పేటీఎం బ్యాంకు కార్యకలాపాల నిలిపివేతకు డెడ్‌లైన్ మార్చి 15

ఆర్‌బీఐ ఆంక్షల డెడ్‌లైన్ సమీపిస్తున్న వేళ పేటీఎం మాతృసంస్థ వన్97కమ్యూనికేషన్స్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌తో అంతర్గతంగా కుదుర్చుకున్న ఒప్పందాలను రద్దు చేసుకునేందుకు నిర్ణయించినట్టు శుక్రవారం వెల్లడించింది. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ కార్యక్రమాలన్నిటినీ మార్చి 15 లోపు ముగించాలన్న ఆర్‌బీఐ డెడ్‌లైన్ మేరకు సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది. పేటీఎం పేమెంట్స్ బ్యాంకుపై ఆర్‌బీఐ ఆంక్షల కారణంగా పేటీఎం ఒక్కసారిగా ఇబ్బందుల్లో పడింది.

పేటీఎం బ్యాంకు కార్యకలాపాల నిలిపివేతకు డెడ్‌లైన్ మార్చి 15

|

Updated on: Mar 03, 2024 | 4:06 PM

ఆర్‌బీఐ ఆంక్షల డెడ్‌లైన్ సమీపిస్తున్న వేళ పేటీఎం మాతృసంస్థ వన్97కమ్యూనికేషన్స్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌తో అంతర్గతంగా కుదుర్చుకున్న ఒప్పందాలను రద్దు చేసుకునేందుకు నిర్ణయించినట్టు శుక్రవారం వెల్లడించింది. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ కార్యక్రమాలన్నిటినీ మార్చి 15 లోపు ముగించాలన్న ఆర్‌బీఐ డెడ్‌లైన్ మేరకు సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది. పేటీఎం పేమెంట్స్ బ్యాంకుపై ఆర్‌బీఐ ఆంక్షల కారణంగా పేటీఎం ఒక్కసారిగా ఇబ్బందుల్లో పడింది. పర్యవేక్షణ లోపాలు, నిబంధనల అతిక్రమణ వంటి కారణాలతో ఆర్‌బీఐ..పేటీఎం పేమెంట్స్ బ్యాంకు కార్యకలాపాలను శాశ్వతంగా ముగించేయాలని ఆదేశించింది. ఇందుకు సంబంధించి ముందు ఫిబ్రవరి 29ని డెడ్‌లైన్‌గా విధించిన ఆర్‌బీఐ ఆ తరువాత కస్టమర్ల సౌకర్యార్థం తుది తేదీని మార్చి 15 వరకూ పొడిగించింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

1990తో పోల్చితే నాలుగు రెట్లు పెరిగిన ఊబకాయం !!

పెళ్లిరోజునే భార్యను కడతేర్చిన భర్త.. ఏం జరిగిందంటే ??

మూడు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన వాచ్‌మెన్‌

మీ పిల్లలకు జ్వరం వస్తే అశ్రద్ధ చేయకండి.. అది స్కార్లెట్‌ జ్వరం కావచ్చు

అర్హులైన అందరికీ 200 యూనిట్లవరకూ విద్యుత్‌ ఫ్రీ

Follow us