AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Modi: తెలంగాణ అభివృద్ధికి కేంద్రం సహకరిస్తుంది.. ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు..

గత పదేళ్లలో తెలంగాణ ఆర్థిక వృద్ధి గణనీయంగా పెరిగిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. తెలంగాణలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఆర్థిక వ్యవస్థ బలపడిందని, అన్ని వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేసినట్లు తెలిపారు. ఇదే సంకల్పంతో ముందుకు సాగుతామని.. అన్ని వర్గాల కోసం ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చినట్లు తెలిపారు.

PM Modi: తెలంగాణ అభివృద్ధికి కేంద్రం సహకరిస్తుంది.. ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు..
Pm Modi
Shaik Madar Saheb
|

Updated on: Mar 04, 2024 | 1:59 PM

Share

గత పదేళ్లలో తెలంగాణ ఆర్థిక వృద్ధి గణనీయంగా పెరిగిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. తెలంగాణలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఆర్థిక వ్యవస్థ బలపడిందని, అన్ని వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేసినట్లు తెలిపారు. ఇదే సంకల్పంతో ముందుకు సాగుతామని.. అన్ని వర్గాల కోసం ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చినట్లు తెలిపారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశాభివృద్ధికి కృషి చేస్తోందంటూ వివరించారు. ఆదిలాబాద్‌ జిల్లా పర్యటనలో భాగంగా.. 6 వేల 697 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు..ప్రధాని మోదీ. NTPC ప్రాజెక్ట్‌ సెకండ్‌ ఫేజ్‌ విద్యుత్‌ప్లాంట్‌ జాతికి అంకితం చేశారు. అలాగే ఆరు ప్రాజెక్టులకు వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు ప్రధాని. అండర్‌ డ్రైనేజ్ కాలువ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఆదిలాబాద్‌-బేల-మహారాష్ట్ర రోడ్డు విస్తరణ పనులకు కూడా సభలో భూమిపూజ చేశారు ప్రధాని మోదీ. ప్రధాని సభలో సీఎం రేవంత్‌రెడ్డితో పాటు గవర్నర్ తమిళసై, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. కేంద్ర పెద్దన్న పాత్ర పోషిస్తూ.. సహకారం అందించాలని కోరారు. గుజరాత్‌లా తెలంగాణ అభివృద్ధి చెందాలంటే..ప్రధాని మోదీ కీలక పాత్ర పోషించాలని సీఎం రేవంత్ కోరారు. అనంతరం నరేంద్ర మోదీ మాట్లాడుతూ.. దేశంలోని అనేక రాష్ట్రాలు అభివృద్ధిలో దూసుకెళ్తున్నాయని.. తెలంగాణ ఏర్పడి పదేళ్లు అయిందని గుర్తుచేశారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం సహకరిస్తుందని మోదీ తెలిపారు. పేదలు, దళితులు, ఆదివాసీల అభివృద్ధికి కృషి చేస్తున్నామన్నారు. గత పదేళ్లలో పేదరికం నుంచి 25 కోట్ల మంది బయటపడ్డారని.. మోదీ తెలిపారు. ఆర్థిక వ్యవస్థ బలపడితే దేశంపై విశ్వాసం పెరుగుతుందన్నారు.

ప్రధాని మోదీ మాట్లాడిన వీడియో చూడండి..

తెలంగాణలో హైవేలను అభివృద్ధి చేస్తున్నామని.. అభివృద్ధికి సహకారం అందిస్తామని ప్రధాని మోదీ తెలిపారు. వికసిత్‌ భారత్‌ కోసం బీజేపీ ఎల్లవేళలా కృషి చేస్తుందన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ఓపిక ఉన్నవాడిదే లోకం.. తనయులకు తండ్రి నేర్పని గొప్ప పాఠం..!
ఓపిక ఉన్నవాడిదే లోకం.. తనయులకు తండ్రి నేర్పని గొప్ప పాఠం..!
యూరప్‌లో కొత్త మిత్రుడి కోసం భారత్ వేట.. కారణం ఇదే..!
యూరప్‌లో కొత్త మిత్రుడి కోసం భారత్ వేట.. కారణం ఇదే..!
స్క్వాడ్‌లోనే లేడు.. కట్‌చేస్తే.. టాస్ టైంకి ప్లేయింగ్ 11లోకి..!
స్క్వాడ్‌లోనే లేడు.. కట్‌చేస్తే.. టాస్ టైంకి ప్లేయింగ్ 11లోకి..!
బ్యాచిలర్స్ ఫేవరెట్ రెసిపీ.. చపాతీ, రైస్ రెండింటికీ ఇదే పర్ఫెక్ట్
బ్యాచిలర్స్ ఫేవరెట్ రెసిపీ.. చపాతీ, రైస్ రెండింటికీ ఇదే పర్ఫెక్ట్
ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యపై తుపాకీతో కాల్పులు..!
ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యపై తుపాకీతో కాల్పులు..!
ఆటలో కోహ్లీని మించిన తోపు.. సెలెక్టర్ల దృష్టిలో పనికిరానోడు
ఆటలో కోహ్లీని మించిన తోపు.. సెలెక్టర్ల దృష్టిలో పనికిరానోడు
10 గ్రాముల బంగారు గొలుసుపై లోన్‌ తీసుకుంటే ఎంత డబ్బు వస్తుంది?
10 గ్రాముల బంగారు గొలుసుపై లోన్‌ తీసుకుంటే ఎంత డబ్బు వస్తుంది?
నిద్రలో ఉన్న భార్యను కాల్చి చంపేందుకు భర్త యత్నం..!
నిద్రలో ఉన్న భార్యను కాల్చి చంపేందుకు భర్త యత్నం..!
మహిళల కోసం ట్రిప్స్.. ఎందుకో చెప్పిన కమల్ హాసన్ మేనకోడలు
మహిళల కోసం ట్రిప్స్.. ఎందుకో చెప్పిన కమల్ హాసన్ మేనకోడలు
పవన్ కల్యాణ్‌ను కలిసిన అల్లు అర్జున్! ఆరోగ్య పరిస్థితిపై ఆరా
పవన్ కల్యాణ్‌ను కలిసిన అల్లు అర్జున్! ఆరోగ్య పరిస్థితిపై ఆరా