AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

శ్రీకాకుళం సముద్ర తీరంలో అతి పెద్ద బ్లూ వేల్.. సెల్ఫీల కోసం ఎగబడిన జనాలు.. బరువెంతో తెలిస్తే షాక్‌ అవ్వాల్సిందే…!

ఈ జిల్లా 193 కి.మీ. బంగాళాఖాతం తీరం వెంబడి విస్తరించి ఉంది. అందుకే ఈ తీర ప్రాంతంలో ఎన్నో వింతలు జరుగుతూనే ఉన్నాయి. అరుదైన సముద్ర జీవులు కనిపిస్తూనే ఉన్నాయి. అరుదైన భారీ చేప కావడంతో డొంకూరు పరిసర గ్రామస్తులు ఈ వింత చేపను చూసేందుకు భారీగా తరలివచ్చారు. అంత పెద్ద చేపను చూసి కొందరు ఫోటోలు తీయగా, మరికొందరు దాంతో సెల్ఫీలు కూడా దిగారు. విషయం తెలుసుకున్న పలాస కాశీబుగ్గ అటవీశాఖ అధికారి

శ్రీకాకుళం సముద్ర తీరంలో అతి పెద్ద బ్లూ వేల్.. సెల్ఫీల కోసం ఎగబడిన జనాలు.. బరువెంతో తెలిస్తే షాక్‌ అవ్వాల్సిందే...!
Rare Blue Whale
Jyothi Gadda
|

Updated on: Mar 04, 2024 | 7:16 AM

Share

సాగర తీరంలో ఎన్నో వింతలు జరుగుతూనే ఉన్నాయి. అంతే కాకుండా పొడవైన సముద్ర తీరం ఉంది కాబట్టి తరచూ అరుదైన సముద్ర జీవులు కనిపిస్తూ ప్రజల్ని ఆశ్చర్యానికి గురిచేస్తుంటాయి. ఈ క్రమంలో శ్రీకాకుళ్లం జిల్లా ఇచ్ఛాపుర మండలం డొంకూరు తీరానికి అరుదైన భారీ చచ్చిపోయిన చేప కొట్టుకుపోయింది. ఈ చేప దాదాపు 16 అడుగుల పొడవు, దాదాపు 6 అడుగుల వెడల్పు ఉండటం చూసి అంతా ఆశ్చర్యపోయారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అతి పొడవైన తీర రేఖ కలిగిన జిల్లా శ్రీకాకుళం. ఈ జిల్లా 193 కి.మీ. బంగాళాఖాతం తీరం వెంబడి విస్తరించి ఉంది. అందుకే ఈ తీర ప్రాంతంలో ఎన్నో వింతలు జరుగుతూనే ఉన్నాయి. అరుదైన సముద్ర జీవులు కనిపిస్తూనే ఉన్నాయి.

అరుదైన ఈ చేప బరువు రెండు టన్నులు ఉంటుందని స్థానిక మత్స్యకారులు అంచనా వేశారు. ఇంత భారీ చేప ఎలా కొట్టుకువచ్చిందనే దానిపై సరైన సమాచారం లేదు. అయితే కొందరు ఆహారం అందక మరణించి ఉండవచ్చని, మరికొందరు సముద్రంలో భారీ పడవలు వెళుతుండగా గాయపడి చనిపోయి ఉంటుందని భావిస్తున్నారు. ఈ చేపను స్థానికులు పులి బగ్గు పొర్ర చేపగా చెప్పారు.

అరుదైన భారీ చేప కావడంతో డొంకూరు పరిసర గ్రామస్తులు ఈ వింత చేపను చూసేందుకు భారీగా తరలివచ్చారు. అంత పెద్ద చేపను చూసి కొందరు ఫోటోలు తీయగా, మరికొందరు దాంతో సెల్ఫీలు కూడా దిగారు. విషయం తెలుసుకున్న పలాస కాశీబుగ్గ అటవీశాఖ అధికారి మురళీనాయుడు అక్కడికి చేరుకుని చనిపోయిన చేపను పరిశీలించి, పోస్టుమార్టం నిర్వహించి సముద్ర తీరంలో పూడ్చిపెట్టారు. కాకపోతే, మూడు రోజుల క్రితం జరిగిన ఈ సంఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
అభిషేక్ కు ఇచ్చిపడేసిన టీ20 వరల్డ్ కప్ హీరో.. నెంబర్ 1 స్థానంతో..
అభిషేక్ కు ఇచ్చిపడేసిన టీ20 వరల్డ్ కప్ హీరో.. నెంబర్ 1 స్థానంతో..
బడికి వెళ్లే పిల్లలకు బెస్ట్.. లంచ్ బాక్స్‌లోకి రైస్ ఇలా పెట్టండి
బడికి వెళ్లే పిల్లలకు బెస్ట్.. లంచ్ బాక్స్‌లోకి రైస్ ఇలా పెట్టండి
వైభవ్ సూర్యవంశీ గురించి ఇంగ్లాండ్ కెప్టెన్ సంచలన స్టేట్మెంట్..
వైభవ్ సూర్యవంశీ గురించి ఇంగ్లాండ్ కెప్టెన్ సంచలన స్టేట్మెంట్..
పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అప్డేట్.. వెబ్ సైట్ తెరుచుకునేది అప్పుడే..
పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అప్డేట్.. వెబ్ సైట్ తెరుచుకునేది అప్పుడే..
గుడ్‌న్యూస్..దేశంలో మరో 2 కొత్త హైవేల నిర్మాణానికి కేబినెట్ ఆమోదం
గుడ్‌న్యూస్..దేశంలో మరో 2 కొత్త హైవేల నిర్మాణానికి కేబినెట్ ఆమోదం
వైభవ్ కాదయ్యా.. టీమిండియాలో అతడంటేనే ఇంగ్లాండోళ్లకు భయం
వైభవ్ కాదయ్యా.. టీమిండియాలో అతడంటేనే ఇంగ్లాండోళ్లకు భయం
నిద్రలో కలవరం, భయమా.. చెడు కలలకు కారణం తెలుసా?
నిద్రలో కలవరం, భయమా.. చెడు కలలకు కారణం తెలుసా?
NEET UG 2026 అభ్యర్థులకు కీలకఅప్డేట్.. జూలై 7 వరకు మాత్రమే ఛాన్స్
NEET UG 2026 అభ్యర్థులకు కీలకఅప్డేట్.. జూలై 7 వరకు మాత్రమే ఛాన్స్
రేపే క్యాబినెట్ భేటీ.. చరిత్ర సృష్టించనున్న సీఎం రేవంత్ రెడ్డి!
రేపే క్యాబినెట్ భేటీ.. చరిత్ర సృష్టించనున్న సీఎం రేవంత్ రెడ్డి!
కేతన్ అగర్వాల్ మర్డర్ కేసులో కొత్త ట్విస్ట్.. సియా సోదరుడిపై
కేతన్ అగర్వాల్ మర్డర్ కేసులో కొత్త ట్విస్ట్.. సియా సోదరుడిపై