కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఘర్షణ వాతావరణం మంచిది కాదు.. అభివృద్ధికి ఆటంకమే: రేవంత్‌

ఆదిలాబాద్‌లో పలు అభివృద్ధి పనుల శంకుస్థాపనకు విచ్చేసిన ప్రధాని నరేంద్ర మోదీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి, ప్రాజెక్టులను జాతికి అంకితం చేసేందుకు ఇక్కడికి వచ్చిన ప్రధాని మోదీకి అఖండ స్వాగతం పలుకుతున్నాన్నారు

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఘర్షణ వాతావరణం మంచిది కాదు.. అభివృద్ధికి ఆటంకమే: రేవంత్‌
Cm Revan Reddy In Adilabad
Follow us

|

Updated on: Mar 04, 2024 | 1:18 PM

తెలంగాణ అభివృద్ధికి గత పదేళ్లుగా కేంద్రం సహకరిస్తోందన్నారు..ప్రధాని మోదీ. ఆదిలాబాద్‌ జిల్లా పర్యటనలో భాగంగా.. 6 వేల 697 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు..ప్రధాని మోదీ. NTPC ప్రాజెక్ట్‌ సెకండ్‌ ఫేజ్‌ విద్యుత్‌ప్లాంట్‌ జాతికి అంకితం చేశారు. అలాగే ఆరు ప్రాజెక్టులకు వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు ప్రధాని. అండర్‌ డ్రైనేజ్ కాలువ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఆదిలాబాద్‌-బేల-మహారాష్ట్ర రోడ్డు విస్తరణ పనులకు కూడా సభలో భూమిపూజ చేశారు ప్రధాని మోదీ. ప్రధాని సభలో సీఎం రేవంత్‌రెడ్డితో పాటు గవర్నర్ తమిళసై, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పాల్గొన్నారు.

ఆదిలాబాద్‌లో పలు అభివృద్ధి పనుల శంకుస్థాపనకు విచ్చేసిన ప్రధాని నరేంద్ర మోదీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి, ప్రాజెక్టులను జాతికి అంకితం చేసేందుకు ఇక్కడికి వచ్చిన ప్రధాని మోదీకి అఖండ స్వాగతం పలుకుతున్నాన్నారు. విభజన హామీ మేరకు NTPC 4వేల మెగావాట్లు ఉత్పత్తి చేయాల్సి ఉంటే.. గత ప్రభుత్వం ధోరణితో కేవలం 1,600 మెగావాట్లు మాత్రమే ఉత్పత్తి జరుగుతోందన్నారు.

రాష్ట్ర అభివృద్ధికి సహకరిస్తున్న ప్రధాని మోదీకి సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఎన్‌టీపీసీకి కాంగ్రెస్‌ ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుందని స్పష్టం చేశారు సీఎం రేవంత్. కేంద్రంతో రాష్ట్ర ప్రభుత్వాలు ఘర్షణ వైఖరి ఉంటే రాష్ట్రాభివృద్ధికి కుంటుపడుతుందన్నారు రేవంత్ రెడ్డి. రాజకీయాలు కేవలం ఎన్నికల సమయంలోనే చేయాలని అన్నారు. అలాగే హైదరాబాద్ ట్రాఫిక్ కష్టాలను దృష్టిలో పెట్టుకుని సికింద్రాబాద్ కంటోన్మెంట్‌ స్థలాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి బదిలీ చేసినందుకు ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు రేవంత్ రెడ్డి.

రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రంతో కలిసి ముందుకు వెళ్తామని స్పష్టం చేశారు. ‘దేశం 5 ట్రిలియన్‌ ఆర్థికవ్యవస్థ చేరడంలో హైదరాబాద్‌ కీలకపాత్ర పోషిస్తుంది. దేశవ్యాప్తంగా మెట్రో నగరాల అభివృద్ధిలో భాగంగా భాగ్యనగరానికి కూడా పెద్ద ఎత్తున నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. మూసీ రివర్‌ అభివృద్ధికి కేంద్రం సహకరించాలి. రాష్ట్రాభివృద్ధికి పెద్దన్నలా ప్రధాని మోదీ సహకరించాలి.’ అని సీఎం రేవంత్‌రెడ్డి కోరారు. అలాగే టెక్స్‌టైల్ రంగంలోనూ భారీగా నిధులు కేటాయించినందుకు కేంద్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు.

తెలంగాణ రాష్ట్రాభివృద్ధి ప్రధాని మోదీ పెద్దన్నలా సహకరించాలని కోరారు.. సీఎం రేవంత్‌రెడ్డి. ఆదిలాబాద్‌ జిల్లాకు సాగునీటిని అందించేందుకు తుమ్మిడిహట్టి దగ్గర ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్రం సహకరించాలని కోరారు.. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి. ఈ మేరకు మహారాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి ఒప్పించాలని విజ్ఞప్తి చేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి… 

Latest Articles
కేన్స్‌లో ఐశ్వర్య మెరుపులు.. ఈసారి చమ్కీలా డ్రెస్‌లో.. ఫొటోస్
కేన్స్‌లో ఐశ్వర్య మెరుపులు.. ఈసారి చమ్కీలా డ్రెస్‌లో.. ఫొటోస్
బుజ్జిని పరిచయం చేసిన భైరవ..ప్రభాస్ లైఫ్‌లో చాలా స్పెషల్..ఎవరంటే?
బుజ్జిని పరిచయం చేసిన భైరవ..ప్రభాస్ లైఫ్‌లో చాలా స్పెషల్..ఎవరంటే?
దంచికొట్టిన బెంగళూరు బ్యాటర్లు.. చెన్నై టార్గెట్ ఎంతంటే?
దంచికొట్టిన బెంగళూరు బ్యాటర్లు.. చెన్నై టార్గెట్ ఎంతంటే?
47 పరుగులకే కింగ్ కోహ్లీ ఔట్.. కానీ ఖాతాలో క్రేజీ రికార్డ్
47 పరుగులకే కింగ్ కోహ్లీ ఔట్.. కానీ ఖాతాలో క్రేజీ రికార్డ్
ఎన్నికలను ఒంటిచేత్తో నడిపించిన మహిళా అధికారులు-పనితీరుపై ప్రశంసలు
ఎన్నికలను ఒంటిచేత్తో నడిపించిన మహిళా అధికారులు-పనితీరుపై ప్రశంసలు
కీర్తీ సురేష్‌కి బాలీవుడ్‌లో హెల్ప్ చేస్తున్నదెవరు.?
కీర్తీ సురేష్‌కి బాలీవుడ్‌లో హెల్ప్ చేస్తున్నదెవరు.?
బొత్స అడ్డాలో హవా ఎవరెవది..?జోరుగా బెట్టింగ్స్
బొత్స అడ్డాలో హవా ఎవరెవది..?జోరుగా బెట్టింగ్స్
ఓటీటీలోకి పృథ్వీరాజ్ 'ఆడు జీవితం' .. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఓటీటీలోకి పృథ్వీరాజ్ 'ఆడు జీవితం' .. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
స్నేహం.. ప్రేమ.. ఆపై సహజీవనం.. చివరికి మరణం
స్నేహం.. ప్రేమ.. ఆపై సహజీవనం.. చివరికి మరణం
హైదరాబాద్‌లో కుండపోత వాన.. నగరమంతా ట్రాఫిక్‌ జామ్‌!
హైదరాబాద్‌లో కుండపోత వాన.. నగరమంతా ట్రాఫిక్‌ జామ్‌!