Babu Mohan: ఇదేంట్రా బాబు.. బుర్ర పాడు.. ప్రజా శాంతి పార్టీలో చేరిన బాబు మోహన్

గతేడాది చివర్లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఆందోల్ నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున పోటీచేసి బాబు మోహన్ ఓడిపోయారు. ఇటీవల కాలంలో ఆ పార్టీకి రిజైన్ చేశారు. ఏ పార్టీలో చేరేది త్వరలోనే తన నిర్ణయం వెలువరిస్తానని పేర్కొన్న బాబు మోహన్.. తాజాగా ప్రజాశాంతి పార్టీ కండువా కప్పుకున్నారు.

Babu Mohan: ఇదేంట్రా బాబు.. బుర్ర పాడు.. ప్రజా శాంతి పార్టీలో చేరిన బాబు మోహన్

|

Updated on: Mar 04, 2024 | 3:52 PM

టాలీవుడ్ యాక్టర్, మాజీ మంత్రి బాబు మోహన్ ప్రజాశాంతి పార్టీలో చేరారు. ఆయనకు కండువా కప్పి కేఏ పాల్ పార్టీలోకి ఆహ్వానించారు. గత ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా ఆందోల్‌ నుంచి బరిలోకి దిగారు బాబూమోహన్. అయితే ఆయన కేవలం 5,524 ఓట్లు సాధించి మూడో స్థానంలో నిలిచారు. అక్కడ కాంగ్రెస్ అభ్యర్థి..దామోదర రాజ నర్సింహ విజయం సాధించారు. గత ఎన్నికల సమయంలో బాబూ మోహన్ బీజేపీ అభ్యర్థిగా ఉన్నప్పటికీ.. ఆయన తనయుడు ఉదయ్ భాస్కర్ అదే సమయంలో బీఆర్‌ఎస్ కండువా కప్పుకుని.. కారు గుర్తుకు ఓటెయ్యాలని ప్రచారం చేయడం గమనార్హం.

ఇక ఇటీవల కాలంలో బీజేపీపై తీవ్ర విమర్శలు చేస్తోన్న బాబు మోహన్.. ఆ పార్టీకి ఫిబ్రవరి 7 న గుడ్ బై చెప్పారు. వరంగల్ లోక్‌సభ సీటు ఇవ్వమని తేల్చి చెప్పడంతో.. ఆయన కమలం పార్టీని వీడారని ప్రచారం జరిగింది. కాగా బీజేపీని వీడిన సమయంలో ఏ పార్టీలో చేరేది త్వరలో చెబుతానన్నారు. కానీ ఊహించని రీతిలో ఆయన ప్రజాశాంతి పార్టీలో చేరడం పలువురిని విస్మయానికి గురిచేసింది. కాగా బాబు మోహన్.. ప్రజా శాంతి పార్టీ తరఫున వరంగల్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయనున్నట్లు సమాచారం.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…  

Follow us