జైలు నుంచి బయటకు వచ్చాడు..మళ్లీ అదే పని చేస్తూ
మేడ్చల్ జిల్లా దుండిగల్ పి.యస్ పరిధిలో పెద్దమొత్తంలో గంజాయి పట్టుకున్నారు ఎస్‌ఓటీ పోలీసులు. గండిమైసమ్మ చౌరస్తాలో దుండిగల్ పోలీసులు ,మేడ్చల్ SOT పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఓ స్వీట్ బాక్స్‌లో అక్రమ రవాణా చేస్తున్న సుమారు లక్ష రూపాయల విలువ గల ఒక లీటరు హాషిష్ ఆయిల్ ను స్వాధీనం చేసుకున్నారు. 71 సంవత్సరాల వృద్దుడు రవాణా చేస్తున్నట్లు తెలిపారు. ఇతనిపై గతంలో కూడా కేసులు ఉన్నట్లు వెల్లడించారు.
మేడ్చల్ జిల్లా దుండిగల్ పి.యస్ పరిధిలో పెద్దమొత్తంలో గంజాయి పట్టుకున్నారు ఎస్‌ఓటీ పోలీసులు. గండిమైసమ్మ చౌరస్తాలో దుండిగల్ పోలీసులు ,మేడ్చల్ SOT పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఓ స్వీట్ బాక్స్‌లో అక్రమ రవాణా చేస్తున్న సుమారు లక్ష రూపాయల విలువ గల ఒక లీటరు హాషిష్ ఆయిల్ ను స్వాధీనం చేసుకున్నారు. 71 సంవత్సరాల వృద్దుడు రవాణా చేస్తున్నట్లు తెలిపారు. ఇతనిపై గతంలో కూడా కేసులు ఉన్నట్లు వెల్లడించారు. గంజాయి నూనె తరలిస్తున్న పాత నేరస్థుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసుల విచారణలో నిందితుడు కుర్రు శంకర్ రావు గా గుర్తించారు. నిందితుడు అనకాపల్లికి చెందిన వాడిగా తెలిపారు. దుండిగల్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని గండిమైసమ్మ ఆలయం వద్ద అనుమానంగా తిరుగుతుండగా మేడ్చల్ SOT టీమ్ అతనిని పట్టుకుని విచారించింది. ఎవరికీ అనుమానం రాకుండా కొత్త తరహలో నేరానికి పాల్పడినట్లు వెల్లడించారు పోలీసులు. స్వీట్ బాక్స్‌లో దాచిన రూ 1,00,000 విలువగల ఒక లీటర్ హశీష్ ఆయిల్ పట్టుకోవడం జరిగిందని వివరించారు. 2019లో నిందితుడు 744.2 కిలోల గంజాయితో రాజేంద్రనగర్ ఔటర్ రింగ్ రోడ్ దగ్గర NCB అధికారులకు పట్టుబడినట్లు, అతనిని అరెస్ట్ చేసినట్లు రికార్డుల్లో ఉందని పేర్కొన్నారు. 4 సంవత్సరాల 7 నెలలు జైలు జీవితం గడిపి గత అక్టోబర్‌లో విడుదలైన ఇతను మళ్లీ హాషీష్ ఆయిల్ స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడినట్లు తెలిపారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఈ లక్షణాలు మీలో ఉంటే.. మీ లివర్ డేంజర్‌లో ఉన్నట్టే
Srisailam: శ్రీశైలం వెళ్లాలనుకునే భక్తులకు గుడ్ న్యూస్
ప్లాస్టిక్ సీసాల్లో నీళ్లు తాగితే.. పిల్లలు పుట్టడం కష్టమే