రూ.50 కోట్ల లగ్జరీ కార్లు.. లెక్కకు మించిన ఆస్తులు

పన్ను ఎగవేత ఆరోపణలతో పొగాకు కంపెనీ బంశీధర్‌ గ్రూప్‌పై ఆదాయపు పన్ను విభాగం చేపట్టిన దాడుల్లో కళ్లు చెదిరే విషయాలు వెలుగులోకి వచ్చాయి. గ్రూపు ఆదాయంలో తప్పుడు లెక్కలను గుర్తించారు. ఢిల్లీ, ఉత్తర్‌ప్రదేశ్‌, గుజరాత్‌తో సహా పలు రాష్ట్రాల్లోని 20 ప్రాంతాల్లో ఈ సోదాలు జరిగాయి. ఆ గ్రూప్‌ వారసుడు శివమ్ మిశ్రా ఇల్లును అధికారులు తనిఖీ చేసారు. ఆయన నివాసం ఢిల్లీలోని వసంత్ విహార్‌లో ఉంది. మిశ్రా ఇంట్లో 50 కోట్ల రూపాయల విలువైన లంబోర్గిని, మెక్‌లారెన్‌, రోల్స్‌ రాయిస్‌ ఫాంటమ్‌, పోర్షా వంటి లగ్జరీ కార్లను గుర్తించారు.

రూ.50 కోట్ల లగ్జరీ కార్లు.. లెక్కకు మించిన ఆస్తులు

|

Updated on: Mar 04, 2024 | 4:13 PM

పన్ను ఎగవేత ఆరోపణలతో పొగాకు కంపెనీ బంశీధర్‌ గ్రూప్‌పై ఆదాయపు పన్ను విభాగం చేపట్టిన దాడుల్లో కళ్లు చెదిరే విషయాలు వెలుగులోకి వచ్చాయి. గ్రూపు ఆదాయంలో తప్పుడు లెక్కలను గుర్తించారు. ఢిల్లీ, ఉత్తర్‌ప్రదేశ్‌, గుజరాత్‌తో సహా పలు రాష్ట్రాల్లోని 20 ప్రాంతాల్లో ఈ సోదాలు జరిగాయి. ఆ గ్రూప్‌ వారసుడు శివమ్ మిశ్రా ఇల్లును అధికారులు తనిఖీ చేసారు. ఆయన నివాసం ఢిల్లీలోని వసంత్ విహార్‌లో ఉంది. మిశ్రా ఇంట్లో 50 కోట్ల రూపాయల విలువైన లంబోర్గిని, మెక్‌లారెన్‌, రోల్స్‌ రాయిస్‌ ఫాంటమ్‌, పోర్షా వంటి లగ్జరీ కార్లను గుర్తించారు. రూ.4.5 కోట్ల నగదు, ఇతర డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారని జాతీయ మీడియా కథనాలు తెలిపాయి. ఈ కుంభకోణం వెనక అసలు నిందితుడు ఆ గ్రూప్‌ అధినేత కేకే మిశ్రా అని ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. ఆ సంస్థ రూ.20 నుంచి రూ.25 కోట్ల టర్నోవర్‌ను ప్రకటించగా.. వాస్తవంగా ఆ మొత్తం రూ.100 నుంచి రూ.150 కోట్లమేర ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

జైలు నుంచి బయటకు వచ్చాడు..మళ్లీ అదే పని చేస్తూ

Follow us