AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Governor Tamilisai: ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీపై తెలంగాణ గవర్నర్ ఆసక్తికర వ్యాఖ్యలు.. ఏమ్మన్నారంటే..?

పార్లమెంట్‌ ఎన్నికల బరిలోకి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ రెడీ అవుతున్నారంటే అవుననే చెప్పాలి. దేవుడు కరుణించి భారతీయ జనతా పార్టీ హైకమాండ్ అవకాశమిస్తే చూద్దామంటున్నారు తమిళిసై. అటు అధిష్ఠానం కూడా కన్యాకుమారి లోక్‌సభ స్థానంపై స్పెషల్ ఫోకస్ పెట్టింది.

Governor Tamilisai: ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీపై తెలంగాణ గవర్నర్ ఆసక్తికర వ్యాఖ్యలు.. ఏమ్మన్నారంటే..?
Governor Tamilisai Soundararajan
Ch Murali
| Edited By: Balaraju Goud|

Updated on: Mar 04, 2024 | 2:06 PM

Share

పార్లమెంట్‌ ఎన్నికల బరిలోకి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ రెడీ అవుతున్నారంటే అవుననే చెప్పాలి. దేవుడు కరుణించి భారతీయ జనతా పార్టీ హైకమాండ్ అవకాశమిస్తే చూద్దామంటున్నారు తమిళిసై. అటు అధిష్ఠానం కూడా కన్యాకుమారి లోక్‌సభ స్థానంపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. తమిళనాడులోని లోక్‌సభ స్థానాలలో బీజేపీకి మంచి పట్టు ఉన్న స్థానం కన్యాకుమారి. దీంతో అక్కడ నుంచి తమిళిసైని పోటీ చేయించాలని బీజేపీ కసరత్తు చేస్తోంది. కన్యాకుమారిలో నాడార్ సామజిక వర్గం అత్యధికంగా ఉన్నారు. దీంతో అదే సామాజిక వర్గానికి చెందిన తమిళిసైకి ఇవ్వాలని బీజేపీ ఆలోచన చేస్తోంది. నాడార్ సామజిక వర్గానికి చెందిన నటుడు విజయ్ వసంత్‌పై తమిళిసైని పోటీ ఉంచేలా బీజేపీ కసరత్తు మొదలు పెట్టింది..

తెలంగాణ గవర్నర్ తమిళిసై ఎన్నికల్లో పోటీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇక ఇదే విషయమై తమిళిసైను ప్రశ్నించగా..దేవుడు కరుణించి, అటు బీజేపీ హైకమాండ్ కూడా అవకాశమిస్తే చూద్దామన్నారు తమిళిసై..తాను సాధారణ కార్యకర్తనని, తనకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా పూర్తి చేస్తానన్నారు. అలాగే భవిష్యత్‌లో బీజేపీ హైకమాండ్ ఏ బాధ్యతలు అప్పగించినా చేస్తా అన్నారు తమిళిసై.

తమిళనాడు బిజెపి అధ్యక్షురాలిగా పనిచేసిన తమిళిసై సౌందర్యారాజన్ కి కేంద్రం గవర్నర్ గా అవకాశం కల్పించింది. 2019 సెప్టెంబర్ లో గవర్నర్ గా నియమిస్తూ రాష్ట్రపతి ఆదేశాలు జారీ చేశారు. ఆతర్వాత పుదుచ్చేరి ఇంచార్జ్ లెఫ్ట్నెంట్ గవర్నర్ గా కూడా అదనపు బాధ్యతలు చేపడుతున్నారు. తెలంగాణ గవర్నర్‌గా, అలాగే పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టాక తనదైన మార్క్ చూపించారు తమిళిసై. తమిళిసై తీసుకున్న అనేక నిర్ణయాలు సంచలనంగా మారాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం వర్సెస్ గవర్నర్ తమిళిసై అన్నట్లుగా మారింది. గవర్నర్ గా తమిళిసై సౌందర్యరాజన్ పదవీకాలం మరో నాలుగు నెలల్లో పూర్తి కానుంది. మరోసారి గవర్నర్ గా తమిళిసై ని కొనసాగిస్తారని చర్చ జరుగుతుండగా తాజాగా ఆమె ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. త్వరలో జరగనున్న లోక్ సభ ఎన్నికల్లో పోటీకి ఆసక్తిగా ఉన్నారన్న వ్యాఖ్యలు చేశారు తమిళిసై సౌందరాజన్.

నాడార్ సామజిక వర్గానికి చెందిన తమిళిసైకి ఇవ్వాలని బీజేపీ ఆలోచన ఉన్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. 2014 లో కన్యాకుమారి నుంచి గెలిచి కేంద్ర సహాయమంత్రిగా రాధాకృష్ణన్ పనిచేశారు. 2019లో డీఎంకే కూటమిలో కాంగ్రెస్ ఈ స్థానాన్ని గెలుచుకుంది. నాడార్ సామజిక వర్గానికి చెందిన నటుడు విజయ్ వసంత్ ఫై తమిళిసై ని పోటీ దింపాలని బీజేపీ కసరత్తు చేస్తుంది. ఇపుడు పోటీపై ఆమె చేసిన వ్యాఖ్యలతో తిరిగి రాజకీయ ప్రవేశంపై జరుగుతున్న ప్రచారానికి తెరపడినట్లు అయ్యింది. ఇంకా గవర్నర్ గా పదవీకాలం ఉన్నా ముందుగానే రాజీనామా చేయించి పోటీ చేయించే ఆలోచనలో బీజేపీ అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…