Lip Care Tips: మీ పెదవులు అందంగా, లేత గులాబీ రంగులో ఉండాలంటే.. నిమ్మరసంతో ఈ పదార్థాన్నీ కలిపి అప్లై చేయండి..!

పెదవులపై నలుపు రంగును తొలగించేందుకు నిమ్మరసంతో తయారు చేసుకున్న ఈ మిశ్రమం ఎంతగానో ఉపయోగపడుతుంది. ముందుగా మీ పెదాలను శుభ్రమైన నీటితో కడిగి కాటన్ క్లాత్‌తో తుడిచేయాలి. ఆ తర్వాత, కాటన్ సహాయంతో ముందుగా మనం తయారు చేసిన మిశ్రమాన్ని పెదవులపై అప్లై చేయండి. ఈ మిశ్రమాన్ని కనీసం 20 నిమిషాలు అలాగే ఉంచండి. ఇలా చేయడం వల్ల పెదవుల నలుపు పోతుంది. క్రమంగా మీ పెదవుల రంగు లేత గులాబీ కలర్ లోకి మారిపోతుంది. 

Lip Care Tips: మీ పెదవులు అందంగా, లేత గులాబీ రంగులో ఉండాలంటే.. నిమ్మరసంతో ఈ పదార్థాన్నీ కలిపి అప్లై చేయండి..!
Lip Care
Follow us
Jyothi Gadda

|

Updated on: Mar 05, 2024 | 7:41 AM

చలికాలంలో ఒక విధమైన చర్మ సమస్యలు ఉంటే, వేసవిలో మరో విధంగా ఆందోళన మొదలవుతుంది. ఎండాకాలంలో సూర్యుడి వేడి మనపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. దాంతో ఆరోగ్య సమస్యలే కాకుండా చర్మ సమస్యలు కూడా ఇబ్బంది పెడుతుంటాయి. దాని ప్రభావం మన పెదవులపై కూడా కనిపిస్తుంది. వేసవిలో మన పెదవులు నల్లగా మారుతాయి. సూర్యరశ్మి ఎక్కువగా ఉండటం వల్ల మన పెదవులు టాన్‌గా మారుతాయి. ఇది పెదాల అందాన్ని ప్రభావితం చేస్తుంది. మన పెదవుల చర్మం సాధారణ చర్మం కంటే చాలా సున్నితంగా ఉంటుంది. పెదాలను సరిగ్గా చూసుకోకపోతే వాటి రంగు నల్లబడటం మొదలవుతుంది. కానీ, కొన్ని హోం రెమెడీస్ సహాయంతో నల్లబడిన పెదవులను మళ్లీ గులాబీ రంగులోకి మార్చుకోవచ్చు. అలాంటి చిట్కాలను ఇక్కడ తెలుసుకుందాం..

ఎండాకాలం మొదలవుతుంది.. కాబట్టి, ఎండ వేడిమి నుండి చర్మాన్ని రక్షించుకోవడానికి చాలా మంది ఖరీదైన చర్మ సంరక్షణ ఉత్పత్తులను ఉపయోగిస్తుంటారు. అయితే, అవేవీ అవసరం లేకుండా.. ఇంట్లో అందుబాటులో ఉన్న పదార్థాలతో నల్లబడిన పెదాలను గులాబీ రంగులోకి మార్చుకోవచ్చు. ఇందుకోసం నిమ్మరసం సరిపోతుంది. నిమ్మకాయలోని సహజమైన బ్లీచింగ్ ప్రభావం మీ పెదాల అందాన్ని కాపాడుకోవడంలో సహాయపడుతుంది. పెదాల అందాన్ని కాపాడుకోవడానికి ఈ పద్ధతి చాలా సులభం. దీని కోసం మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. ఒక క్లీన్ బౌల్‌లో ఒక టేబుల్ స్పూన్ తాజా నిమ్మరసం తీసుకుని దానికి చక్కెర పొడిని కలపండి. ఈ మిశ్రమాన్ని బాగా మిక్స్‌ చేసి కనీసం 15 నిమిషాల పాటు పక్కన ఉంచండి. ఆ తర్వాత అందులో అర చెంచా తేనె కలుపుకుంటే బాగా పనిచేస్తుంది.

