స్థాపించిన ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ చైర్‌పర్సన్, రిలయన్స్ ఇండస్ట్రీస్ డైరెక్టర్ అయిన నీతా అంబానీ.. భారతదేశంలోని ప్రసిద్ధ దక్షిణ భారత కాంచీపురం చీరను ఎంచుకోవటం పట్ల సర్వత్ర ప్రశంసలు కురింపించారు.

సంపన్న కుటుంబాల పెళ్లిళ్లలో చాలా వరకు బట్టలు విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటారు. అయితే ఇక్కడ నీతా అంబానీ భారతదేశంలో తయారైన చీరను ధరించి సరికొత్త సంస్కృతి, కొత్త విప్లవానికి నాంది పలికారు. దేశంలోనే రిచెస్ట్ అనంత్ అంబానీ-రాధిక మార్చంట్ ఫ్రీ వెడ్డింగ్ కార్యక్రమంలో ఆష్‌ కలర్‌ కాంచీపురం చీర కట్టుకుని నీతా అంబానీ స్వర్గం నుంచి దిగివచ్చిన అప్సరసలా కనిపించింది. స్థానిక పరిశ్రమలకు మద్దతుగా స్థానిక కళాకారులచే తయారు చేయబడిన మనీష్ మల్హోత్రా రూపొందించిన చీరను ఆమె ధరించింది. కాంచీపురం అనేది చేనేతతో తయారు చేయబడిన దక్షిణ భారత చీర. దానిపై ఎంబ్రాయిడరీని మనీష్ మల్హోత్రా డిజైన్ చేశారు.

ఇవి కూడా చదవండి

అనంత్, రాధిక ప్రీ వెడ్డింగ్ ఫంక్షన్ కోసం నీతా అంబానీ ధరించిన కాంచీపురం చీర నిజంగా అద్భుతంగా కనిపించింది. మనీష్ మల్హోత్రా ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ ఈవెంట్ కోసం టైలర్ మేడ్ చీర అని, భారతీయ సంప్రదాయం, కళాకారుల పట్ల అతనికి ఎంత గౌరవం ఉందో చూపిస్తుంది. స్వదేశ్ ఇన్‌స్టాగ్రామ్‌లో దీని గురించి ఒక పోస్ట్ వైరల్‌గా మారింది. నీతా అంబానీకి మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అనంత్, రాధిక ప్రీ వెడ్డింగ్ ఈవెంట్‌లో ఆమె కాంచీపురం చీరను ధరించి స్వదేశీ ఉత్పత్తులకు మద్దతు ఇచ్చారని ప్రశంసించారు. ఈ చీర దక్షిణ భారతీయ కళాకారుల నుండి అద్భుతమైన చేనేత బహుమతి. భారతదేశంలోని చేనేత, హస్త కళ, కళాకారులను మరింత ప్రోత్సహించాలని వారు కోరుతూ క్యాప్షన్‌లో రాశారు.

అంబే మాత స్తుతి అయిన విశ్వంభర స్తుతి కార్యక్రమంలో నీతా అంబానీ నాట్యం చేశారు.. ఆమె ఈ కాంచీపూరం చీరలో ఎంతో భక్తిశ్రద్ధలతో ఈ శ్లోకాన్ని ప్రదర్శించి అందరి దృష్టిని ఆకర్షించారు. అనంత్, రాధికల వివాహానికి ముందుగా వారు తమ ఇష్టదైవానికి పూజలు చేశారు. ఆమెతో పాటు పలువురు డ్యాన్సర్లు కూడా నాట్యాన్ని ప్రదర్శించారు. నీతా అంబానీ తన మనవరాలు ఆదియ శక్తి, వేద, అమ్మాయిలందరికీ ఈ ప్రదర్శనను అంకితం చేశారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?