ఈ లక్షణాలు మీలో ఉంటే.. మీ లివర్ డేంజర్‌లో ఉన్నట్టే
మద్యం తాగడం వల్ల డిటాక్సిఫికేషన్, మెటబాలిజం, ఊబకాయం వంటి సమస్యలు వస్తాయని చాలామంది అనుకుంటారు. కానీ మద్యం తాగకపోయినా ఈ సమస్యలన్నీ వస్తాయని మీకు తెలుసా? లివర్ ఆరోగ్యంగా లేకపోతే శరీరం ఆరోగ్యంగా ఉండదు. కాలేయంలో వ్యాధి వేళ్ళూనుకున్నప్పుడు కొన్ని ప్రారంభ లక్షణాలు కనిపిస్తాయి. చాలామంది మొదట వాటిని పట్టించుకోరు. ఫలితంగా అది ప్రాణాంతకంగా మారుతుంది.
మద్యం తాగడం వల్ల డిటాక్సిఫికేషన్, మెటబాలిజం, ఊబకాయం వంటి సమస్యలు వస్తాయని చాలామంది అనుకుంటారు. కానీ మద్యం తాగకపోయినా ఈ సమస్యలన్నీ వస్తాయని మీకు తెలుసా? లివర్ ఆరోగ్యంగా లేకపోతే శరీరం ఆరోగ్యంగా ఉండదు. కాలేయంలో వ్యాధి వేళ్ళూనుకున్నప్పుడు కొన్ని ప్రారంభ లక్షణాలు కనిపిస్తాయి. చాలామంది మొదట వాటిని పట్టించుకోరు. ఫలితంగా అది ప్రాణాంతకంగా మారుతుంది. అవుతుంది. ఆ లక్షణాలేంటో తెలుసుకుందాం. నిరంతర అలసట, బలహీనత కాలేయ వ్యాధి ప్రారంభ లక్షణాలు. ఆహారాన్ని జీర్ణం చేయడంలో కాలేయం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. జీర్ణక్రియ సరిగ్గా లేకుంటే అలసట, బలహీనంగా ఉంటారు. విశ్రాంతి తీసుకోవడం వల్ల కూడా సమస్య పరిష్కారం కాకపోతే వైద్య సలహా తీసుకోవాలి. కడుపు నొప్పి లేదా అసౌకర్యంగా అనిపించడం కాలేయ సమస్యల వల్ల సంభవించవచ్చు. ప్రత్యేకించి పొత్తికడుపు కుడివైపు పైభాగంలో నొప్పి ఉన్నట్లయితే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. కడుపు నొప్పితో పాటు, కళ్ళు, చర్మం, మూత్రం పసుపురంగులో కనిపించినా.. వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Srisailam: శ్రీశైలం వెళ్లాలనుకునే భక్తులకు గుడ్ న్యూస్
ప్లాస్టిక్ సీసాల్లో నీళ్లు తాగితే.. పిల్లలు పుట్టడం కష్టమే
అత్యంత అరుదైన వాకింగ్ ఫిష్.. చిలీ సముద్ర జలాల్లో