AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఓరీ దేవుడో ఇలా కూడా అవుతుంది.. వాహనం వెళ్తుండగా రోడ్డుపై భారీ గుంత.. కారు ఎలా వేలాడుతుందో చూడండి..!

ఈ ఘటన జరిగినప్పుడు రోడ్డుపై వాహనాలు వెళ్తున్నాయి. ఇంతలో రోడ్డు కుప్పకూలింది. రోడ్డుపై ప్రయాణిస్తున్న కారు ముందు భాగం దాటిపోయింది.. కానీ వెనుక టైర్లు బిలంలోకి పడబోయి ఆగిపోయాయి.. అనంతరం పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది కలిసి కారును అక్కడి నుంచి తొలగించారు.

ఓరీ దేవుడో ఇలా కూడా అవుతుంది.. వాహనం వెళ్తుండగా రోడ్డుపై భారీ గుంత.. కారు ఎలా వేలాడుతుందో చూడండి..!
Road Collapsed
Jyothi Gadda
|

Updated on: Mar 03, 2024 | 9:20 PM

Share

ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో రోడ్డు కుప్పకూలింది. రోడ్డుపై పెద్ద పగుళ్లు ఏర్పడి భారీ బిలం ఏర్పడింది. ఈ ఘటన లక్నోలోని వికాస్‌నగర్‌లో చోటుచేసుకుంది. ఉన్నట్టుండి రోడ్డు మధ్యలో 30 అడుగుల వెడల్పు, 20 అడుగుల లోతున పెద్ద గొయ్యి ఏర్పడింది. దీంతో పాటు రోడ్డుపై పెద్ద పగుళ్లు కూడా ఏర్పడ్డాయి. పెద్ద గొయ్యిలో పడకుండా కారులో ఉన్నవారు తృటిలో సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటన జరిగినప్పుడు రోడ్డుపై వాహనాలు వెళ్తున్నాయి. ఇంతలో రోడ్డు కుప్పకూలింది. రోడ్డుపై ప్రయాణిస్తున్న కారు ముందు భాగం దాటిపోయింది.. కానీ వెనుక టైర్లు బిలంలోకి పడబోయి ఆగిపోయాయి.. అనంతరం పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది కలిసి కారును అక్కడి నుంచి తొలగించారు.

రద్దీగా ఉండే రోడ్డుపై ఈ ఘటన చోటుచేసుకుంది. రోడ్డు మరింత కూలిపోయే అవకాశం కూడా ఉంది. పోలీసులు వచ్చి బారికేడ్‌తో రహదారిని మూసివేశారు. ఈరోజు లక్నోలో భారీ వర్షం కురిసింది. ఈ ఘటనపై విచారణ జరుపుతామని ఉత్తరప్రదేశ్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ ప్రకటించింది. గత మూడేళ్లలో లక్నోలో రోడ్డు కూలడం ఇది మూడోసారి.

పీడబ్ల్యూడీ అధికారులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. సంఘటనపై తక్షణమే అవగాహన తీసుకొని, పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ ఇన్‌ఛార్జ్ ఇంజనీర్లు సంఘటనా స్థలానికి చేరుకుని, ఆన్-సైట్ తనిఖీలు నిర్వహించారు. ఆన్-సైట్ తనిఖీలో జల్ నిగమ్ ట్రంక్ సీవర్ లైన్ నుండి నిరంతర నీటి లీకేజీ కారణంగానే రోడ్డు కుంగిపోయినట్టుగా గుర్తించారు. ఈ దెబ్బతిన్న భాగాన్ని తక్షణ మరమ్మతు కోసం జల్ నిగమ్ ఎగ్జిక్యూటింగ్ ఏజెన్సీకి అప్పగించారు. మొత్తానికి ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి హాని కలుగకపోవటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..