డ్రగ్స్ తీసుకునే వారిని అలా చేయాలట.. నార్కోటిక్ డైరెక్టర్ సందీప్ శాండిల్య..

హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ రూమ్‎లో డ్రగ్స్‎పై అవగాహన సదస్సు నిర్వహించారు. వరుసగా నమోదవుతున్న డ్రగ్స్ కేసుల నేపథ్యంలో పోలీసులు అలెర్ట్ అయ్యారు. విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు డ్రగ్స్ భూతంపై అవగాహన కల్పించారు. నార్కో టెర్రరిజంపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. డ్రగ్ ఫ్రీ హైదరాబాద్‎లో భాగంగా కమాండ్ కంట్రోల్ సెంటర్‎లో సెమినార్‎ను ప్రారంభించారు.

డ్రగ్స్ తీసుకునే వారిని అలా చేయాలట.. నార్కోటిక్ డైరెక్టర్ సందీప్ శాండిల్య..
Telangana Drugs
Follow us

| Edited By: Srikar T

Updated on: Mar 04, 2024 | 4:02 PM

హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ రూమ్‎లో డ్రగ్స్‎పై అవగాహన సదస్సు నిర్వహించారు. వరుసగా నమోదవుతున్న డ్రగ్స్ కేసుల నేపథ్యంలో పోలీసులు అలెర్ట్ అయ్యారు. విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు డ్రగ్స్ భూతంపై అవగాహన కల్పించారు. నార్కో టెర్రరిజంపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. డ్రగ్ ఫ్రీ హైదరాబాద్‎లో భాగంగా కమాండ్ కంట్రోల్ సెంటర్‎లో సెమినార్‎ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో.. ముఖ్య అతిథిగా విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరి బుర్ర వెంకటేశం, యాంటీ నార్కోటిక్ బ్యూరో డైరెక్టర్ సందీప్ శాండిల్య, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, విద్యాశాఖ అధికారులు, పోలీసు సిబ్బంది‌, పలు స్కూల్, కాలేజీల విద్యార్థులు పాల్గొన్నారు.

తెలంగాణ నార్కోటిక్ డైరెక్టర్ సందీప్ శాండిల్య మాట్లాడుతూ 21 ఏళ్ళలోపు వాళ్ళకు మద్యం అమ్మకూడదు.. కాని ఎవరు పట్టించుకుంటున్నారని యాంటీ నార్కోటిక్ బ్యూరో డైరెక్టర్ సందీప్ శాండిల్య మండిపడ్డారు. డ్రగ్స్ కేసుల్లో పట్టుబడుతున్న వారి సినిమాలు చూడకూడదని సూచించారు. అలాంటి సినిమాలాను ఎంకరేజ్ చేయొద్దని అన్నారు. పిల్లలకు డబ్బులు ఇచ్చి పేరెంట్స్ చెడగొడుతున్నారని తెలిపారు. సినీ నిర్మాతలు, డైరెక్టర్లు, మోడళ్లు, హోటల్ యజమానులు డ్రగ్స్‎కు అలవాటు పడుతున్నారు. అలాంటి వారి పరువు తీసే ట్రెండ్ సెట్ ఎందుకు చేయకూడదని సంచలన వ్యాఖ్యలు చేశారు.

మరోవైపు చదువుల్లోనే పిల్లలను మానసికంగా ఒత్తిళ్ళకు గురి చేస్తున్నారని, గ్రేడ్‎ల పరంగానే ప్రపంచం లేదు, ఈ విషయం గుర్తించుకోవాలన్నారు. పిల్లలు చెడిపోతున్నారంటే ఎవరిది బాధ్యత పేరెంట్స్‌దా? టీచర్స్ దా? పిల్లలదా? పోలీసులదా? అని ప్రశ్నించారు. పిల్లల మానసిక స్థితిని పేరెంట్స్, టీచర్స్ గుర్తించకపోతే ఎవరు గుర్తిస్తారని ప్రశ్నించారు. పిలల్లను ఒక మంచి మనిషిగా తీర్చిదిద్దాలని సూచించారు. ఇంట్లో పరిస్థితుల కారణంగానే టీనేజ్ వయస్సులోని వారు డ్రగ్స్‎కి బానిసలుగా మారుతున్నారని, ఇటీవల కాలంలో పిల్లలు తమ బాల్యాన్ని కోల్పోతున్నారని అన్నారు. ఈ విషయాన్ని ఎవరు గుర్తించడం లేదని, జీవితంలో అత్యున్నత స్థానంలో ఉన్న వారు సైతం డ్రగ్స్ బారిన పడుతున్నారని తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…

పారిస్ లో చిరంజీవి ఫ్యామిలీ.. స్పెషల్ అట్రాక్షన్‌గా క్లింకార..
పారిస్ లో చిరంజీవి ఫ్యామిలీ.. స్పెషల్ అట్రాక్షన్‌గా క్లింకార..
రంభ, ఊర్వశి, మేనకలను కలగలిపిన అనుపమ అందం.!
రంభ, ఊర్వశి, మేనకలను కలగలిపిన అనుపమ అందం.!
వరుణుడి ప్రతాపం.. ఈ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు..
వరుణుడి ప్రతాపం.. ఈ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు..
అతనితో కీర్తి సురేశ్ పెళ్లి.. ఫుల్ క్లారిటీ ఇచ్చేసిందిగా..
అతనితో కీర్తి సురేశ్ పెళ్లి.. ఫుల్ క్లారిటీ ఇచ్చేసిందిగా..
కాంటాక్ట్ లెన్స్‌ వల్ల నటి జాస్మిన్ భాసిన్‌కు తీవ్ర అనారోగ్యం..
కాంటాక్ట్ లెన్స్‌ వల్ల నటి జాస్మిన్ భాసిన్‌కు తీవ్ర అనారోగ్యం..
వికసిత్‌ భారత్‌ లక్ష్యం.. నీతి ఆయోగ్‌ సమావేశంలో ప్రధాని మోదీ
వికసిత్‌ భారత్‌ లక్ష్యం.. నీతి ఆయోగ్‌ సమావేశంలో ప్రధాని మోదీ
క్యూట్ నెస్ ఓవర్ లోడెడ్.. ఈ క్యూటీపై అందాలకి పడని హృదయం ఉంటుందా.!
క్యూట్ నెస్ ఓవర్ లోడెడ్.. ఈ క్యూటీపై అందాలకి పడని హృదయం ఉంటుందా.!
చిన్న పిల్లాడితో లిప్ కిస్‌లా? ఆ లేడీ యాంకర్ పై చిన్మయి ఆగ్రహం
చిన్న పిల్లాడితో లిప్ కిస్‌లా? ఆ లేడీ యాంకర్ పై చిన్మయి ఆగ్రహం
ఏయే వయసులవారికి ఎంతెంత నిద్ర అవసరమో తెలుసా?
ఏయే వయసులవారికి ఎంతెంత నిద్ర అవసరమో తెలుసా?
రెబల్ స్టార్ ప్రభాస్ సాధించాడు.. ఇక ఇప్పుడు ఈ హీరోల వంతు
రెబల్ స్టార్ ప్రభాస్ సాధించాడు.. ఇక ఇప్పుడు ఈ హీరోల వంతు