Kodali Nani: ఏపీ ఎన్నికలపై ప్రశాంత్ కిషోర్ జ్యోతిష్యం నెరవేరదు.. కొడాలి నాని ఆసక్తికర వ్యాఖ్యలు
ఏపీలో రానున్న ఎన్నికల్లో టీడీపీ గెలుస్తుందంటూ ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యలకు వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని కౌంటర్ ఇచ్చారు. ప్రశాంత్ కిషోర్‌ను ఐ ప్యాక్ టీమ్ నుండి తన్ని తరిమేశారని అన్నారు. ఐ ప్యాక్ టీమ్ ఇప్పటికీ వైసీపీ కోసం సర్వే చేస్తున్నారని చెప్పారు. రాజకీయ పార్టీ దగ్గర డబ్బులు తీసుకొని పీకే పనిచేస్తాడని అన్నారు.
ఏపీలో రానున్న ఎన్నికల్లో టీడీపీ గెలుస్తుందంటూ ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యలకు వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని కౌంటర్ ఇచ్చారు. ప్రశాంత్ కిషోర్‌ను ఐ ప్యాక్ టీమ్ నుండి తన్ని తరిమేశారని అన్నారు. ఐ ప్యాక్ టీమ్ ఇప్పటికీ వైసీపీ కోసం సర్వే చేస్తున్నారని చెప్పారు. రాజకీయ పార్టీ దగ్గర డబ్బులు తీసుకొని పీకే పనిచేస్తాడని అన్నారు. చంద్రబాబు దగ్గర ప్యాకేజీ తీసుకొని జ్యోతిష్యం చెబుతాడంటూ ఎద్దేవా చేశారు. ప్రశాంత్ కిషోర్ చెబితే రాష్ట్రంలో ఓటు శాతం మారుతుందని చంద్రబాబు ఆశపడుతున్నారని విమర్శించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పీకే చెప్పినట్లు జరగలేదన్న కొడాలి నాని.. ఏపీలోనూ ఆయన జోస్యం నెరవేరదన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తంచేశారు.
పవన్ కల్యాణ్‌ను టీడీపీ వాళ్లే ఓడిస్తారని కొడాలి నాని అన్నారు. తెలుగు దేశం పార్టీ వాళ్లు పవన్ కళ్యాణ్ కి ఓటు వేస్తారా? అని ప్రశ్నించారు. రాష్ట్ర అప్పులపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ.. తాకట్టు పెట్టకుండా బ్యాంకులు అప్పులు ఎలా ఇస్తాయని ప్రశ్నించారు. నేడు రాష్ట్ర అప్పులు రూ.4 లక్షల కోట్లు ఉంటే.. రూ. 2.50 లక్షల కోట్లు చంద్రబాబు చేసినవే అన్నారు. ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టకుండానే…. చంద్రబాబు రెండున్నర లక్షల కోట్లు అప్పు చేశారా? అని ప్రశ్నించారు.