Lifestyle: డయాబెటిస్ బాధితులు ఉల్లిపాయ తినొచ్చా.. నిపుణులు ఏం చెబుతున్నారంటే
ఉల్లిపాయ ఆరోగ్యానికి ఎంతలా మేలు చేస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదని చెప్పేది అందుకే. ఇక ఉల్లిపాయ లేకుండా ఎలాంటి కూరను ఊహించుకోలేము. మరి ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేసే ఉల్లిపాయ డయాబెటిస్ రోగులు తీసుకోవాలా.? వద్ద అనే అనుమానం రాకమానదు. ఇంతకీ నిపుణులు...
ప్రపంచవ్యాప్తంగా డయాబెటిస్ బారిన పడుతోన్న వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. మారుతోన్న జీవన విధానం, తీసుకుంటున్న ఆహారంలో మార్పుల కారణంగా డయాబెటిస్ రోగు సంఖ్య క్రమంగా పెరుగుతోంది. దీంతో డయాబెటిస్‌తో బాధపడుతోన్న వారు తీసుకునే ఆహారం మొదలు, జీవనశైలిలో మార్పులు చేసుకోవాల్సి పరిస్థితి నెలకొంది. ఏ ఆహార తీసుకోవాలన్నా ఒకటికి రెండు సార్లు ఆలోచించాలి.
ఉల్లిపాయ ఆరోగ్యానికి ఎంతలా మేలు చేస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదని చెప్పేది అందుకే. ఇక ఉల్లిపాయ లేకుండా ఎలాంటి కూరను ఊహించుకోలేము. మరి ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేసే ఉల్లిపాయ డయాబెటిస్ రోగులు తీసుకోవాలా.? వద్ద అనే అనుమానం రాకమానదు. ఇంతకీ నిపుణులు అభిప్రాయం ప్రకారం డయాబెటిస్ బాధితులు ఉల్లిపాయ తీసుకోవచ్చో లేదో ఇప్పుడు తెలుసుకుందాం..
నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్‌లో ఉల్లిపాయలపై నిర్వహించిన పరిశోధనలో పలు ఆసక్తిర విషయాలు వెల్లడయ్యాయి. టైప్ 2 డయాబెటిస్ ఉన్న వారు ఉల్లిపాయ రసం తాగితే, అది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుందని పరిశోధనల్లో తేలింది. అలాగే టైప్ 1 డయాబెటిస్ రోగులకు పచ్చి ఉల్లిపాయ ఎంతగానో ఉపయోగపడుతుంది. అదేవిధంగా శాన్ డియాగోలో జరిగిన ఎండోక్రైన్ సొసైటీ నివేదికలో తేలిన అంశాల ప్రకారం ఉల్లిపాయలు ఏ విధంగా తీసుకున్నా అధిక రక్తపోటును, కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుందని చెబుతున్నారు.
ఇదిలా ఉంటే డయాబెటిక్ రోగులు చాలా బలహీనమైన రోగనిరోధక శక్తిని కలిగి ఉంటారు. దీంతో వీరికి ఎలాంటి వైరస్ అయినా సులభంగా వ్యాపిస్తుంది. అయితే ప్రతీరోజూ పచ్చి ఉల్లిపాయను తీసుకుంటే రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది. ఇందులో ఉండే విటమిన్ సి, యాంటీ-ఆక్సిడెంట్ గుణాలు శరీరంలోని ఇన్‌ఫెక్షన్లకు వ్యతిరేకంగా రక్షణ పొరను సృష్టించడానికి పని చేస్తాయి.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..