Hyderabad: కేబీహెచ్‌బీ మెట్రోస్టేషన్ వద్ద తిరుగుతున్నారా? ఇక ఈ విషయాలు తెలుసుకోకుంటే తిప్పలే..

కేబీహెచ్‌బీ.. హైదరాబాద్‌లో ఉంటున్న ప్రతి కుర్రకారుకు ఈ పేరు తెలిసే ఉంటుంది.. చికటి పడితే చాలు కుర్రాళ్లు గుంపులు గుంపులుగా కేబీహెచ్‌బీ మెట్రో వద్ద తిరుగుతూ ఉంటారు.. అలాంటి వారికి హైదరాబాద్ పోలీసులు షాక్ ఇచ్చారు. గుంపులు గుంపులుగా తిరిగితే ఇక మీ పని అంతే..

Hyderabad: కేబీహెచ్‌బీ మెట్రోస్టేషన్ వద్ద తిరుగుతున్నారా? ఇక ఈ విషయాలు తెలుసుకోకుంటే తిప్పలే..
Cops Focusing On Anti Social Elements
Follow us
Vijay Saatha

| Edited By: Ravi Kiran

Updated on: Oct 26, 2024 | 9:23 PM

కూకట్‌పల్లి దగ్గర ఉన్న కేబీహెచ్‌బీ మెట్రో స్టేషన్ దగ్గర ఉన్న భాగ్యనగర్ బస్ స్టాప్ కేంద్రంగా అసాంఘిక చర్యలు కొనసాగుతున్నాయి. చీకటి పడిందంటే చాలు ఇక్కడ కొంతమంది యువతులు గుంపులుగా చేరి వ్యభిచారాన్ని ప్రోత్సహిస్తున్నారు. కొందరు యువతులు అసాంఘిక చర్యలకు పాల్పడుతున్నారు.

స్థానికులు కొంతమంది పోలీసులకు ఈ వ్యవహారంపైన ఫిర్యాదు చేశారు. దీంతో కూకట్‌పల్లి పోలీసులతోపాటు షీ టీమ్స్, యాంటి హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్లు కలిసి జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు. 50 మంది పోలీసులు పక్కా సమాచారంతో ఈ ఆపరేషన్ నిర్వహించి 31 మంది యువతులను అదుపులోకి తీసుకున్నారు. వీరంతా చీకటి వేళల్లో బస్ స్టాప్‌లో ఉండే వారిని టార్గెట్ చేస్తూ వ్యభిచారానికి ప్రోత్సహిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

పోలీసుల ఆపరేషన్‌లో వీళ్ళందర్నీ అదుపులోకి తీసుకొని కూకట్‌పల్లి తహసీల్దార్ ముందు హాజరు పరిచారు. గతంలో సైతం కూకట్‌పల్లి పోలీసులు ఇలాంటి ఆపరేషన్‌‌ను నిర్వహించారు. ఇప్పుడు 31 మందిని అదుపులోకి తీసుకోగా గతంలో 22 మందిని కూకట్‌పల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీళ్ళందర్నీ కూకట్‌పల్లి తహసిల్దార్ ముందు హాజరు పరిచి బైండోవర్ చేశారు. మరోసారి వీరు ఇలాంటి చర్యలకు పాల్పడకుండా కౌన్సిలింగ్ నిర్వహించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!
పొలానికి వెళ్లి బిత్తరపోయిన రైతు.. ఎదురుగా కనిపించింది చూడగా
పొలానికి వెళ్లి బిత్తరపోయిన రైతు.. ఎదురుగా కనిపించింది చూడగా
హీరోయిన్‌ను లాగిపెట్టి కొట్టిన డైరెక్టర్.. క్లారిటీ..!
హీరోయిన్‌ను లాగిపెట్టి కొట్టిన డైరెక్టర్.. క్లారిటీ..!
గెస్ట్ హౌస్ లో థాయీ మసాజ్ !! పోలీసులు చెక్ చేసేసరికీ..
గెస్ట్ హౌస్ లో థాయీ మసాజ్ !! పోలీసులు చెక్ చేసేసరికీ..
అద్భుతం.. మామిడి చెట్టులో నరసింహస్వామి దర్శనం !!
అద్భుతం.. మామిడి చెట్టులో నరసింహస్వామి దర్శనం !!
టోల్‌ప్లాజా వద్ద సాధారణ తనిఖీలు.. పోలీసులు చెక్ చేస్తుండగా
టోల్‌ప్లాజా వద్ద సాధారణ తనిఖీలు.. పోలీసులు చెక్ చేస్తుండగా
తాలిబన్ల ఆర్డర్.. ఇంట్లో వంట గదికి కిటికీలు వద్దే వద్దట !!
తాలిబన్ల ఆర్డర్.. ఇంట్లో వంట గదికి కిటికీలు వద్దే వద్దట !!