Drinking Water Before Brush : ఉదయాన్నే పళ్లు తోమకుండా నీళ్లు తాగుతున్నారా..? ఇలా చేస్తే ఏమవుతుందో తెలుసా..

తాగునీరు ఆరోగ్యానికి చాలా ముఖ్యమైనది. ఆరోగ్యకరమైన వ్యక్తి శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచడానికి రోజుకు 8 నుండి 10 గ్లాసుల నీరు తాగాలి. వేసవిలో ఇది చాలా ముఖ్యం. అందుకే ఉదయం లేవగానే మనం బ్రష్ చేశామా లేదా అని ఆలోచించకుండా దాహం వేస్తుంది. ఇలాంటప్పుడు ఉదయాన్నే నిద్రలేచి బ్రష్ చేయకుండానే నీళ్లు తాగాలా వద్దా అనే సందేహం తలెత్తుతుంది. అలా తాగితే ఏమవుతుందో ఇక్కడ తెలుసుకుందాం..

Drinking Water Before Brush : ఉదయాన్నే పళ్లు తోమకుండా నీళ్లు తాగుతున్నారా..? ఇలా చేస్తే ఏమవుతుందో తెలుసా..
Drinking Water Before Brush
Follow us
Jyothi Gadda

|

Updated on: Mar 05, 2024 | 7:06 AM

Drinking Water Before Brush : మనం ప్రతిరోజూ ఉదయాన్నే నిద్రలేచి పళ్ళు తోముకోవడం వల్ల దంతాలు, నోటిని శుభ్రపరుస్తుంది. నోటి దుర్వాసనలను తొలగిస్తుంది. అందుకే బ్రష్ చేయకుండా అల్పాహారం తీసుకోవద్దని మన పెద్దలు, వైద్యులు చెబుతారు. ఎందుకంటే నోటిలో సూక్ష్మజీవులు ఉండి అవి ఆహారం ద్వారా కడుపులోకి చేరి అనారోగ్యాన్ని కలిగిస్తాయి. అయితే, ఉదయం నిద్రలేచిన వెంటనే నీళ్లు తాగడం ఆరోగ్యానికి మంచిదని నిపుణులు చెబుతున్నారు. అందుకే నిద్రలేవగానే నీళ్లు తాగమని సలహా ఇస్తారు. ఇలాంటప్పుడు ఉదయాన్నే నిద్రలేచి బ్రష్ చేయకుండానే నీళ్లు తాగాలా వద్దా అనే సందేహం తలెత్తుతుంది. అలా తాగితే ఏమవుతుందో ఇక్కడ తెలుసుకుందాం..

తాగునీరు ఆరోగ్యానికి చాలా ముఖ్యమైనది. ఆరోగ్యకరమైన వ్యక్తి శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచడానికి రోజుకు 8 నుండి 10 గ్లాసుల నీరు తాగాలి. వేసవిలో ఇది చాలా ముఖ్యం. అందుకే ఉదయం లేవగానే మనం బ్రష్ చేశామా లేదా అని ఆలోచించకుండా దాహం వేస్తుంది. అందుకే ఉదయాన్నే పళ్ళు తోముకోకుండా నీరు తాగడం వల్ల ఎటువంటి హాని ఉండదని, దాని నుండి చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని చెబితే, మీరు కూడా ఆశ్చర్యపోవచ్చు. అవును, ఇది నిజమేనట.. ప్రతిరోజూ నిద్రలేవగానే పళ్లు తోమకుండానే నీళ్లు తాగడం వల్ల ఎలాంటి హానీ జరగదు. ఇలా తాగితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయని నిపుణులు చెబుతున్నారు.

పళ్లు తోముకోకుండా నీరు తాగినప్పుడు నోటిలో ఉండే బ్యాక్టీరియా లాలాజలం ద్వారా ఉదరం లోకి వెళుతుంది. కానీ దానిలో ఉండే అధిక అమ్ల కంటెంట్ వల్ల బ్యాక్టీరియా చనిపోతుంది. కాబట్టి బ్రష్‌ చేయకుండా నీరు భేషుగ్గా తాగొచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇలా చేస్తే కలిగే లాభాలేంటో ఇక్కడ తెలుసుకుందాం..

ఇవి కూడా చదవండి

1. ఉదయాన్నే పళ్లు తోముకునే ముందు ఒక గ్లాసు నీరు తాగడం వల్ల రోగనిరోధక శక్తిని పెంచి ఎలాంటి ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా కాపాడుతుంది.

2. బ్రష్ చేయకుండా నీరు తాగడం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. నోటి దుర్వాసన కూడా తొలగిపోతుంది.

3. పళ్లు తోమకుండా నీళ్లు తాగడం వల్ల జుట్టు బలంగా, నిగనిగలాడుతుందని చాలా మందికి తెలియదు.

4. ఇలా నీరు తాగడం వల్ల ముఖం, చర్మానికి అద్భుతమైన గ్లో వస్తుంది. ముఖం కాంతివంతంగా కనిపించడం ప్రారంభమవుతుంది.

5. మీరు డయాబెటిక్ అయితే, మీరు ఉదయం లేచిన వెంటనే నీరు తాగాలి. దాని కోసం బ్రష్ చేయడానికి వేచి ఉండకండి.

6. ఇలా నీళ్లు తాగడం వల్ల స్థూలకాయం కూడా క్రమంగా తగ్గుముఖం పడుతుందని పలువురు ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

7. బ్రష్ చేయకుండా నీళ్లు తాగడం వల్ల మలబద్ధకం, అసిడిటీ వంటి పొట్ట సమస్యలు కూడా తొలగిపోతాయి.

8. కావిటీస్ ప్రామాదాన్ని తగ్గిస్తుంది.. ప్రతిరోజూ పరిగడుపునే నీళ్లను తాగడం వల్ల నోటిలో బ్యాక్టీరియా పేరుకుపోదు. అలాగే కావిటీస్ ప్రమాదం కూడా తగ్గుతుంది.

9. బరువు తగ్గడానికి సహాయపడుతుంది.. ఎవరైతే అధిక బరువుతో బాధపడుతున్నారో వారు రెగ్యులర్ గా దంతాలు తోమడానికి ముందు గా నీళ్లను మంచిది. ఇలా చేస్తే మీరు వేగంగా బరువు తగ్గుతారు.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది… ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..