AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lifestyle: ఉదయం కాఫీ తాగితే ఇంత ప్రమాదమా.? హెచ్చరిస్తున్న నిపుణులు

ఉదయం నిద్రలేవగానే కాఫీ తాగడం మనలో చాలా మందికి ఉండే అలవాటు. కాఫీ తాగకపోతే ఏదో కోల్పోయామన్న భావనలో ఉంటారు. అయితే ఖాళీ కడుపుతో కాఫీ తాగితే మాత్రం ప్రమాదకరమని నిపుణులు చెబతున్నారు. కాఫీ తాగడం వల్ల కొన్ని ప్రయోజనాలు ఉన్నాయన్నదాంట్లో ఎంత నిజం ఉందో, పడిగడుపున తాగితే...

Lifestyle: ఉదయం కాఫీ తాగితే ఇంత ప్రమాదమా.? హెచ్చరిస్తున్న నిపుణులు
Coffee Side Effects
Narender Vaitla
|

Updated on: Mar 04, 2024 | 8:27 PM

Share

ఉదయం నిద్రలేవగానే కాఫీ తాగడం మనలో చాలా మందికి ఉండే అలవాటు. కాఫీ తాగకపోతే ఏదో కోల్పోయామన్న భావనలో ఉంటారు. అయితే ఖాళీ కడుపుతో కాఫీ తాగితే మాత్రం ప్రమాదకరమని నిపుణులు చెబతున్నారు. కాఫీ తాగడం వల్ల కొన్ని ప్రయోజనాలు ఉన్నాయన్నదాంట్లో ఎంత నిజం ఉందో, పడిగడుపున తాగితే అంతే ప్రమాదమని చెబుతున్నారు. ఇంతకీ ఖాళీ కడుపుతో కాఫీ తాగితే జరిగే నష్టాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

* ఉదయం లేవగానే కాఫీ తాగితే కడుపులో యాసిడ్ రిఫ్లక్స్‌ను పెంచుతుంది. అలాగే కార్టిసాల్ స్థాయిలను పెరగడానికి కారణమవుతుంది. ఇది ఒత్తిడిని పెంచుతుంది.

* కాఫీ శరీరంలో శక్తి స్థాయిలను ఒక్కసారిగా పెంచుతుంది. అయితే ఖాళీ కడుపుతో తాగితే మాత్రం ఆందోళన, భయం, ఒత్తిడిని పెంచుతుంది. ఉద్రేకం పెరుగుతుంది. అలాగే రోజువారీ కార్యకలాపాలకు ఆటంకం కలిగిస్తుంది. విశ్రాంతిని దెబ్బ తీయడమే కాకుండా ఏకాగ్రతను దెబ్బ తీస్తుంది.

* కాఫీలో యాసిడ్‌ ఉంటుంది. ఖాళీ కడుపుతో తీసుకుంటే కడుపులో ఆమ్లత్వం పెరుగుతుంది. కెఫిన్‌, యాసిడ్ స్థాయిల కలయిక కడుపుని చికాకుపెడుతుంది. దీంతో కడుపులో నొప్పి, గుండెల్లో మంట, యాసిడ్ రిఫ్లక్స్‌కు కారణమవుతుంది. కాలక్రమేణ ఇది అల్సర్స్ వంటి తీవ్రమైన సమస్యలు కూడా దారి తీయొచ్చు.

* కాఫీలో టానిన్లు అనే సమ్మేళనాలు ఉంటాయి. ఇవి శరీరంలో ఐరన్‌, కాల్షియం సహా కొన్ని పోషకాల శోషణకు ఆటంకం కలిగిస్తాయి. దీంతో శరరం త్వరగా అనారోగ్యానికి గురవుతుంది.

* ఇక కెఫీన్ ఇన్సులిన్ సెన్సిటివిటీని ప్రభావితం చేస్తుంది. అలాగే రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడానికి కెఫిన్‌ కారణమవుతుందని నిపుణులు చెబుతున్నారు. ఖాళీ కడుపుతో కాఫీ తాగడం వల్ల రక్తంలో చక్కెర వేగంగా పెరుగుతుంది.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..