Viral Video: పట్టపగలు జనావాసాల్లోకి భల్లూకం.. పరుగులు పెట్టిన జనం.. ఎక్కడంటే..?
పట్టపగలు ప్రధాన రహదారిపై ఎలుగుబంటి హల్ చల్ చేసింది. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం గడూరు గ్రామంలో చోటుచేసుకుంది. ఆదివారం ఉదయం గడూరు గ్రామం వద్ద అకస్మాత్తుగా ప్రధాన రహదారిపై ఎలుగుబంటిని చూసి వాహనదారులు హడలెత్తిపోయారు. అటుగా వస్తున్న వాహణదారుడిపై ఎలుగుబంటి దాడికి పాల్పడ్డానికి ప్రయత్నించడంతో.. వాహనదారుడు బ్రతుకుజీవుడా అంటూ పరుగులు తీశాడు. ఇదంతా రహదారికి వేరొకవైపున ఉన్న అంబులెన్స్ డ్రైవర్ తన మొబైల్ ఫోన్‌లో చిత్రీకరించాడు.

ఇటీవల ఇదే గ్రామంలో ఒక మహిళపై ఎలుగుబంటి దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. ఈ క్రమంలోనే తాజాగా ఎలుగుబంటిని పట్టపగలు రోడ్డుపై చూసి బెంబేలెత్తిపోయారు గ్రామస్తులు. ఉద్దాన ప్రాంతంలో గతంలో అనేకసార్లు ఎలుగుబంట్లు రోడ్లపైన తిరుగుతూ దాడులకు పాల్పటం, పలువురి ప్రాణాలను హరించటం వంటి ఘటనలు చాలానే ఉన్నాయి. గతంలో 108 అంబులెన్స్‌ను అడ్డగించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. దీంతో అటవీ శాఖ అధికారులు ఎలుగు బంట్లను అటవీ ప్రాంతాలకు వెళ్ళగొట్టేందుకు ప్రయత్నించారు. తాజాగా మరోసారి ఎలుగుబంటి కనిపించడంతో సమీప గ్రామాల ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు.
ఏదిఏమైనా రాత్రి పగలు తేడా లేకుండా ఎలుగుబంట్లు విచ్చలవిడిగా జనావాసాల మధ్య స్వైరవిహారం చేస్తుండడంతో ఎప్పుడు ఎక్కడ ఎవరిపై ఎలుగుబంట్లు దాడి చేస్తాయోనని ప్రజలు హడలిపోతున్నారు. ఆరుబయట ఒంటరిగా సంచరించలన్నా వణికిపోతున్నారు. ఆటవీశాఖ అధికారులు స్పందించి ఎలుగుబంట్లు నుండి రక్షణ కల్పించాలని ఉద్దాణ ప్రాంత ప్రజలు కోరుతున్నారు. అసలే మామిడి, జీడీ మామిడి చెట్లు పూత పూసే కాలం కావటంతో ఎలుగుబంట్లు సంచారంతో వ్యవసాయ పనుల నిమిత్తం తోటలలోకి ఒంటరిగా వెళ్లాలన్న భయమేస్తుందని గ్రామస్తులు అవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో చూడండి..
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…