ఒకప్పటి టాప్ విలన్ అజిత్.. జీవితం దుర్భరం.. కారణం వారే
సినిమా ఇండస్ట్రీలో ఉన్నవాళ్లు కోట్లు వెనకేస్తారనుకుంటారు. లగ్జరీ లైఫ్ అనుభవిస్తారని భ్రమిస్తుంటారు. కానీ అందరి జీవితాలు ఒకేలా ఉండవు. 60లు 70లలో టాప్ విలన్‌గా రాణించిన తన తండ్రి ఎంత దుర్భర జీవితం అనుభవించారో కళ్లకు కట్టినట్లు వివరించాడు దివంగత విలన్ అజిత్ తనయుడు షెహజాద్ ఖాన్. అతడు మాట్లాడుతూ.. సూపర్ హిట్ మూవీ నయా డౌర్ తర్వాత తన నాన్న కెరీర్ పతనం కావడం ప్రారంభమైందనీ నాలుగైదేళ్లపాటు అతడికి అవకాశాలు రాలేదనీ తెలిపాడు.
సినిమా ఇండస్ట్రీలో ఉన్నవాళ్లు కోట్లు వెనకేస్తారనుకుంటారు. లగ్జరీ లైఫ్ అనుభవిస్తారని భ్రమిస్తుంటారు. కానీ అందరి జీవితాలు ఒకేలా ఉండవు. 60లు 70లలో టాప్ విలన్‌గా రాణించిన తన తండ్రి ఎంత దుర్భర జీవితం అనుభవించారో కళ్లకు కట్టినట్లు వివరించాడు దివంగత విలన్ అజిత్ తనయుడు షెహజాద్ ఖాన్. అతడు మాట్లాడుతూ.. సూపర్ హిట్ మూవీ నయా డౌర్ తర్వాత తన నాన్న కెరీర్ పతనం కావడం ప్రారంభమైందనీ నాలుగైదేళ్లపాటు అతడికి అవకాశాలు రాలేదనీ తెలిపాడు. నయా దౌర్ చిత్రానికి అజిత్ సహాయక నటుడిగా ఫిలింఫేర్ అందుకున్నారు. తన తండ్రికి సినిమా అవకాశాలు రాకపోవడానికి కారణం.. హీరోలకున్న భయమే అన్నాడు షెహజాద్ ఖాన్. తన తండ్రి సినిమాలో ఉంటే ఎక్కడ వారిని డామినేట్ చేసేస్తాడో అని హీరోలు భయపడ్డారట. అజిత్‌తో పని చేస్తే అతనికే గుర్తింపు వస్తుంది, అతనికే అవార్డులిచ్చేస్తారు, తమ్మల్ని ఎవరూ పట్టించుకోరని ఫీలయ్యారనీ అలా తన తండ్రి ఎన్నో కష్టాలు చూశాడనీ అన్నాడు. ఓ రోజు ముంబైలో మొహమ్మద్ అలీ రోడ్డులో నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు అక్కడున్న మురికి కాలువను చూపిస్తూ కెరీర్ ప్రారంభంలో దీని పక్కనే పడుకున్నానని తండ్రి తనతో అన్నాడని చెప్పాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కాణిపాకం వినాయకుడికి 6 కేజీల బంగారు బిస్కెట్ల విరాళం
కుమారుడి పెళ్లికి వచ్చే అతిథులకు నీతా ఆంబానీ స్పెషల్ మెసేజ్
పేటీఎం బ్యాంకు కార్యకలాపాల నిలిపివేతకు డెడ్‌లైన్ మార్చి 15
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