ఎండవేడికి కందిపోయిన పెదవులపై నలుపు రంగును తొలగించేందుకు నిమ్మరసంతో తయారు చేసుకున్న ఈ మిశ్రమం ఎంతగానో ఉపయోగపడుతుంది. ముందుగా మీ పెదాలను శుభ్రమైన నీటితో కడిగి కాటన్ క్లాత్‌తో తుడిచేయాలి. ఆ తర్వాత, కాటన్ సహాయంతో ముందుగా మనం తయారు చేసిన మిశ్రమాన్ని పెదవులపై అప్లై చేయండి. ఈ మిశ్రమాన్ని కనీసం 20 నిమిషాలు అలాగే ఉంచండి. ఇలా చేయడం వల్ల పెదవుల నలుపు పోతుంది. క్రమంగా మీ పెదవుల రంగు లేత గులాబీ కలర్ లోకి మారిపోతుంది.

ఇవి కూడా చదవండి

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది… ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!
గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!
ఆదివారం రోజు ఈ నివారణలు చేయండి.. ఇంట్లో డబ్బులకు లోటు ఉండదు
ఆదివారం రోజు ఈ నివారణలు చేయండి.. ఇంట్లో డబ్బులకు లోటు ఉండదు
ఆన్‌లైన్‌ లక్కీ డ్రాలో మీరే విజేత.. రూ.15లక్షలు, కారు మీ సొంతం..!
ఆన్‌లైన్‌ లక్కీ డ్రాలో మీరే విజేత.. రూ.15లక్షలు, కారు మీ సొంతం..!
ఔట్ అయింది ఎవరు? వికెట్ తీసింది ఎవరు? ద్రావిడ్ ఆశక్తికర ప్రశ్న..
ఔట్ అయింది ఎవరు? వికెట్ తీసింది ఎవరు? ద్రావిడ్ ఆశక్తికర ప్రశ్న..
శీతాకాలంలో కారు ప్రయాణమా..? ఇవి లేకుంటే చాలా ప్రమాదం
శీతాకాలంలో కారు ప్రయాణమా..? ఇవి లేకుంటే చాలా ప్రమాదం
కాశీలో శ్రీలీల ప్రత్యేక పూజలు.. ఫొటోస్ వైరల్.. ఎందుకో తెలుసా?
కాశీలో శ్రీలీల ప్రత్యేక పూజలు.. ఫొటోస్ వైరల్.. ఎందుకో తెలుసా?
ఆ విషయంలో మహిళల కంటే పురుషులే బెటర్.. తాజా రిపోర్ట్ ఇదే..
ఆ విషయంలో మహిళల కంటే పురుషులే బెటర్.. తాజా రిపోర్ట్ ఇదే..
అమ్మో.. వెనక్కు వెళ్లిన సముద్రం.. ఆందోళనలో ప్రజలు.! వీడియో..
అమ్మో.. వెనక్కు వెళ్లిన సముద్రం.. ఆందోళనలో ప్రజలు.! వీడియో..
జ్వరంతో ఉన్నప్పుడు చికెన్ తినవచ్చా.. తింటే ఏం జరుగుతుందంటే..
జ్వరంతో ఉన్నప్పుడు చికెన్ తినవచ్చా.. తింటే ఏం జరుగుతుందంటే..
కొత్త టెన్నిస్ స్కూటర్.. మార్కెట్‌ను ఆడేసుకుంటుందా..?
కొత్త టెన్నిస్ స్కూటర్.. మార్కెట్‌ను ఆడేసుకుంటుందా..?